అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పని తేలితే... క్షమాపణ చెబుతా... చంద్రబాబు నాయుడు

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తప్పు జరగిందని ప్రజలు భావిస్తే... బహిరంగ క్షమాపణ చెప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిపై నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం ఆపోహలు సృష్టిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. ప్రతి రాష్ట్రానికి రాజధాని నుండే అధిక ఆదాయాలు వస్తున్నాయని, అందుకే ఏపీకి రాజధాని నిర్మాణం చేపట్టానని వివరించారు.

 రాజధానిపై రౌండ్ టేబుల్ సమావేశం

రాజధానిపై రౌండ్ టేబుల్ సమావేశం

ప్రజా రాజధాని అమరావతి పేరిట టీడీపీ విజయవాడలో రౌండ్‌టేబులు సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ మినహా ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గోన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రాజధాని ప్రాంతంలో చేపట్టిన పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. అమరావతి ప్రాజెక్టుపై చర్చించే విధంగా చర్యలు చేపట్టాలని సమావేశంలో పాల్గోన్న ఆయన కోరారు. రాష్ట్ర ప్రజలకు రాజధాని అనేది ఆదాయ వనరు అని...దానిపై ప్రజల్లో అవగాహాన కల్పించడానికే ఈ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు.

రాజధాని నిర్మాణంపై పార్టీల మధ్య విభేదాలు

రాజధాని నిర్మాణంపై పార్టీల మధ్య విభేదాలు

ఏపీ రాజధాని నిర్మాణంపై ఇటివల గందరగోళం నెలకొన్న నేపథ్యంలోనే అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నాయి. రాజధానిలో నిర్మాణాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయిన ఏపీ మంత్రులు వ్యాఖ్యనించడంతో పాటు అక్కడి నిర్మాణాలకు కూడ ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో తమ హాయంలో ప్రారంభమైన రాజధాని నిర్మాణాలను కాపాడుకునేందుకు టీడీపీ నడుం బిగించింది. ఈనేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో ఇటివల పర్యటన కొనసాగించిన టీడీపీ అధినేత మరోసారి అదే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను వెల్లడించారు.

 అమరావతి నిర్మాణం తప్పని భావిస్తే... క్షమాపణలు చెబుతా...

అమరావతి నిర్మాణం తప్పని భావిస్తే... క్షమాపణలు చెబుతా...

ఈ సంధర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను చేపట్టిన ప్రాజెక్టు తప్పు అని ప్రజలు భావిస్తే క్షమాపణ చెప్పడానికి కూడ సిద్దంగా ఉన్నానని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం నిర్మాణాలు పనులను కొనసాగించి ఉంటే అధికారులు , ఇతర ప్రజా ప్రతినిధులు అక్కడే ఉండేవారని ఆయన అన్నారు. ఇక నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ప్రతి రోజు 50 వేల మంది కార్మికులు పని చేసేవారని అన్నారు. ఇక రాజధాని నిర్మాణం అనేది అదాయ వనరుగా భావించాలని అన్నారు. రాజధాని లేకపోతే...ఆదాయం సృష్టించడం కష్టమని అన్నారు. సంపద లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగడం కూడ కష్టతరమవుతాయని ఆయన వివరించారు.

ఆరోగ్య శ్రీ పేరుతో ఆదాయం ఇతర రాష్ట్రాలకు

ఆరోగ్య శ్రీ పేరుతో ఆదాయం ఇతర రాష్ట్రాలకు


ఇక ఏపీ ప్రజల ఆదాయాన్ని ఇతర రాష్ట్రాలకు చేర్చేందుకు సీఎం జగన్ నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శ్రీ సేవల పేరుతో హైదరాబాద్ ,బెంగళూరు, చెన్నై పట్టణాలకు ఏపీ ఆదాయాన్ని చేరేవేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధానులు ఉండడం వల్లే అసుపత్రులు వచ్చాయనే అంశాన్ని సీఎం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అమరావతిలో ఆసుపత్రులు లేవని ఇతర రాష్ట్రాలకు రాష్ట్రా ఆదాయాన్ని దోచి పెట్టడడం కరెక్టు కాదని చంద్రబాబు అన్నారు.

హైదారాబాద్ కంటే మెరుగైన రాజధాని

హైదారాబాద్ కంటే మెరుగైన రాజధాని

ఏపీ ప్రజలు కలలు కనే విధంగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టామని చంద్రబాబు వ్యాఖ్యానించారు..ఈ నేపథ్యంలోనే అమరావతిలో సుమారు 5వేల పేదల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, రాజధాని ఏర్పాటు తర్వాత అక్కడ సుమారు 11 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు కూడ జరిగాయని ఆయన తెలిపారు. దీని ద్వార ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైదారాబాద్ కంటే మెరుగైన రాజధానిని నిర్మించుకునే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
TDP chief Chandrababu naidu ready to apologize publicly if people think that the construction of AP capital Amaravati has gone wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X