హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారా లోకేష్ హడావుడి, ముందువరుసలో నందమూరి హరికృష్ణ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీలో 2019 ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడం, తెలంగాణలో మళ్లీ తిరుగులేని శక్తిగా ఎదగడం లక్ష్యాలుగా అంతా పని చేయాలని తెలుగుదేశం కేంద్ర కమిటీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు రాష్ట్రాల్లోను ముందుకెళ్లాల్సి ఉందని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి సేవ చేస్తే కొంతమందికే చేయగలరని, ఒక రాజకీయ పార్టీ సేవాదృక్పథంతో పనిచేస్తే నీతి, నిజాయితీతో ఉంటే సమాజం మొత్తానికి సేవ చేయగలదన్నారు.

సేవ చేయడానికి కూడా అధికారం అవసరమన్నారు. అధికారం కావాలంటే ప్రజల్లో పార్టీ పట్ల మమకారం కల్పించాలన్నారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా ఎన్టీఆర్‌, ఆ తర్వాత తన హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనిపిస్తాయన్నారు.

ప్రమాణం చేయిస్తున్న చంద్రబాబు

ప్రమాణం చేయిస్తున్న చంద్రబాబు

టిడిపి కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు ఆదివారమిక్కడ ఎన్టీఆర్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశాయి. టిడిపి చరిత్రలో 15 రాష్ట్ర కమిటీల కాలపరిమితి ఇప్పటి వరకు ముగియగా 16వ కమిటీ ఏర్పాటులో జాతీయ పార్టీగా రూపుదాల్చింది.

ప్రమాణం చేస్తూ నారా లోకేష్, తదితరులు

ప్రమాణం చేస్తూ నారా లోకేష్, తదితరులు

చంద్రబాబు కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కళా వెంకట్రావు ఏపీ అధ్యక్షుడిగా, ఎల్‌ రమణ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా, రేవంత్ రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.

మాట్లాడుతున్న చంద్రబాబు

మాట్లాడుతున్న చంద్రబాబు

పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీల్లోని సభ్యులంతా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్‌ బాధ్యతలు స్వీకరించారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగు తమ్ముళ్ల కోలాహలం

ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగు తమ్ముళ్ల కోలాహలం

నీతి, నిజాయతీలతో సమాజం కోసం పని చేస్తామంటూ సాగే ప్రమాణాన్ని చంద్రబాబు పదవులు పొందిన అందరితో చేయించారు.

మాట్లాడుతున్న చంద్రబాబు

మాట్లాడుతున్న చంద్రబాబు

చంద్రబాబు మాట్లాడుతూ... నాడు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో లేరని, ఆనాటి సంఘటనలు, కాంగ్రెస్‌ అరాచకాలు ఆయన్ను పార్టీ పెట్టేదిశగా పురికొల్పాయని చెప్పారు. ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు.

నందమూరి హరికృష్ణ, సుజనా చౌదరి తదితరులు

నందమూరి హరికృష్ణ, సుజనా చౌదరి తదితరులు

చంద్రబాబు మాట్లాడుతూ... ఎండావాన లెక్కచేయకుండా తొమ్మిది నెలలు ప్రజల్లో తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్డీఆర్‌దే అన్నారు. జాతీయస్థాయిలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌ను గద్దె దించారని చంద్రబాబు పేర్కొన్నారు.

లోకేష్‌కు పుష్ప గుచ్ఛం

లోకేష్‌కు పుష్ప గుచ్ఛం

ప్రతి మూడునెలలకోసారి పార్టీ కమిటీలోని నాయకుల పని తీరుపై ప్రగతి నివేదికను రూపొందిస్తామని చంద్రబాబు పదవులు పొందిన వారిని హెచ్చరించారు. బాగా పనిచేసే నాయకులకు పెద్దపీట వేస్తామన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

చంద్రబాబు మాట్లాడుతూ... మామూలు వ్యక్తుల్ని కూడా అసాధారణ స్థాయికి తీర్చిదిద్దిన ఘనత టిడిపిదేనని చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

పార్టీ ఈ స్థాయిలో ఉందంటే.. నాయకులుగా ఇక్కడ ఉన్నామంటే అది కార్యకర్తల ఘనతేనని చంద్రబాబు ప్రశంసించారు. తన కుటుంబసభ్యులకంటే కార్యకర్తలే ఎక్కువ అన్నారు. దానికి కట్టుబడి ఉన్నానన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ... వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌లో ఎప్పుడో చార్మినార్‌ నిర్మించారని, ఆ తర్వాత చంద్రబాబు కేవలం తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌ నగరాన్నే నిర్మించారని కితాబిచ్చారు. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిని కూడా ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తారన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

చెప్పినట్లుగానే చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని కళా వెంకట్రావు అన్నారు. టిడిపిలో పని చేయడం మనందరి అదృష్టమన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పార్టీ కృషి చేసేలా చేస్తానన్నారు.

ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ

ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో మళ్లీ చోటు దక్కించుకున్న నందమూరి హరికృష్ణ తనకు కేటాయించిన సీటులో కూర్చున్న దృశ్యం. వెనుక నారా లోకేష్.

English summary
TDP chief Naidu administers oath to members of new committees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X