నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు మళ్లీ షాక్, మొదటికొచ్చిన ఆనం వ్యవహారం: ఒక్కటైన ఫ్యామిలీ, టీడీపీ వీడాలని ఒత్తిడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: సింహపురిలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి. నెల్లూరు తెలుగుదేశం పార్టీలో మళ్లీ ముసలం పుట్టింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం మళ్లీ మొదటి వచ్చిందని తెలుస్తోంది. టీడీపీ నుంచి బయటకు రావాలని ఆయనపై కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.

'జగన్ చేయాల్సిన 2 పనులు.. బాబు వద్దకు వెళ్లి మద్దతివ్వడం', మెత్తబడిన ఆనం రామనారాయణ 'జగన్ చేయాల్సిన 2 పనులు.. బాబు వద్దకు వెళ్లి మద్దతివ్వడం', మెత్తబడిన ఆనం రామనారాయణ

టీడీపీని వడే విషయమై హైదరాబాదులో కీలక నేతలు, కుటుంబ సభ్యులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరం రేపు లేదా ఎల్లుండి.. లేదంటే సాధ్యమైనంత త్వరలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయవచ్చునని అంటున్నారు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఆసక్తిగా మారింది.

బాబుకు భారీ షాక్, బుజ్జగించినా నో: వైసీపీలోకి ఆనం రామనారాయణ, అక్కడే సందిగ్ధం బాబుకు భారీ షాక్, బుజ్జగించినా నో: వైసీపీలోకి ఆనం రామనారాయణ, అక్కడే సందిగ్ధం

రేపో మాపో టీడీపీకి రాజీనామా, భవిష్యత్తుపై వేచిచూసే ధోరణి

రేపో మాపో టీడీపీకి రాజీనామా, భవిష్యత్తుపై వేచిచూసే ధోరణి

ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తారని గతంలో ప్రచారం సాగింది. కానీ ఈసారి ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. భవిష్యత్తు నిర్ణయంపై ఆయన సమయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనలు కీలకంగా, ఆ తర్వాత బీజేపీ కనిపిస్తోంది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆ తర్వాతే తేలనుందని అంటున్నారు.

మళ్లీ మొదటికి వచ్చిన ఆనం వ్యవహారం

మళ్లీ మొదటికి వచ్చిన ఆనం వ్యవహారం

ఇటీవల జరిగిన మినీ మహానాడులో పార్టీపై, పార్టీ నేతలపై ఆనం రామనారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు శనివారం ఆత్మకూరులో జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి నెల్లూరులో ఉండి కూడా గైర్హాజరయ్యారు. దీంతోపలువురు పార్టీ నేతలు కూడా కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతూ... వెంటనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేకపోతే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారవుతుందన్నారు. అయితే ఆనం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందని కొందరు వాపోతున్నారు.

ఏకమైన ఆనం సోదరులు, ఓకే గూటికి

ఏకమైన ఆనం సోదరులు, ఓకే గూటికి

మరోవైపు, ఆనం సోదరలు అందరూ ఏకమయ్యారని చెబుతున్నారు. వీరంతా కలిసి ఓకే గూటికి చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితర కుటుంబమంతా ఒకే పార్టీలోకి వెళ్లాలని భావిస్తోందని తెలుస్తోంది.

బుజ్జగింపులతో నిన్న ఓకే, నేడు మళ్లీ యూటర్న్

బుజ్జగింపులతో నిన్న ఓకే, నేడు మళ్లీ యూటర్న్

కాగా, చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం సోదరులు (వివేకానంద, రామనారాయణ రెడ్డి) వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత బుజ్జగింపుల నేపథ్యంలో తగ్గారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ యూటర్న్ తీసుకున్నారు ఆనం రామనారాయణ.

English summary
Former Andhra Pradesh ministers Anam Ramanarayana Reddy and family likely to quit Telugudesam Party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X