వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దిగ్విజయ్‌తో జగన్ రహస్య మంతనాల వెనుక..': కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా తిరుపతి విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో రెండు గంటల పాటు రహస్య మంతనాలు జరిపారా? అంటే అవునని అంటోంది టిడిపి.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆశ్చర్యం: 'వైయస్ జగన్ ఆస్తులు పంచితే ఒక్కో నియోజకవర్గానికి రూ.750 కోట్లు'మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన చరిత్ర దిగ్విజయ్ సింగ్‌ది అని దుయ్యబట్టారు. అలాంటి డిగ్గీతో విమానాశ్రయంలో చాలాసేపు జగన్ రహస్యంగా మంతనాలు జరిపారన్నారు. వారి మంతనాల సారాంశాన్ని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

TDP demands to reveal Diggy and YS Jagan meeting secrets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విహారయాత్రకు వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. అగస్టా, బొగ్గు, 2జి కుంభకోణాల్లో దిగ్విజయ్ సింగ్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన డిగ్గీ రాజా కాదని, సూట్‌కేసుల రాజా అని ఎద్దేవా చేశారు. ఏ రాష్ట్రంలో ఆయన అడుగుపెడితే ఆ రాష్ట్రం నాశనమే అన్నారు.

కాగా, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత వైసిపిని స్థాపించారనే వాదనలు ఉన్నాయి. అనంతరం రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, టిడిపి అధికారంలోకి వచ్చింది, వైసిపి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.

ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా పలుమార్లు టిడిపిని, లేదా టిడిపి - బిజెపిని ఓడించేందుకు వైయస్ జగన్.. కాంగ్రెస్ పార్టీతో జతకడతారనే వాదనలు వినిపించాయి. లేదా కేసుల గురించి కాంగ్రెస్ పార్టీతో కలుస్తారనే టిడిపి నేతలు ఆరోపించారు. ఇప్పుడు మరోసారి డిగ్గీతో జగన్ రహస్యంగా మాట్లాడారని గాలి ముద్దుకృష్ణమ చెప్పడం గమనార్హం.

English summary
Telugudesam Party demanding to reveal Diggy and YS Jagan meeting secrets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X