కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్: జగన్ కోటను బద్దలు కొట్టడానికి బాబు ప్లాన్, కలిసిరాని తమ్ముళ్ళు

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ స్వంత జిల్లా కడపలో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాలు రచిస్తోంటే పార్టీ నాయకులు మాత్రం ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ స్వంత జిల్లా కడపలో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాలు రచిస్తోంటే పార్టీ నాయకులు మాత్రం ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.ఈ తీరుపట్ల చంద్రబాబు గుర్రుగా ఉన్నారు.పనితీరు మార్చుకోవాలంటూ బాబు కడపనేతలను హెచ్చరించారు.

రాయలసీమ జిల్లాల్లో టిడిపిని బలోపేతం చేసేందుకుగాను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఆయన వాడుకొంటున్నారు.

అయితే వైసీపీ నుండి టిడిపిలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించారు చంద్రబాబునాయుడు.అయితే ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి వర్గీయులు వ్యతిరేకించినా బాబు మాత్రం ఒప్పుకోలేదు.

అయితే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని టిడిపి నాయకుల్లో తీవ్రమైన అంతర్గతపోరు సాగుతోంది. అయితే ఈ పోరు బహిరంగంగా మారింది.అయితే ఈ విషయాలపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహంతో ఉన్నారు.

కడప జిల్లా టిడిపి నేతల తీరే వేరు

కడప జిల్లా టిడిపి నేతల తీరే వేరు

కడప జిల్లా టిడిపి నేతల తీరే వేరంటూ టిడిపి అధినేత చెబుతుంటారు. జిల్లా పర్యటనలకు వచ్చిన సమయంలోనూ, పార్టీ నాయకులతో బాబు సమావేశమైన సమయంలోనూ బాబు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని పార్టీ నాయకులు చెబుతుంటారు.కలిసికట్టుగా పనిచేయాలని బాబు చెప్పినమాటలను పార్టీ నాయకులు పెడచెవిన పెడుతుంటారు.జగన్ ను కట్టడిచేసేందుకుగాను నాయకులు కలిసికట్టుగా పనిచేయకపోవడం వల్లే పార్టీకి మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది.

10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి

10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి

కడపజల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పార్టీ నాయకుల మద్య సఖ్యత లేదు. ఒకరిపై మరోకరు ఫిర్యాదు చేసుకోవడం, ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కడప జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, పార్లమెంట్ ఇన్ చార్జ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జిల్లాల్లో పర్యటిస్తున్న కడప తమ్ముళ్ళను మాత్రం దారిలో పెట్టలేకపోతున్నారు.

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బాహబాహీ

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బాహబాహీ

కడప జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు బహిరంగంగానే గొడవలు పడుతున్నారు.ప్రొద్దుటూరు మున్సిఫల్ చెర్మెన్ ఎన్నిక విషయంలో పార్టీలోని రెండు వర్గాలు బహిరంగంగానే వ్యవహరించిన తీరు పార్టీకి చెడ్డపేరు తెచ్చిందని పార్టీ నాయకత్వం అభిప్రాయపడింది.ఈ మేరకు ఈ ఘటనపై బాబు సీరియస్ అయ్యారు.దీంతో రాజీ ఫార్మూలాను అనుసరించిన మీదట రెండు రోజుల క్రితం మున్సిఫల్ చెర్మెన్ గా ఆనం రఘురామిరెడ్డి ఎన్నికయ్యారు.ప్రత్యర్థివర్గానికి నామినేటేడ్ పోస్టును ఇస్తామని రాజీ కుదిర్చారు.అయితే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి రాకుండా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు తీవ్రంగానే ప్రయత్నించారు.ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి వచ్చిన తర్వాత రామసుబ్బారెడ్డి వర్గీయులు ఎంపి సిఎం రమేష్ పై పార్టీ కార్యకర్తల సమావేశంలోనే కుర్చీలు విసిరారు.

వైసీపీ కోటను బద్దలు కొట్టడం సాధ్యమేనా?

వైసీపీ కోటను బద్దలు కొట్టడం సాధ్యమేనా?

కడప జిల్లాలో పార్టీని బలోపేతం కావాలంటే వైసీపీని బలహీనపర్చాలి.అయితే పార్టీలో ఉన్న నాయకులు సమిష్టిగా వ్యవహరించే పరిస్థితి లేకపోవడంతో వైసీపీ కోటను బద్దలు కొట్టడం కష్టమేననే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని టిడిపి ఓడించింది.అయితే ఈ విషయంలో పార్టీ నాయకులు ముందు నుండి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే అదే తరహాలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే టిడిపికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి.కాని, సమిష్టిగా వ్యవహరించకపోతే జగన్ కోటను బద్దలు కొట్టడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి ఈ జిల్లా నుండి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలంటే పార్టీ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Tdp chief Chandrababu naidu warned to Kadapa Tdp leaders change their attitude. Tdp state leadership planning to strengthen Tdp in Kadapa district, but some of party leaders won't change their attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X