వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ చరిత్ర వికిపీడియాలో, అర్హత ఉంటేనే నామినేటేడ్ పోస్టులు: బాబు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెం-1 స్థానంలో ఉంటే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్‌లో జగన్ నెం-1 స్థానంలో ఉన్నారని టిడిపి చీప్ చంద్రబాబునాయుడు పార్టీ నేతల సమావేశంలో అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెం-1 స్థానంలో ఉంటే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్‌లో జగన్ నెం-1 స్థానంలో ఉన్నారని టిడిపి చీప్ చంద్రబాబునాయుడు పార్టీ నేతల సమావేశంలో అభిప్రాయపడ్డారు. టిడిపి ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.

Recommended Video

YS Jagan Padayatra : బాబు అవసరమా? పాదయాత్రలో ఎవరిని పలకరించినా | Oneindia Telugu

రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్‌కు షాకిచ్చేనా?రవిబాబు ఎఫెక్ట్: అనుచరులతో గిడ్డి ఈశ్వరీ సమావేశం, జగన్‌కు షాకిచ్చేనా?

అమరావతిలో పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబునాయుడు పలు అంశాలపై చర్చించారు. 2019 ఎన్నికలకు పార్టీని పటిష్టం చేసే విషయమై పార్టీ నేతలతో చర్చించారు.

ఇక్బాల్ అహ్మద్‌కు బాబు హమీ: నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డికి ఇంఛార్జీ బాధ్యతలు?ఇక్బాల్ అహ్మద్‌కు బాబు హమీ: నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డికి ఇంఛార్జీ బాధ్యతలు?

అంతేకాదు రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ ముఖ్యులతో చంద్రబాబునాయుడు చర్చించారు.

అవినీతిలో జగన్ నెంబర్ 1

అవినీతిలో జగన్ నెంబర్ 1

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెం-1 స్థానంలో ఉంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్‌లో జగన్ నెం-1 స్థానంలో ఉన్నారని టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారని సమాచారం. ఈడీ ప్రకటించిన తాజా జాబితాలో టాప్‌టెన్‌లో జగన్ ఉన్నారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

జగన్‌కు మద్దతిచ్చే నేతలు ఆలోచించాలి

జగన్‌కు మద్దతిచ్చే నేతలు ఆలోచించాలి

ప్యారడైజ్ పేపర్ల జాబితాలోనూ జగన్ పేరు ఉందని బాబు గుర్తు చేశారు. అయితే జగన్‌కు మద్దతిచ్చేవారు ఒకసారి ఆలోచించుకోవాలని బాబు ఆ పార్టీలకు హితవు పలికారు. పాదయాత్ర సందర్భంగా టిడిపిపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు బాబు వద్ద ప్రస్తావించారని సమాచారం.

అర్హత ఉన్న వారికే పదవులు

అర్హత ఉన్న వారికే పదవులు

అర్హత ఉన్నవారికే పదవులు ఇవ్వాలని సమావేశంలో చంద్రబాబునాయుడు నిర్ణయించారు. టీడీపీ చరిత్ర, అధికారంలో ఉండగా సాధించిన విజయాలు... ప్రతిపక్షంలో చేసిన పోరాటాలను వికీపీడియాలో పొందుపర్చాలని నిర్ణయించారు. డిసెంబర్ నెలాఖరుకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం పూర్తి కానుందని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు చెప్పారు.

కోటి 17 లక్షల ఇళ్ళకు టిడిపి

కోటి 17 లక్షల ఇళ్ళకు టిడిపి

డిసెంబర్ నెలాఖరుకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం పూర్తి చేయనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇప్పటివరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో కోటి 17 లక్షల ఇళ్లకు కార్యకర్తలు వెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమం ముగింపును జనరంజకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో వచ్చిన ... 50 లక్షల వినతిపత్రాలను 30 రోజుల్లో పరిష్కరించాలని నిర్ణయించారు.

జిల్లాల్లో బాబు పర్యటనలు

జిల్లాల్లో బాబు పర్యటనలు

అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని అన్ని జల్లాల్లో చంద్రబాబు పర్యటన చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. బాబు పర్యటనలో ఉదయం అభివృద్ధి కార్యక్రమాలు, మధ్యాహ్నం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు జరపాలని నిర్ణయించారు. కులసంఘాల సమస్యలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు.

English summary
Andhra pradesh chief minister Chandrababunaidu made allegations on Ysrcp chief Ys jagan on Thursday at Amaravati. Chandrababu naidu conducted party coordination meeting at Amaravati.party decided to give nominated posts for suitable leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X