వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీపై గతంలో ఉన్న వ్యతిరేకత ప్రజల్లో లేదు... చంద్రబాబు నాయుడు

|
Google Oneindia TeluguNews

టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్థుత రాజకీయాలు, పార్టీ ఓటమిపై చర్చించేందుకు సీనియర్ నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈనేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో జూన్ 15న పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలోనే భవిష్యత్ కార్యచరణపై పార్టీ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

ఈనేపథ్యంలోనే పన్నేండవ తేదీనుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కూడ ఆయన చర్చించారు. ఈనేపథ్యంలనే అసెంబ్లీలో నిర్మాత్మకమైన విమర్శలు చేస్తూ ప్రభుత్వానికి సరైన సలహాలు సూచనలు ఇస్తామని చెప్పారు.దీంతో బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడ ఈ సమావేశంలో చర్చించారు.

TDP chief Chandrababu Naidu strongly condemned the attacks on TDP activists

ఇక టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చంద్రబాబు వివరించారు. ఈనేపథ్యంలోనే గతంలో పార్టీపై వ్యతిరేకత కనిపించినా.. ప్రస్థుత ఎన్నికల్లో పార్టీపై వ్యతిరేకత కనిపించలేదని ఆయన చెప్పారు. అయితే సామాజిక సమీకరణలతో పాటు వైసీపీ రాజకీయా వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రభావం కనపడిందని చంద్రబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన చెప్పినట్టు సమాచారం. టీడీపీ హయాంలో ప్రారంభమైన పనులను పక్కన పెట్టేందుకే కొత్త ప్రభుత్వం ఈ తరహా ఆలోచనలు చేస్తోందని నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. తెలుగుదేశం ప్రభుత్వంలోని నాయకులపై అవినీతి ముద్ర వేయడానికే టెండర్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని నేతలు పేర్కోన్నారు.

English summary
TDP chief Chandrababu Naidu strongly condemned the attacks on TDP activists. Chandrababu met with senior leaders to discuss the defeat. He said the party will have a wide range of meetings on June 15 with candidates losing their seats in the elections.This will be discussed at a party meeting on future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X