వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతిలో టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్ర భగ్నం, టీడీపీ నేతల అరెస్ట్ ; చంద్రబాబు ప్లాన్ కు జగన్ సర్కార్ చెక్

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ధర్మపరిరక్షణ యాత్రకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ యాత్ర ద్వారా ప్రజల మద్దతు కూడగడదామని ప్లాన్ చేసింది .అయితే చంద్రబాబు వేసిన ప్లాన్ కు జగన్ సర్కార్ చెక్ పెట్టింది.

క్రైస్తవులను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్లాన్ .. రంగంలోకి దిగిన దివ్యవాణి .. ఆ వ్యాఖ్యలపై వివరణక్రైస్తవులను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్లాన్ .. రంగంలోకి దిగిన దివ్యవాణి .. ఆ వ్యాఖ్యలపై వివరణ

 టీడీపీ ధర్మ పరిరక్షణా యాత్ర .. తిరుపతి ఉప ఎన్నికల వ్యూహం

టీడీపీ ధర్మ పరిరక్షణా యాత్ర .. తిరుపతి ఉప ఎన్నికల వ్యూహం

తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 700 గ్రామాల్లో పది రోజుల పాటు ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో పర్యటించాలని, టిడిపి నేతలు అందరూ తప్పకుండా ధర్మ పరిరక్షణ యాత్రలో పాల్గొనాలని ఆదేశించారు చంద్రబాబు. తిరుపతిలో ఉప ఎన్నికల వ్యూహంలో భాగంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకు చెయ్యాలనుకున్న యాత్రలో 70 ప్రత్యేక వాహనాల ద్వారా ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలని టిడిపి నేతలు భావించారు. ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో హిందూ అనుకూల ఓటు బ్యాంకు కోసం పక్కా ప్లాన్ వేశారు .

 దేవాలయాలపై దాడులే హైలెట్ చేస్తూ యాత్ర .. అనుమతి రద్దు చేసిన పోలీసులు

దేవాలయాలపై దాడులే హైలెట్ చేస్తూ యాత్ర .. అనుమతి రద్దు చేసిన పోలీసులు

దేవాలయాలపై దాడులను , ప్రధానంగా హైలైట్ చేస్తూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏడాదిన్నర పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఆదేశించారు . అయితే మొదట ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు, ఆ తర్వాత అనుమతిని రద్దు చేయడంతో తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది.
ధర్మ పరిరక్షణ యాత్ర ప్రారంభించడానికి సిద్ధమైన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బస చేసిన హోటల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు అచ్చెన్నాయుడు తో పాటుగా మాజీ మంత్రులు నక్క ఆనంద్ బాబు, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులను హోటల్ గదిలో నిర్బంధించారు.

 టీడీపీ నేతల నిర్బంధాలు .. అనుమతి రద్దు దేనికో చెప్పాలని టీడీపీ నేతలు ఫైర్

టీడీపీ నేతల నిర్బంధాలు .. అనుమతి రద్దు దేనికో చెప్పాలని టీడీపీ నేతలు ఫైర్

ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు చేసినట్లుగా తెలిపారు .దీంతో టిడిపి నేతలు పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మ పరిరక్షణ యాత్రకు నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులు ఈరోజు రద్దు చేయడం వెనుక ఆంతర్యమేంటి అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ధర్మ పరిరక్షణ యాత్ర జరిగితే ముఖ్యమంత్రి నిజస్వరూపం బయట పడుతుందని అడ్డుకుంటున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కి దేవుడంటే భయం లేదని, ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా ఆయన లో చలనం లేదని తీవ్ర విమర్శలు చేశారు.

బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు .. పోలీసుల తీరుపై టీడీపీ నేతల ధర్నా

బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు .. పోలీసుల తీరుపై టీడీపీ నేతల ధర్నా

ఇక అలిపిరి నుండి ధర్మపరిరక్షణ యాత్రను ప్రారంభించిన టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గద్దె రామ్మోహన్, బుద్ధ వెంకన్న, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తదితర నేతలను అడ్డుకున్న పోలీసులు ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు అయిందని తెలిపారు. దీంతో రుయా ఆస్పత్రి వద్ద రోడ్డుపై బైఠాయించిన టిడిపి నేతలు పోలీసుల, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ధర్మ పరిరక్షణ యాత్ర సందర్భంగా నిర్వహించ తలపెట్టిన బైక్ ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్లాన్ కు చెక్ పెట్టిన జగన్ సర్కార్

చంద్రబాబు ప్లాన్ కు చెక్ పెట్టిన జగన్ సర్కార్

ధర్మ పరిరక్షణా యాత్ర ద్వారా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం పర్యటించాలని , హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వంపై విముఖత వచ్చేలా చేస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు భావించారు . అందులో భాగంగా భారీగా ప్లాన్ చేసి టీడీపీ నేతలను రంగంలోకి దింపారు . ఇక వైసీపీ సర్కార్ అనుమతి రద్దు చేసి టీడీపీకి, చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చింది .

English summary
Andhra Pradesh politics is changing drastically. The steps taken by TDP chief Chandrababu Naidu in the wake of the by-election for the Tirupati parliamentary seat have become interesting. The Telugu Desam Party (TDP) has called for a Dharmaparikshana Yatra in the Tirupati parliamentary constituency, saying attacks on temples continue in the AP. Chandrababu planned to garner public support through this trip .However, Jagan government checked Chandrababu's plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X