వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటవిక రాజ్యంగా ఏపీ- దళితులు, జర్నలిస్టులపై దాడులు- డీజీపీకి చంద్రబాబు లేఖ...

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత ఏడాది కాలంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. గూండాలు, మాఫియా శక్తులన్నీ ఏకమై రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతం సవాంగ్‌ కు చంద్రబాబు ఇవాళ ఓ లేఖ రాశారు.

Recommended Video

Coronavirus in AP: మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాగా తూర్పుగోదావరి, 4 జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు!!

రాష్ట్రంలోని తుని, నెల్లూరు, చీరాల తదితర ప్రాంతాల్లో జర్నలిస్ట్ లపై దాడులు జరుగుతున్న విషయాన్ని చంద్రబాబు డీజీపీ దృష్టికి తెచ్చారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు పంచాయితీలో తెలుగు దినపత్రిక జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై పట్టపగలు దాడి చేయడమే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది అధికార వైసీపీ నేతలే కావడంతో పోలీసులు విషయంబయటికి రాకుండా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.

tdp chief chandrababu seek dgp action on latest attacks, law & order failures in state

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఇటీవలే ఇద్దరు దళితుల అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని చంద్రబాబు ఆరోపించారు. కూడా జరిగాయి. దళిత వర్గానికి చెందిన ఎం నారాయణ, ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఆయన గుర్తుచేశారు. మంత్రి నియోజకవర్గం పుంగనూరులో క్షీణించిన శాంతి భద్రతలకు ఇదే నిదర్శనమన్నారు. ఒక్క పుంగనూరు నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు పట్టపగలు జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై జరిగిన దాడి కన్నా, మరో సాక్ష్యం అవసరం లేదని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యానికే ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియా.

జర్నలిస్ట్ లపై ఇటువంటి విచ్చలవిడి దాడులు కొనసాగితే, దీర్ఘకాలంలో ప్రజాస్వామ్యం ఉనికినే కోల్పోతుందని చంద్రబాబు తెలిపారు. జర్నలిస్ట్ లపై దాడులు భారత రాజ్యాంగానికే వ్యతిరేకం, ఆర్టికల్ 19ను ఉల్లంఘించడం, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమే..కాబట్టి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను అని చంద్రబాబు తన లేఖలో డీజీపీ సవాంగ్‌ కు తెలిపారు.

English summary
telugu desam party president chandrababu naidu wrote a letter to dgp gowtham sawang today. in this letter naidu critisizes latest attacks on dalits and journalists in the state and seek action against the culprits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X