వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంద్: జగన్ పార్టీకి టిడిపి కౌంటర్, బుచ్చయ్యపై రాళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP counter to YSR Congress Party
గుంటూరు/రాజమండ్రి: తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన బందుకు పిలుపునిచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కౌంటర్‌గా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోంది. మూడున రాష్ట్ర బందుకు పిలుపునిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి ప్రకటించారు.

గురువారం టిడిపి సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ మాట్లాడుతూ... తెలంగాణ బిల్లుపై చర్చకు నిరసనగా రేపు సీమాంధ్ర బందుకు తమ పార్టీ పిలుపునిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పైన మండిపడ్డారు. జగన్ కోరేది సమైక్యం, సహకరించేది విభజనకన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగల పార్టీ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో లోపాలు ఉన్నాయని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనేదే తమ డిమాండ్ అన్నారు.

బుచ్చయ్య చౌదరిపై రాళ్ల దాడి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి పైన రాళ్ల దాడి జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావును పలువురు టిడిపి నేతలు అడ్డగించి వాంబే గృహాల కేటాయింపు అంశంపై నిలదీశారు. ఈ సమయంలో రౌతు, టిడిపి నేత బుచ్చయ్య చౌదరి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు చౌదరి పైన రాళ్ల దాడి చేశారు. ఆయనను కారులో అక్కడి నుండి తరలించారు.

English summary
Telugudesam Party called to Seemandhra Bandh on January 3rd against Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X