వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ శాసిస్తాడు..స్పీక‌ర్ పాటిస్తాడు: అసెంబ్లీని పులి వెందుల పంచాయితీ చేసారు : చ‌ంద్ర‌బాబు ఫైర్..

|
Google Oneindia TeluguNews

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై ఫైర్ అయ్యారు. ఆయ‌న ఇచ్చిన హామీల‌నే ప్ర‌స్తావిస్తే స‌స్పెండ్ చేస్తారా అని నిల‌దీసారు. ఒక బీసీ నేత‌ను స‌స్పెండ్ చేసి బీసీ బిల్లు అమోదిస్తారా అని ప్ర‌శ్నించారు. బీసీలు టీడీపీ వైపే ఉంటార‌ని..బీసీ సంక్షేమానికి కేటాయింపులు ఎందుకు త‌గ్గించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన విష‌యాన్ని వీడియో ద్వారా చంద్రబాబు ప్ర‌ద‌ర్శించారు. అసెంబ్లీలో జ‌గ‌న్ శాసిస్తాడ‌ని..స్పీక‌ర్ పాటిస్తాడంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీని పులి వెందుల పంచాయితీ చేసారంటూ ఫైర్ అయ్యారు.

అసెంబ్లీని పులివెందుల పంచాయితీ చేసారు..
శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన ప‌రిణామాల పైన ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లోనే
45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని చెప్పార‌ని చంద్ర‌బాబు ఆధారాలు ప్ర‌ద‌ర్శించారు. జగన్ ప్రకటన చూసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లు ఆశపడి ఓట్లు వేశారన్నారు. మాట తప్పం..మడమ తిప్పం.. 45 ఏళ్లకే పింఛన్..ఒక్క ఏడాది ఓపిక పట్టండి..వచ్చేది మన ప్రభుత్వమే ఆ తర్వాత 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. అర్హులందరికి పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తున్న వీడియోను చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శించారు. అదే విధంగా ఒక ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూను చూపించారు. ఇలా మాట ఇచ్చిన జ‌గ‌న్ ఇప్పుడు త‌న మాట ఎందుకు నిల‌బెట్టుకోవ‌టం లేదంటూ ప్ర‌శ్నించారు.అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శాసిస్థా డ‌ని..స్పీక‌ర్ పాటిస్తాడంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీని జ‌గ‌న్ పులివెందుల పంచాయితీగా మార్చేసారంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

TDP Chief Chandra Bbau serious allegations on CM Jagan. He says jagan changed Assembly as Pulivendula pachayati.

బీసీలు ఎప్ప‌టికే టీడీపీ వైపే..
జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్ని చెప్పినా..బీసీలు టీడీపీకి వెన్నుముక అని..వారెప్పుడూ టీడీపీతోనే ఉంటారంటూ చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని అడిగితే.. ముగ్గురు డిప్యూటీ లీడర్లను సభ నుంచి సస్పెండ్‌ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీని నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని, అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహ రిస్తోందని ఆయన విమర్శించారు. సీట్లోనే ఉన్న అచ్చెన్నాయుడిని సస్పెండ్‌ చేశారన్నారు. త‌మకు మైక్‌ ఇవ్వకుండా ఏకపక్షంగా అసెంబ్లీ నడుపుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీ నాయకుడిని సస్పెండ్‌ చేసి.. బీసీ బిల్లు పెట్టి ఎలా న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అదే విధంగా రైతు భ‌రోసా ద్వారా 12500 ఇస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్..ఇప్పుడు కేంద్రం ఇస్తున్న ఆరు వేల‌ను అందులోనే చేర్చి..కేవ‌లం 6500 ఇచ్చి రైతుల‌ను మోసం చేస్త‌న్నార‌ని ఆరోపించారు. చీరాల‌లో ఆమంచి కార‌ణంగా వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేసారు. ప్ర‌భుత్వం మీద ఇప్ప‌టికే వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని.. ప్ర‌భుత్వం ఏం చేసినా తాము ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌తామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసారు.

English summary
TDP Chief Chandra Bbau serious allegations on CM Jagan. He says jagan changed Assembly as Pulivendula pachayati. Chandra Babu confident on BC sections always with TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X