ప్రిజనరీ పాలనలో ఏపీ మరో శ్రీలంకగా.. ఏపీని, శ్రీలంకతో పోలుస్తూ టీడీపీ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష టిడిపి నిరసన గళాన్ని వినిపిస్తోంది. ప్రిజనరీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతోందని జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతోంది. ఏపీకి, శ్రీలంకకు పోలిక చెబుతూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగిన టిడిపి శ్రీలంకలో చోటు చేసుకున్న సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ ఏపీ లో జగన్ పాలన వైఫల్యంతో అటువంటి సంక్షోభం ఏపీలోనూ రాబోతుందని విమర్శిస్తుంది.

ఏపీ, శ్రీలంకలో పరిస్థితులకు పోలిక చెప్పిన టీడీపీ.. జగన్ సర్కార్ పై ధ్వజం
శ్రీలంకలో ఉపాధి, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని, ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారని పేర్కొన్న టీడీపీ రైతులు, యువత, బలహీనవర్గాలు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరు ఏపీలోనూ నిరసనల బాట పట్టారని టిడిపి విమర్శిస్తోంది. శ్రీలంకలోనూ వైద్య రంగం కుదేలయ్యిందని పేర్కొని, జగన్ పాలనలో వైద్య, ఆరోగ్య రంగం కుదేలు అయిందని ఆసుపత్రిలో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ విమర్శిస్తోంది. వైద్య రంగంపై తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని టిడిపి పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరణ మృదంగం మోగింది అని టిడిపి విమర్శిస్తోంది.
ఏపీ విద్యుత్ సంక్షోభం, పెట్రోల్, డీజిల్ ధరల, ట్యాక్స్ ల బాదుడుపై టీడీపీ ఫైర్
ఇక
శ్రీలంకలో
ప్రస్తుతమున్న
సంక్షోభంతో
ఏపీలో
పరిస్థితిని
పోలుస్తూ
విమర్శిస్తున్న
తెలుగుదేశం
పార్టీ
శ్రీలంకలో
విద్యుత్
సంక్షోభంతో
12
గంటల
కోత
విధిస్తున్నారు
అంటూ
పేర్కొంది.
ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోనూ
10
గంటల
పైనే
విద్యుత్
కోతలు
ఉన్నాయి
అని
వెల్లడించింది.
ఇక
శ్రీలంకలో
పెట్రోల్,
డీజిల్
దొరకడం
లేదని
పేర్కొని,
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
జగన్
రెడ్డి
బాదుడే
బాదుడు
అంటూ
పెట్రోల్,
డీజిల్
దేశంలోనే
టాప్
రేట్లు
వసూలు
చేస్తున్నారని
పేర్కొంది.
టోల్
టాక్స్
బాదుడుతో
ఏపీ
మరో
శ్రీలంక
కాబోతుంది
అంటూ
టిడిపి
విమర్శించింది.
ఇక
శ్రీలంక
అప్పులు
4,500
కోట్ల
డాలర్లు
అని
పేర్కొన్నా
టిడిపి
ఏపీ
అప్పులు
7.76లక్షల
కోట్లుగా
ఆరోపణలు
గుప్పించింది.
భద్రత, పర్యాటకం విషయంలోనూ జగన్ వైఫల్యం
అంతేకాదు
భద్రత
విషయంలోనూ
శ్రీలంక,
ఏపీ
ఒకే
విధంగా
ఉన్నాయని
టీడీపీ
విమర్శించింది.
శ్రీలంకలో
సంక్షోభం
కారణంగా
144
సెక్షన్
విధించారు
అని
పేర్కొన్న
టిడిపి
సీఎం
ఇల్లు
దాటితే
చాలు
144
సెక్షన్
విధిస్తున్నారంటూ
తీవ్ర
అసహనం
వ్యక్తం
చేసింది.
ఇక
పర్యాటక
రంగం
విషయంలో
పర్యాటక
రంగమే
ప్రధాన
ఆదాయ
వనరు
అని
తెలిసి
కూడా
శ్రీలంక
నిర్లక్ష్యం
చేసిందని
పేర్కొన్న
తెలుగుదేశం
పార్టీ,
ఏపీలోనూ
పర్యాటక
ప్రాంతాలు
నిరుపయోగంగా
మారాయని
మండిపడింది.
తుగ్లక్
రెడ్డి
చేతగాని
తనంతో
విశాల
సముద్రతీరం
ఉన్నా
నిరుపయోగంగా
మారిందని
టిడిపి
మండిపడింది.
నిత్యావసరాల ధరలు భగ్గు.. శ్రీలంకతో పోల్చి ఏపీ పరిస్థితి చెప్పిన టీడీపీ
ఇక
నిత్యావసరాల
విషయంలో
లంకేయుల
ఆకలి
కేకలు
విన్న
అంటుతున్నాయని,
నిత్యావసర
వస్తువుల
ధరలు
భగ్గుమంటున్నాయి
అని
పేర్కొన్న
టిడిపి
ఏపీ
లోనూ
అదే
పరిస్థితి
ఉందని
జగన్
సర్కార్
పనితీరును
టార్గెట్
చేసింది.
ఓవైపు
ధరల
పెంపు,
మరోవైపు
ఎడాపెడా
పన్నుల
బాదుడు
అంటూ
తెలుగుదేశం
పార్టీ
జగన్
పాలనను
విమర్శించింది.

పారిశ్రామిక రంగం కుదేలు... జనాలపై బాదుడుతో ఏపీ త్వరలో మరో శ్రీలంకగా మారుతుందని ఫైర్
శ్రీలంక
లోని
పరిశ్రమల
ఆకర్షణకు
ప్రభుత్వ
చర్యలు
నిల్
అని
పేర్కొన్న
టిడిపి,
ఏపీలోనూ
కొత్త
పెట్టుబడి
రావడంలేదని,
పారిశ్రామిక
వర్గాలు
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
పెట్టుబడి
పెట్టడానికి
భయపడుతున్నారు
అని
పేర్కొంది.
జే
ట్యాక్స్
కు
భయపడి
పారిశ్రామికవేత్తలు
పరార్
అవుతున్నారని,
ఒక్క
కొత్త
పెట్టుబడి
కూడా
లేదని
టిడిపి
విమర్శించింది.
వింత
వింత
పన్నులు,
పెంచిన
చార్జీలు,
పెరిగిన
ధరలు
తదితర
బాదుడు
కార్యక్రమాలతో
ఒక
కుటుంబం
నుండి
ఏడాదికి
లక్ష
ఎనిమిదివేల
రూపాయలు
పిండేస్తున్నారు
జగన్
రెడ్డి
అంటూ
తెలుగుదేశం
పార్టీ
తీవ్ర
స్థాయిలో
జగన్
సర్కార్
పై
విరుచుకు
పడుతోంది.
సోషల్
మీడియా
వేదికగా
జగన్
పాలనా
వైఫల్యాలను
ఎండగడుతోంది.