వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ‌ర్మ చేతికి టిడిపి ఆయుధం, దిష్టిబొమ్మ ద‌గ్డం..పోలీసుల‌కు ఫిర్యాదు :ధీటుగా ఆర్జీవి స్పంద‌న‌..!

|
Google Oneindia TeluguNews

వివాదాలు కోరి తెచ్చుకొనే ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ‌కు టిడిపి ఎదురెళ్లి ఆయుధం ఇచ్చిందా. వ‌ర్మ విడుద‌ల చేసిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో వెన్నుపోటు పాట పై టిడిపి శ్రేణులు సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యాయి. వ‌ర్మి దిష్టిబొమ్మ‌లు త‌గుల పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీని పై వ‌ర్మ సైతం కౌంట‌ర్ ఇచ్చారు. నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌నే భ‌య‌ప డుతున్నార‌ని..ఒక్క పాట‌ను చూసే ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని వ‌ర్మ ప్ర‌శ్నించారు.

వ‌ర్మ దిష్టి బొమ్మ ద‌గ్దం.. పోలీసుల‌కు ఫిర్యాదు

వ‌ర్మ దిష్టి బొమ్మ ద‌గ్దం.. పోలీసుల‌కు ఫిర్యాదు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పై టిడిపి నేత‌లు ఫైర్ అవుతున్నారు. వెన్నుపోటు పాట లో అంతా చంద్రబాబును కించపర్చేలా ఉందని ఏపీ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రామ్‌గోపాల్‌వర్మపై కర్నూలు పోలీసులకు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా పాట అంటూ చంద్రబాబును కించ పర్చారంటూ ఫిర్యాదులో వివరించారు. మరోవైపు వర్మకు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. పాట విడుద‌ల సంద‌ర్బంలోనే చంద్ర‌బాబు ఫొటోలు వినియోగం పై చ‌ర్చ జ‌రిగింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా చంద్ర‌బాబు మ‌ద్ద‌తు దారులు..ఆర్జీవి ఫ్యాన్స్ మ‌ధ్య వార్ జ‌రిగింది. టిడిపి నేత‌లు సైతం వ‌ర్మ పై విరుచుకుప‌డ్డారు.

పాట‌ను చూస్తేనే ఇంత భ‌య‌మా..

పాట‌ను చూస్తేనే ఇంత భ‌య‌మా..

టీడీపీ నేతలు ఆందోళన చేయడంపై ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ముందుగా ఆ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని, అవసరమైతే దానికి కౌంటర్‌ ఇవ్వాలన్నారు. అంతేకానీ ఈ దిష్టిబొమ్మలు తగలబెడితే ఏం వస్తుందని ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి నిలదీశారు. బయోపిక్‌ అంటే అన్ని చూపించాలని, కొంత మాత్రమే చూపిస్తే అది బయోపిక్‌ ఎలా అవుతుం దన్నారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు జరిగినదే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా అని స్పష్టం చేశాడు. రియల్‌స్టార్‌ సినిమా కాబట్టే రియల్‌ పాత్రలకు సంబంధించిన ఫొటోలు వాడినట్లు పేర్కొన్నారు. ఇది కల్పిత కథ కాదని, ఫిల్మ్‌మేకర్‌గా తాను పరిశోధన చేసి తెలుసుకున్న కథతో సినిమా తీస్తున్నా నన్నారు. ఒక్క పాటను చూసే ఎందుకు భయపడుతున్నారని, సినిమా చూస్తేనే ఎవరేవరేం చేశారో తెలుస్తుందన్నారు రాం గోపాల్ వ‌ర్మ‌.

వైస్రాయ్ హోట‌ల్ లో జ‌రిగింది అదే..

వైస్రాయ్ హోట‌ల్ లో జ‌రిగింది అదే..

1995 లో వైస్రాయ్ హోట‌ల్ లో జ‌రిగిన యదార్ధ ఘ‌ట‌న ఆదారంగానే దీన్ని తీసామ‌ని వ‌ర్మ స్ప‌ష్టం చేసారు. వైస్రాయ్‌ హోటల్లో జరిగింది వెన్నుపోటేనని ఎన్టీఆరే చాలా సార్లు చెప్పారని, తానేం కొత్తగా కల్పించలేదని వ‌ర్మ చెప్పుకొచ్చారు. తనకు ఎవరీ మీద కోపం, ప్రేమ లేదని..ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిందే నిజాయితీగా చూపిస్తానని, తనకు ఎవరీ మద్దతు అవసరంలేదన్నారు. ప్రజలకు నచ్చకపోతే చూడరని, కానీ వారెందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నా రు. నిజాలు బయటకు వస్తాయనే భయం ఉన్నవారే సినిమాను ఆపడానికి ప్రయత్నిస్తారని వర్మ అభిప్రాయపడ్డారు. అయితే, టిడిపి నేత‌ల ఆందోళ‌న‌తో వ‌ర్మ స‌హ‌జ సిద్దంగా కోరుకొనే ప్ర‌చారం సులువుగా వ‌చ్చేస్తోంది.

English summary
TDP cadre lodge police complaint on RAm Gopal Varma in Kurnool on using Chandra Babu Photos in his song. RGV alosf seriously reated on TDP leaders. RGV want to hi light the Viceroy hotel episode
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X