• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ, తెలంగాణ వార్ లో మళ్లీ నలిగిపోతున్న చంద్రబాబు- అందుకే సైలెన్స్- నోరెత్తితే ఇరకాటమే

|

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రెండింటిలో దేన్నీ సమర్ధించలేక ఇబ్బందులు పడిన తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకూ మరోసారి అలాంటి ఇరకాటమే ఎదురవుతోంది. తాజాగా ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన జల వివాదాలు టీడీపీ ఉసురుపోసేలా కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిన పరిస్ధితుల్లో చంద్రబాబు మౌనాన్నేై ఆశ్రయిస్తున్నారు. కాలాన్నే నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా అంతిమంగా ఇబ్బందులు తవ్పవన్న భావనలోకి చంద్రబాబు వెళ్లిపోతున్నారు.

 పతాకస్ధాయికి ఏపీ, తెలంగాణ వాటర్ వార్

పతాకస్ధాయికి ఏపీ, తెలంగాణ వాటర్ వార్

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వాటర్ వార్ పతాక స్దాయికి చేరుకుంది. రాయలసీమ లీఫ్ట్ తో మొదలైన వివాదం కాస్తా శ్రీశీలం, పులిచింతలకు పాకడంతో కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద పోలీసుల్ని మోహరించాల్సిన పరిస్ధితి ఇరు రాష్ట్రాలకు తలెత్తింది. అదే సమయంలో కేంద్రంతో పాటు ప్రధాని మోడీ, జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్, కృష్ణా రివర్ బోర్డుకు ఇరు ప్రభుత్వాలు లేఖలు రాస్తుండటం, అక్కడి నుంచి వివరణ కోరుతూ లేఖలు రావడం ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకూ కలిసి ప్రయాణం చేసిన కేసీఆర్, జగన్ ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారిపోతున్నారు.

 వాటర్ వార్ తో చంద్రబాబుకు ఇరకాటం

వాటర్ వార్ తో చంద్రబాబుకు ఇరకాటం

ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న జల వివాదాలతో అందరి కంటే ఎక్కువగా ఇరుకున పడుతుంది టీడీపీ అధినేత చంద్రబాబే. ఇప్పటికే రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఏపీలో జవజీవాలు కోల్పోయిన టీడీపీని తిరిగి గాడిన పెడుతున్న సమయంలో ఈ వాటర్ వార్ తెరపైకి వచ్చింది. దీంతో టీడీపీ నేతలకు ఈ విషయంలో ఎలా స్పందించాలో తెలియని పరిస్ధితి. ముఖ్యంగా చంద్రబాబుకు వాటర్ వార్ పై నిర్ధిష్ట వైఖరి తీసుకోలేని పరిస్ధితి ఏర్పడుతోంది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఏపీ, తెలంగాణలో ఏదో ఒక చోట బ్యాడ్ కావడం ఖాయమనే ఆందోళన ఆయనలో పెరుగుతోంది.

 వాటర్ వార్ పై చంద్రబాబు సైలెన్స్

వాటర్ వార్ పై చంద్రబాబు సైలెన్స్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అప్రతిహతంగా ఏలిన టీడీపీ.. ఏపీ, తెలంగాణ విభజన సమయంలో కుదేలైంది. ముఖ్యంగా విభజన సమయంలో ఏపీ కలిసుండాలా, విడిపోవాలా అనే విషయంలో చంద్రబాబు చాలా వరకూ మౌనంగానే ఉన్నారు. అయినా మీడియాతో పాటు తెలంగాణ వాదులు నిలదీస్తున్న క్రమంలో ఆయన విభజనకు వ్యతిరేకంగా మాట్లాడలేక, అలాగని సమర్ధించలేక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజల్లో పలుచన అయ్యారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ వాటర్ వార్ సందర్భంగా కూడా చంద్రబాబు అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటున్నారు. జల వివాదాలపై ఏపీనో, తెలంగాణనో గంపగుత్తగా సమర్ధించే పరిస్ధితి టీడీపీకి లేదు. అందుకే చంద్రబాబు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.

 హుజురాబాద్ ఉపఎన్నికపై బాబు ఆశలు

హుజురాబాద్ ఉపఎన్నికపై బాబు ఆశలు

ఏపీ, తెలంగాణ మధ్య మొదలైన ఈ జల వివాదాలకు ప్రధాన కారణం హుజురాబాద్ ఉపఎన్నిక అనే ప్రచారం జరుగుతోంది. అక్కడ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ తెరపైకి తెచ్చారనే వాదనా ఉంది. అదే నిజమైతే అంతా ఊహిస్తున్నట్లుగానే హుజురాబాద్ ఉపఎన్నిక పూర్తయిన తర్వాత జల వివాదాలు సద్దుమణిగే అవకాశాలున్నాయి. అలా కాకుండా దీర్ఘకాలం పాటు ఈ వివాదం కొనసాగితే రెండేళ్ల తర్వాత తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపికి గడ్డు పరిస్ధితులు తప్పేలా లేవు. ఇప్పటికే టీడీపీ నుంచి దాదాపుగా క్యాడర్, నేతలంతా వలస వెళ్లిపోగా.. ఇక మిగిలిన నేతలతో రాజకీయం చేసే అవకాశాలు కూడా కనుమరుగు కావడం ఖాయం.

English summary
telugu desam party chief chandrababu lands in another trouble with ongoing ap, telangana water war as he maintains silence over water disputes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X