చంద్రబాబును ఇరికించిన కోడ్ లాంగ్వేజ్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటోన్నారాయన. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.
తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ కేసులో ఐటీ శాక అధికారులు దర్యాప్తు సాగిస్తోన్న కొద్దీ.. కొత్త విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి.

చంద్రబాబు కోడ్ భాష వాడినట్లు తేలింది. 8,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపుల రూపంలో తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా 118 కోట్ల రూపాయలను తీసుకున్నారని, ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండటానికి కోడ్ లాంగ్వేజ్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది.
ముడుపుల రూపంలో అందిన డబ్బును ఏఏ ప్రాంతాలకు ఎలా బదిలీ చేయాలనే విషయం ఎక్కడా బయటపడకుండా ఉండేలా పగడ్బందీగా కోడ్ భాషను ఉపయోగించారని చెబుతున్నారు. హైదరాబాద్‌కు డబ్బును తరలించడానికి HYD అనే కోడ్ వాడారు. విజయవాడలోని తమ అనుయాయులకు పంపించడానికి విజయ్అని, విశాఖపట్నానికి విష్ అనే పదాలను వాడారు.
బెంగళూరుకు డబ్బును తరలించడానికి బాంగ్ అని వారి మధ్య వాట్సాప్ చాట్ సంభాషణ నడిచిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా సర్కులేట్ అవుతున్నాయి. దీనితో పాటు ఎక్కడా డబ్బుకు సంబంధించి క్యాష్ అనే పదం వాడలేదు. క్యాష్ అనే చోట స్టీల్ అనే పదాన్ని వాడారు. స్టీల్ అంటే డబ్బు అని, దాన్ని టన్నుల్లో పేర్కొన్నారు.
టన్ను అంటే కోటి అనే అర్థం వచ్చేలా వారి మధ్య కోడ్ భాషను ఏర్పాటు చేసుకుని టన్నుల్లో కోట్లను కొట్టేశారనే విమర్శలు చంద్రబాబుపై వెల్లువెత్తుతున్నాయి. ఆయా కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్‌గా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చంద్రబాబు పీఏకు మధ్య నడిచిన చాట్ సంభాషణ, డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలను సైతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆయా సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించి, చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు అయన సమాధానం ఇవ్వట్లేదు. ఐటీ అధికారులు తమ పరిధి ఏమిటో తెలుసుకోవాలని, తనకు నోటీసులు ఇచ్చే అధికారం హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు లేదనేది చంద్రబాబు వాదన.
సెంట్రల్ ఆఫీస్‌కు ఏ కేసును బదిలీ చేయకుండానే తనకు నోటీసులు ఇచ్చారంటూ చంద్రబాబు ఎదురుదాడికి దిగడం ఆయన అసహనానికి అద్దం పడుతోందని విమర్శిస్తోన్నారు. చంద్రబాబుకు 2022 అక్టోబర్ 10, 27, 2023 జనవరి 31, జూన్ 20 తేదీల్లో ఆదాయపు పన్ను అధికారులకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను ఐటీ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.












Click it and Unblock the Notifications