వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: 'వైయస్ వివేకానంద ఓటు తొలగించిందే జగన్, ఎందుకంటే, ఫారం 7 విషయంలోనూ..'

|
Google Oneindia TeluguNews

అమరావతి: డేటా చోరీ, ఓట్ల గల్లంతు అంశంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దొంగ ఓట్లతో గెలవాలని టీడీపీ అనుకుంటోందని వైసీపీ చెబుతుండగా, తెరాస సహకారంతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ అంటోంది. ఓట్ల తొలగింపుపై తామే ఫిర్యాదు చేశామని ఇప్పటికే జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం నడుస్తోంది.

<strong>నాయకులారా జాగ్రత్త! 'పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదా.. ఆలోచించడనుకుంటే పొరపాటు'</strong>నాయకులారా జాగ్రత్త! 'పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదా.. ఆలోచించడనుకుంటే పొరపాటు'

 వైయస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించిందే జగన్

వైయస్ వివేకానందరెడ్డి ఓటు తొలగించిందే జగన్

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేతపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత నేత సతీష్ రెడ్డి అన్నారు. తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి ఓటును తొలగించారని జగన్ చెప్పారని, కానీ ఆయన ఓటు జగనే అని ఆరోపించారు. వివేకా ఓటు తొలగించి జగన్‌ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. జగన్‌కు ఆయన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి ఓటు వేస్తారనే నమ్మకం లేదని, అందకే తొలగించారన్నారు. ఫారం 7 ద్వారా ప్రజల ఓట్లు తొలగించమని చెప్పడానికి జగన్ ఎవరన్నారు. జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘo సుమోటోగా స్వీకరించాలన్నారు.

 సీఎం కుర్చీ కోసం ఎన్ని అనర్థాలైనా చేయగలడు

సీఎం కుర్చీ కోసం ఎన్ని అనర్థాలైనా చేయగలడు

ఓటర్ లిస్ట్ నుంచి ఓట్లను అక్రమంగా తొలగించే కుట్రపై వైసీపీ నేతలను ప్రజలు ఎక్కడికి అక్కడ నిలదీస్తున్నారని మంత్రి దేవినేని ఉమా వేరుగా అన్నారు. ఫారం 7 ద్వారా నకిలీ దరఖాస్తులతో ఓట్లు తొలగించే కుట్రకు వైసీపీ పాల్పడుతోందన్నారు. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశామని, తెలంగాణ సీఎం కేసీఆర్‌, బీజేపీతో చేతులు కలిపి జగన్‌ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సీఎం కుర్చీ కోసం ఎన్ని అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్‌ అన్నారు.

 ఫారం 7 ఎఫెక్ట్.. జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి

ఫారం 7 ఎఫెక్ట్.. జగన్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలి

ఏపీలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే కుట్రలకు పాల్పడుతున్నారని దేవినేని అన్నారు. అందుకే కులాలు, మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారని చెప్పారు. అధికారమే పరమావధిగా జగన్‌ మాట్లాడుతున్నారని, ఫారం 7 ద్వారా తానే దరఖాస్తు చేయించానని జగన్‌ అంగీకరించారని, జగన్‌ ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారన్నారు. ఏపీలో 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్‌ కుట్ర పన్నారని, నెల్లూరు సభలో జగన్‌ మాట్లాడిన భాష జుగుప్సాకరమన్నారు.

English summary
Telugudesam Party is demanding actions against YSR Congress Party over vote removing issue in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X