• search
  • Live TV
కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకు డబుల్ షాక్ -కుప్పం టీడీపీలో ముసలం? -రాజీనామా బాటలో తమ్ముళ్లు! - ఇంకొద్ది గంటల్లో టూర్

|

రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు బలుపుకాదు, వాపు మాత్రమేనని అభివర్ణించిన టీడీపీ.. పార్టీ గుర్తుపై జరిగినవి కాకపోయినా.. తాజా పంచాయితీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇంటా, బయట సతమతమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. విమర్శలు ఎదుర్కొంటున్నది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు భారీగా ఓడటం, అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోవడం లాంటి పరిణామాలు ఆ పార్టీకి మరికొన్ని చికుల్ని తెచ్చిపెడుతున్నాయి. ఇంకొద్ది గంటల్లో కుప్పం వెళ్లనున్న చంద్రబాబుకు డబుల్ షాక్ అనే రీతిలో స్థానిక నేతలు సంచలనానికి దిగనున్నట్లు తెలుస్తోంది..

జగన్ ఆదాయం రోజుకు 300 కోట్లు -ప్రధానికీ డబ్బు కావాలి -మనుషులకే పుట్టామా? -కాల్చిపారేయాలి: జేసీజగన్ ఆదాయం రోజుకు 300 కోట్లు -ప్రధానికీ డబ్బు కావాలి -మనుషులకే పుట్టామా? -కాల్చిపారేయాలి: జేసీ

 ఓటమి తర్వాత తొలిసారిగా..

ఓటమి తర్వాత తొలిసారిగా..

ఏపీలో మొత్తం 13,095 గ్రామ పంచాయితీలు ఉండగా, వైసీపీ ఏకంగా 10,524 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ 2,063తో సరిపెట్టుకుంది. ఇదంతా ఒక ఎత్తైతే, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ టీడీపీ ఘోరంగా ఓడిపోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. వైసీపీ రౌడీయిజం, విచ్చలవిడి డబ్బుల పంపకం, అధికారుల సహకారం వల్లే టీడీపీకి వ్యతిరేక ఫలితాలొచ్చాయన్న చంద్రబాబు.. ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. అయితే, కుప్పం తమ్ముళ్లు మాత్రం మరో రకం ప్రిపరేషన్లలో ఉన్నట్లు సమాచారం..

చంద్రబాబు కుప్పం రాగానే..

చంద్రబాబు కుప్పం రాగానే..

పంచాయితీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గం దశాబ్దాల కాలంగా చంద్రబాబు కంచుకోటగా పేరుపొందింది. 1989 నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు అప్రతిహతంగా చంద్రబాబు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. కనీసం నామినేషన్ కూడా వేయడానికి కూడా చంద్రబాబు వెళ్లకుండానే అక్కడి ప్రజలు గెలిపించుకుంటూ వస్తున్నారు. అలాంటి చోట టీడీపీ దెబ్బతినడం, చాలా పంచాయితీల్లో డిపాజిట్లు కూడా దక్కకపోవడం పార్టీని కలవరపెడుతోంది. కుప్పంలో ఓటమితో టీడీపీ నాయకులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారట. చంద్రబాబు కుప్పం వచ్చినా..

 కుప్పం టీడీపీలో ముసలం

కుప్పం టీడీపీలో ముసలం

అధినేత చంద్రబాబు ఇలాకాలోనే గెలవలేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ముఖాలు చూపించలేకపోతున్నారట. బాబు కుప్పం రాబోతున్న క్రమంలో ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని, అందుకే చాలామంది రాజీనామాలకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. పలువురు కీలక నేతలు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి అంతర్మథనం, రాజీనామాల నిర్ణయానికి దారితీసిన పరిణామాలు ముసలానికి ఏమాత్రం తక్కువగా లేవని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఓటమికి మీరంటే మీరే కారణమంటూ తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు నేతలు విమర్శలకు దిగుతున్నారని, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పీఎస్‌ మునిరత్నంపై స్థానిక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే..

 కీలక నేతల రాజీనామాలు?

కీలక నేతల రాజీనామాలు?

పంచాయితీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో టీడీపీ పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. మంగలవారం కుప్పం వచ్చిన మునిరత్నం, చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్‌లకు స్థానికంగా చేదు అనుభవం ఎదురైందని, ఈ ఇ‍ద్దరు నేతలపై కార్యకర్తలు తిరుగుబాటు యత్నించారని మీడియాలో రిపోర్టులు వచ్చాయి. ఈ ఇద్దరి తీరు వల్లే ఎన్నికల్లో ఓటమి చెందామని ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేారని, మంగళవారం రామకుప్పంలో నిర్వహించిన టీడీపీ సమావేశంలో ఈ విషయమై గందరగోళం చెలరేగిందని, ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన మునిరత్నం.. టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్‌ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని, నేతలు సముదాయించడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని, చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టాక రత్నంతోపాటు ఇతర నేతలూ తమ లేఖల్ని అధినేత ముందు ఉంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా,

 కుప్పంలో టీడీపీ ఓటమికి కారణాలివే?

కుప్పంలో టీడీపీ ఓటమికి కారణాలివే?

పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి గెలుపునకు అభివృద్ధే కారణమని అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, సంక్షేమ పథకాల ప్రభావం వల్లే జగన్ కు అనుకూల ఫలితాలు వచ్చాయనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రధానంగా కరోనా విలయ కాలంలో జగన్ సర్కారు సంక్షేమాన్ని వేగవంతం చేయడం, వైరస్ కట్టడి, ప్రజలకు భరోసా కల్పించే విషయాల్లో అనుసరించిన విధానాలు.. పంచాయితీ ఎన్నికల్లో కీలక ఫ్యాక్టర్ గా పనిచేశాయని, కరోనా లాక్‌డౌన్‌ వంటి క్లిష్టపరిస్థితిల్లో చంద్రబాబు కనీసం కుప్పం వైపు కన్నెత్తి చూడకుండా, హైదరాబాద్ కే పరిమితమైపోవడం కూడా చూడకపోవడం టీడీపీకి ప్రతికూలంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా కుప్పంలో చంద్రబాబు పర్యటన వేళ టీడీపీలో ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది..

వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ -అంతలోనే సీఎం జగన్ కీలక ఆదేశాలు -ఇక ప్రపంచ స్థాయిలో..వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ -అంతలోనే సీఎం జగన్ కీలక ఆదేశాలు -ఇక ప్రపంచ స్థాయిలో..

English summary
amid panchayat elections results, Chandrababu Naidu own constituency Kuppam seems to have formed a rift in the party after the TDP's savage defeat. Leaders are criticizing each other for blaming yourself for the defeat in the panchayat elections. While Chandrababu will be touring Kuppam from february 25, several key leaders, including the constituency TDP in-charge, are reportedly preparing to resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X