అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిపై బాధ్యత లేదా ? కేంద్రానికి బాబు సూటి ప్రశ్న - జగన్ వచ్చాకే నా కులంపై చర్చంటూ..

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట ప్రజలందరిపైనా ఉందని టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు తెలిపారు. రూపాయి కూడా ఖర్చుకాకుండా అమరావతి నిర్మించే అవకాశమున్నా జగన్ ప్రభుత్వం తనపై కక్షతోనే మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చిందని బాబు ఆక్షేపించారు. ఈ వ్యవహారంలో కేంద్రం కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై విశాఖలో సైతం సానుభూతి వ్యక్తమవుతోందని, కానీ జగన్ సర్కారు మాత్రం మొండిగా వ్యవహరిస్తూ రాజధాని తరలింపుకు సిద్ధపడుతోందని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతికి నిధులెందుకు ?

అమరావతికి నిధులెందుకు ?

అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల నిధులు అవసరం అవుతాయంటూ వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్‌ అని, ప్రభుత్వం రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత అందరికీ కేటాయింపులు అయిన తర్వాత 8 నుంచి 9 వేల ఎకరాలు మిగులుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతిలో ఇప్పటికే చాలా వరకూ పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా నామమాత్రపు ఖర్చు మాత్రమే అవుతుందన్నారు. ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా రాజధాని తరలింపుకు సిద్దపడటం దారుణమన్నారు

అమరావతిపై ఎందుకంత ద్వేషం ?

అమరావతిపై ఎందుకంత ద్వేషం ?

అమరావతిపై సీఎం జగన్ కు ఎందుకంత ద్వేషమని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూములు త్యాగం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు వారిని మోసం చేసి రాజధాని తరలిస్తే దేశంలో మరే ఇతర ప్రాజెక్టుకు కూడా రైతులు భూములిచ్చే పరిస్ధితులు ఉండవని టీడీపీ అధినేత హెచ్చరించారు. అమరావతి ప్రాంతంలోని వైసీపీ నేతలు జగన్‌ను భట్రాజు పొగడ్తలు పొగుడుతూ రైతుల త్యాగాలను తక్కువ చేసి చూపుతున్నారని మండిపడ్డారు. విశాఖ వాసులు కూడా అమరావతి రైతులపై కనికరం చూపుతుంటే ఈ ప్రాంత వైసీపీ నేతలు మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 జగన్ వచ్చాకే నా కులంపై చర్చ

జగన్ వచ్చాకే నా కులంపై చర్చ

ఓ కులం ప్రయోజనాల కోసమే తాను అమరావతి కోసం పట్టుబడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపైనా చంద్రబాబు స్పందించారు.
హైదరాబాద్ లో రాని కులం అమరావతిలో ఎందుకొస్తుందని, కావాలనే తన మీద కులం ముద్ర వేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలో ముప్ఫయ్యేళ్లుగా గెలుస్తున్నానని, ఏ కులం ఓట్లు వేస్తే గెలిచానని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ సామాజిక న్యాయం కోసం పోరాడే పార్టీ అని చంద్రబాబు గుర్తుచేశారు. అమరావతి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో ఎస్సీ, బీసీ, ముస్లింలు అధికంగా ఉన్నారని కానీ వైసీపీ మాత్రం తన కులం ముద్ర వేయాని చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వాస్తవానికి అమరావతిలో తనకు సెంటు భూమి కూడా లేదని చంద్రబాబు గుర్తుచేశారు.

 కేంద్రానికి బాధ్యత లేదా ?

కేంద్రానికి బాధ్యత లేదా ?

అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందేనని చంద్రబాబు మరోసారి కోరారు. ఒకప్పుడు తాము రాజధానిగా గుర్తించిన విషయంలో కేంద్రానికి బాధ్యత లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాల చర్యల వల్ల ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందేనన్నారు. ఉదాహరణకు పీపీఏల విషయంలో పెట్టుబడిదారులకు నష్టం జరుగుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని కొత్త చట్టం తెచ్చేందుకు సిద్దమైందని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి తరలిపోతే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని, దీన్ని అరికట్టేందుకు కేంద్రం జోక్యం తప్పనిసరని టీడీపీ అధినేత తెలిపారు.

English summary
telugu desam party chief chandrababu naidu on friday once again demands central government to be responsible on amaravati capital and intervene in shifting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X