వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రీ పోలింగ్‌కు మ‌రో అభ్య‌ర్ధ‌న‌: ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో 19 కేంద్రాల్లో : టీడీపీ తాజా డిమాండ్‌...!

|
Google Oneindia TeluguNews

ఏపీలో చంద్ర‌గిరి ర‌చ్చ కొత్త డిమాండ్‌కు కార‌ణ‌మైంది. చంద్ర‌గిరిలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు సీఎస్ చేసిన సిఫార్సు కార‌ణ‌మని భావిస్తున్న టీడీపీ..త‌మ డిమాండ్ల‌ను తెర మీద‌కు తెచ్చింది. గ‌తంలోనే ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి నివేదించిన అంశాన్ని మ‌రో సారి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముందు ఉంచింది. ఏపీలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 19 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వ‌హించాని డిమాండ్ చేసింది.

ఢిల్లీకి చంద్ర‌బాబు..సీఎస్ వ‌ద్దకు నేత‌లు
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి చంద్ర‌గిరిలో అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు సంబంధించి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌నున్నారు. తామిచ్చిన ఫిర్యాదుల పైన స్పందించ‌ని ఎన్నిక‌ల సంఘం ఇప్పుడు వైసీపీ నేత‌లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలింగ్ ముగిసిన నెల రోజుల తరువాత రీ పోలింగ్ నిర్వ‌హించ‌టం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అందుబాటులో ఉన్న టీడీపీ నేత‌లు స‌చివాల‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కలిసారు. ఎన్నిక‌ల రీ పోలింగ్‌కు సీఎస్ లేఖ కీల‌కంగా భావిస్తున్న టీడీపీ నేత‌లు దీని పైన ఆయ‌న్ను ప్ర‌శ్నించారు. అయితే, సీఎస్ ద‌ళితులు ఓటు హ‌క్కు వేయ‌లేక‌పోయార‌ని ఫిర్యాదు రావటంతో దానిని సీఈవోకు పంపామ‌ని వివ‌రించారు. ప్రతీ ఒక్క‌రూ ఓటు వేసేలే చూడాల్సిన బాధ్య‌త త‌మ పైన ఉంద‌ని స‌మాధానం ఇచ్చారు. దీంతో..టీడీపీ నేత‌లు అసంతృప్తిగానే వెన‌క్కు తిరిగారు.

TDP Demand Re poll in 19 polling booths in Seven constituencys..

19 కేంద్రాల్లో రీ పోలింగ్ కావాలి..
వైసీపీ కోరిన వెంట‌నే రీ పోలంగ్‌కు ఆదేశించారు..అదే విధంగా మేము డిమాండ్ చేస్తున్న విధంగా ఏడు నియోజ‌క‌వ‌ర్గా ల్లోని 19 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని టీడీపీ నేత‌లు లేఖ ఇచ్చారు. అందులో సీఎస్ లేఖ ఆధారంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం రీ పోలింగ్‌కు నిర్ణ‌యం తీసుకుంద‌నే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఏపీలోని న‌ర్స‌రావు పేట‌, రాజంపేట‌, రైల్వే కోడూరు, స‌త్య‌వేడు, జ‌మ్మ‌ల‌మ‌డుగు, స‌త్తెన‌ప‌ల్లి, చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లోని 19 పోలింగ్ కేంద్రాల్లో
రీ పోలింగ్ నిర్వ‌హించాల‌ని గ‌తంలోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరామ‌ని..ఇప్పుడైనా సీఎస్ చొర‌వ తీసుకొని వీటిల్లో రీ పోలింగ్‌కు సిఫార్సు చేయాల‌ని కోరారు. ఇక‌, టీడీపీ నేత‌లు మ‌రో సారి సీఎస్ మీద ఆరోప‌ణ‌లు చేసారు. సీఎస్ అంటే చీఫ్ సెక్ర‌ట‌రీ అనుకున్నామ‌ని...అయితే చెవిరెడ్డి సెక్ర‌ట‌రీ అని తెలిసింద‌ని టీడీపీ మ‌హిళా నేత అనూరాధా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే అంశం పైన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద‌కు వెళ్ళ‌టంతో అక్క‌డ ఎటువంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి...

English summary
TDP leaders met chief Secretary LV Subramanyam demanded for Re Polling in 19 polling booths in Seven constituency's. TDP Chief chandra Babu in Delhi to meet CEC and protest on Chandragiri by poll decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X