అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి పోరాటానికి టీడీపీ శుభం కార్డు ? వైసీపీ వ్యూహంతో తారుమారైన పరిస్ధితులు...

|
Google Oneindia TeluguNews

గతేడాది ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగానే మొదలైన అమరావతి ఉద్యమం ముగినట్లే కనిపిస్తోంది. మూడు రాజధానులు వద్దు- అమరావతే ముద్దు నినాదంతో రైతుల చేపట్టిన ఉద్యమానికి అండగా నిలిచిన టీడీపీ మారిన పరిస్ధితుల నేపథ్యంలో పూర్తిగా తప్పుకున్నట్లే కనిపిస్తోంది. రాజధాని తరలింపును అడ్డుకోలేమనే నిర్ణయానికి రావడమే ఇందుకు కారణమా అన్న వాదన వినిపిస్తోంది.

 లోకేష్ తిండిపైన వైసీపీ వర్సెస్ టీడీపీ .. టేస్టి ఫుడ్ కోసం తాడిపత్రికి మాలోకం.. లోకేష్ తిండిపైన వైసీపీ వర్సెస్ టీడీపీ .. టేస్టి ఫుడ్ కోసం తాడిపత్రికి మాలోకం..

 అమరావతి ఉద్యమానికి రాంరాం...

అమరావతి ఉద్యమానికి రాంరాం...

ఏపీ రాజధానిగా తాము ఏర్పాటు చేసిన అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, స్ధానికులతో కలిసి టీడీపీ సాగించిన ఉద్యమం దాదాపుగా ముగిసింది. గతంలో నిత్యం రాజధాని గ్రామాల్లో కనిపించిన ఆందోళనలు పూర్తిగా శాంతించాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రాజధాని ఉద్యమం ఇక ముగిసినట్లేనని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా మోహరించిన పోలీసు బలగాలను కూడా ఎక్కడికక్కడ ఉపసంహరించుకుంది.

 అసెంబ్లీతో మారిన పరిస్ధితులు...

అసెంబ్లీతో మారిన పరిస్ధితులు...

ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మరోసారి ప్రభుత్వం సీఆర్డీయేతో పాటు వికేంద్రీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకోవడంతో మండలిలో బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం లేకపోయినా బిల్లులు చట్ట సభల ఆమోదం పొందినట్లేనని భావిస్తున్నారు. అందుకే అసెంబ్లీలో బిల్లుల ఆమోదం తర్వాత మండలిలిలో వీటిని ప్రవేశపెట్టేందుకు మంత్రులు చేసిన ప్రయత్నాలన్నీ కేవలం రాజకీయపరమైనవేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే టీడీపీ కూడా దీన్ని లైట్ తీసుకుందన్న వాదన వినిపిస్తోంది. గతంలో అమరావతి ఉద్యమం పేరిట రాజధాని గ్రామాల్లోనే కనిపించిన టీడీపీ నేతలు ఈసారి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాక రాజధాని గ్రామాల్లో నిరసనలు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం.. అలాంటివేవీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక టీడీపీ నేతలు కూడా అసెంబ్లీని ముందుగానే బాయ్ కాట్ చేసి ఇళ్లకు వెళ్లిపోవడంతో అమరావతి ఉద్యమం పూర్తిగా నీరుగారిపోయినట్లయింది.

 గవర్నర్ ఆమోదం లాంఛనమే...

గవర్నర్ ఆమోదం లాంఛనమే...

ప్రభుత్వం అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించి పంపిన రాజధాని బిల్లులు త్వరలో గవర్నర్ వద్దకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించినందున మండలి నిర్ణయంతో సంబంధం లేకుండానే వీటికి ఆమోద ముద్ర పడే అవకాశాలు ఉన్నాయి. అయితే నిర్ణీత సమయం పూర్తయిన తర్వాతే ఈ ప్రక్రియకు ఆమోదం లభించనుంది. అంటే అసెంబ్లీ ముగిసిన నెల రోజుల తర్వాత గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఆ తర్వాత బిల్లులు చట్ట రూపాన్ని సంతరించుకుంటాయి. అప్పుడు రాజధాని తరలింపు ప్రక్రియకు ఆటంకాలు దాదాపుగా తొలగిపోయినట్లే.

Recommended Video

#Watch 200 years Ancient Lord Shiva Temple Found in AP’s Nellore
 టీడీపీ నేతల్లో నిర్లిప్తత...

టీడీపీ నేతల్లో నిర్లిప్తత...

రాజధాని ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఓ దశలో కుటుంబంతో కలిసి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తానని రైతులకు, స్ధానికులకు హామీ ఇచ్చారు. ఆయన తనయుడు లోకేష్ కూడా పలుమార్లు రాజధాని నిరసనల్లో నేరుగా పాల్గొన్నారు. రాజధాని ఎలా తరలివెళుతుందో చూస్తామన్నారు. కానీ తాజాగా మారిన పరిస్ధితుల్లో ఏం చేయలేమనే భావన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. రాజధాని మార్పుకు వ్యతిరేకంగా గతంలో కోర్టుల్లో పిటిషన్లు వేసిన టీడీపీ ఇప్పుడు వీటి విషయంలోనూ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. శాసన ప్రక్రియ ద్వారానే రాజధాని తరలింపు ఉంటుందని హైకోర్టులో ప్రభుత్వం హామీ ఇవ్వడం, ఇప్పుడు చట్ట ప్రక్రియ పూర్తి కావడంతో టీడీపీ ఆ మేరకు సెలైంట్ అయిపోయందనే వాదన వినిపిస్తోంది.

English summary
main opposition in andhra pradesh telugu desam party's fight on amaravati capital seems to be ended after post legislative assembly scenario. ysrcp govt has taken approval of assembly for two times and plans to send the three capital bills to governor soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X