• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చివరి నిమిషంలో సీఎం జగన్‌కు షాక్.. ఢిల్లీ టూర్ రద్దుపై రచ్చ.. చంద్రబాబుకు శాశ్వత స్థానం..

|

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా రద్దయిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రవిమర్శలకు దిగాయి. సీఎం టూర్ అనుకోకుండా రద్దయింది కాదని, దాని వెనుక పెద్ద హైడ్రామా నడిచిందని టీడీపీ, బీజేపీ వ్యాఖ్యానాలు చేశాయి. ప్రతిపక్ష పార్టీలు, వాటి అనుకూల మీడియా ఎన్ని పిచ్చిరాతలు రాసినా జగన్ ప్రతిష్టకు భంగం వాటిల్లబోదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటరిచ్చారు. అసలింతకీ ఏం జరిగిందే..

మళ్లీ సీఎంగా చంద్రబాబు, ఇదీ పథకం.. టీడీపీకి ఉప్పందించిన విజయసాయి వేగులు.. ఇందుకే ఢిల్లీ టూర్ రద్దు..మళ్లీ సీఎంగా చంద్రబాబు, ఇదీ పథకం.. టీడీపీకి ఉప్పందించిన విజయసాయి వేగులు.. ఇందుకే ఢిల్లీ టూర్ రద్దు..

ఆఖరి నిమిషంలో..

ఆఖరి నిమిషంలో..

ఏపీలో కొనసాగుతోన్న ప్రాజెక్టులు, కరోనా నియంత్రణ చర్యలు, పాతబకాయిలు, పోలవరం తదితర అంశాలపై కేంద్రం పెద్దలతో చర్చలు జరిపేందుకు సీఎం జగన్ మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ వరకు సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్ క్లియరెన్స్ కు సైతం ఆదేశాలు వెలువడినా.. ఆఖరి నిమిషంలో పర్యటన రద్దయింది. ఇచ్చిన అపాయింట్మెంట్లు రద్దుచేయడం ద్వారా కేంద్రం.. సీఎం జగన్‌ కు షాకిచ్చిందని, దీనికి ఆయన విపరీత ధోరణే కారణమని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు.

అలా జరిగిందా?

అలా జరిగిందా?

జగన్ చేస్తున్న తుగ్లక్ పాలనకు, అవగాహన లేని పనులకు, జాతీయ స్థాయిలో ఏపీ నవ్వులుపాలు అవుతోందన్న టీడీపీ.. ఇచ్చిన అపాయింట్మెంట్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయంటే ఏపీ పరువు ఏ స్థాయిలో పోతోందో అర్థం చేసుకోవచ్చంటూ సీఎంను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. నిజానికి నిసర్గ తుపాను నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌, గోవాలను అప్రమత్తం చేయడంలో అమిత్‌ షా బిజీగా ఉన్నందునే అన్ని అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అయ్యాయని కేంద్ర హోం శాఖ, ఏపీ సర్కారు అధికారికంగా ప్రకటించాయి. కానీ ఏపీ బీజేపీ పంపిన ఓ లేఖను హైకమాండ్ సీరియస్ గా తీసుకోవడం వల్లే జగన్ టూర్ సడెన్ గా ఆగిపోయిందని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

తప్పుడు వార్తలకు జైలు..

తప్పుడు వార్తలకు జైలు..

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంతోపాటు ఇంకా చాలా విషయాల్లో ఏపీ హైకోర్టు.. జగన్ సర్కారు తప్పు పడుతున్న తీరును, ఆయా అంశాల్లో వైసీపీపై ఏపీ బీజేపీ సాగిస్తోన్న పోరాటం తాలూకు వివరాలను జతచేసి కమలనాథులు.. పార్టీ హైకమాండ్ కు లేఖలు రాశారని, కేంద్ర పెద్దలు జగన్ ను కలిస్తే ఏపీలో బీజేపీ సాగిస్తోన్న పోరాటం పలుచపడుతుందంటూ ఈ మేరకే రాసిన లేఖల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే అపాయింట్మెంట్లు రద్దయ్యాయంటూ మీడియాలో రిపోర్టులు వచ్చాయి. సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి ఏపీ సర్కారు, కేంద్రం అధికార ప్రకటనలు చేసిన తర్వాత కూడా మీడియాలో ఇలాంటి రిపోర్టులు రావడం చర్చనీయాంశమైంది. అదికూడా తప్పుడు వార్తలు రాస్తే ఎంతటివాళ్లనైనా జైలుకు పంపొచ్చని హైకోర్టు స్పష్టం చేసిన మరునాడే సీఎం ఢిల్లీ పర్యటన రద్దుపై రచ్చ చలరేగడం గమనార్హం.

చైనా ఆర్మీ చొరబాటు,నదీజలాల మళ్లింపు.. దీటుగా భారత్ ప్రతిఘటన.. రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..చైనా ఆర్మీ చొరబాటు,నదీజలాల మళ్లింపు.. దీటుగా భారత్ ప్రతిఘటన.. రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఇంత చేసినా జగనే గ్రేట్..

ఇంత చేసినా జగనే గ్రేట్..

ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా భారీ ఎత్తున పిచ్చి రాతలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నా.. దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ నాలుగో స్థానంలో నిలవడం గర్వకారణమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఐదేళ్లుగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని.. జగన్ ఏడాదిలోనే గాడిలో పెట్టగలిగారని కితాబిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబును ఉద్దేశించి ఎంపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..

  Telangana Formation Day : TDP Leader Comments On KCR Governance
  బాబు స్థానం ఇదే..

  బాబు స్థానం ఇదే..

  ‘‘ఐదేళ్ల పాలనలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్ మొదలుకొని ప్రతి ప్రజాప్రతినిధికి వనరులను దోచిపెట్టాడు. ఇసుక ర్యాంపుల్లో ఎవరెవరు తినాలి, గ్రానైట్ గనులు ఎవరు తవ్వుకోవాలి, చివరకు బదిలీల్లో కూడా డబ్బులు వసూలు చేశారు. ఏడాదిలో జగన్ వీటిని చక్కదిద్దారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించిన బాబు, ఓడిన తర్వాత కూడా వాళ్లకే వంత పాడుతున్నాడు. కమిషన్లు తీసుకుని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా పెంచుకునేందుకు అనుమతించాడు. ఇప్పుడు ప్రభుత్వం ఫీజులు తగ్గిస్తానంటే వ్యవస్థల ద్వారా అడ్డుకుంటున్నాడు. నాయకుడంటే జగన్ లాగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాలి. కానీ చంద్రబాబు మాత్రం కుట్రలు కుతంత్రాలు చేసేవాడిగా తన స్థానాన్ని శాశ్వతం చేసుకున్నారు''అని విజయసాయి మండిపడ్డారు.

  English summary
  opposition tdp alleged that due to cm jagan's huge mistakes andhra's pride was damaged and he could not get oppointment from union ministers. ysrcp mp vijayasai reddy slams chandrababu
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X