హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాజ్‌పేయితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు: 20 ఏళ్ల నాటి ఫొటోతో: కారణం?

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోవడానికి ఇష్టపడనట్టే కనిపిస్తోంది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి.. తప్పటడుగు వేసినట్లు ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పుకొన్న ఆయన.. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాల్లో పడ్డారనేది బహిరంగ రహస్యమే. తాజాగా- కమలనాథులకు ఆరాధ్యుడైన దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయితో ఉన్న అనుబంధాన్ని ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు.

ఇంటర్నేషన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ) హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఓ ఫొటోను చంద్రబాబు కొద్దిసేపటి కిందటే రీట్వీట్ చేశారు. 2001 నాటి ఫొటో అది. ఈ క్యాంపస్ ప్రారంభ కార్యక్రమంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ సీ రంగరాజన్, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి హాజరయ్యారు. వారితో ఆనంద్ మహీంద్రా, అనిల్ అంబానీ వంటి హేమాహేమీల్లాంటి పారిశ్రామికవేత్తలు కలిసి దిగిన గ్రూప్ ఫొటోను ఐఎస్‌బీ ట్వీట్ చేయగా.. దాన్ని చంద్రబాబు రీట్వీట్ చేశారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

TDP Chief Chandrababu shared photo along with former pm Atal Bihari Vajpayee

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బిజినెస్ స్కూల్‌.. హైదరాబాద్‌లో ఏర్పాటు కావడానికి తానే కారణమని చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించడానికి తాను చేసిన అనేక ప్రయత్నాల్లో ఇదీ ఒకటి అని పేర్కొన్నారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, దిగ్గజ పారిశ్రామికవేత్తల సహకారంతో తన ప్రయత్నాలు ఫలించాయని, అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైందని చెప్పార. ఐఎస్‌బీ హైదరాబాద్ క్యాంపస్ ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అనేక రకాల చర్చకు దారి తీస్తోంది.

Recommended Video

SR NTR 25th డెత్ Anniversary : Politicians & Party Leaders Pays Tribute at NTR Ghat

English summary
Telugu Desam Party Chief Chandrababu Naidu shared a photo along with Former Prime Minister Atal Bihari Vajpayee on Friday occasion of Inauguration of ISB's Hyderabad campus. Chandrababu says that On a piece of land I'd earmarked stands a world-class higher education institute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X