తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మపోరాటంలో మాదే విజయం, అన్నింటికి సిద్దమయ్యే పోరాటం: బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి:నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం చేస్తున్నామని, ధర్మ పోరాటంలో తామే విజయం సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.నీతిమాలిన పార్టీలకు మద్దతిస్తూ కేంద్రం ఏం సంకేతాలిస్తోందని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర హమీలను తిరుపతి సాక్షిగా మోడీ ఇచ్చిన హమీలను ధర్మపోరాట సభలో టిడిపి విన్పించింది. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా మోడీ ఇచ్చిన హమీల సీడీలను ఈ సభ ద్వారా విన్పించారు.

2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా బిజెపి ఇచ్చిన ఎన్నికల హమీలను విస్మరించిందని ఆరోపిస్తూ టిడిపి ఆధ్వర్యంలో సోమవారం నాడు ధర్మపోరాట దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహనికి నివాళులర్పించారు. టిడిపికి చెందిన పలువురు నేతలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతిమ విజయం మాదే

అంతిమ విజయం మాదే

నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై తాము ధర్మ పోరాటం చేస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు. నాలుగేళ్ళు గడిచినా ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. నాలుగేళ్ళ క్రితం మోడీ ఇచ్చిన హమీలను గుర్తు చేయడంతో బిజెపి చేసిన నమ్మకద్రోహన్ని ప్రజలకు వివరించేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెరప్పారు. ధర్మపోరాటంలో విజయం సాధిస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

పోలవరంపై తప్పుడు ప్రచారం

పోలవరంపై తప్పుడు ప్రచారం

పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.నీతి ఆయోగ్ రికమండేషన్స్ ప్రకారంగానే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కూడ తప్పుడు ప్రచారంతో అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఇబ్బందులున్నా ఈ ప్రాజెక్టు పనులను మరింత వేగంగా చేస్తున్నామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యమన్నారు.

తెలుగు వారిని ఇబ్బందిపెడితే ఇబ్బందులే

తెలుగు వారిని ఇబ్బందిపెడితే ఇబ్బందులే

తెలుగు వారితో పెట్టుకొన్న వారు ఏనాడూ బాగుపడలేదని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పిస్తే తెలుగు ప్రజలు పోరాటం చేస్తే ఇందిరాగాంధీ తన నిర్ణయాన్ని మార్చుకొన్నారని ఆయన చెప్పారు.ప్రతి శుక్రవారం జగన్ చేతులు కట్టుకుని కోర్టులో నించుంటాడని, మీకు ఆయన గొప్ప నాయకుడిగా అనిపిస్తే ఆయనతో పొత్తు పెట్టుకోండని బీజేపీని విమర్శించారు. అంతేగానీ, టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తే, ఏపీ ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని అన్నారు.టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తే, ఏపీ ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని అన్నారు.

నాపై ఆరోపణలు రుజువు చేయండి

నాపై ఆరోపణలు రుజువు చేయండి

తనపై ఆరోపణలు విసిరే ముందు వాటికి ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. అర్థంలేని ఆరోపణలు చేయకండి. నా వయసు 34 సంవత్సరాలు. ఇంకా 40 ఏళ్లు ఏపీ రాజకీయాల్లో ఉండాలన్న కోరిక ఉంది. నేను మళ్లీ చెబుతున్నా.. మా తాత, నాన్నలా నాకు మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ, వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 25కి 25 లోక్‌సభ సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పుతారు" అని అన్నారు.బీజేపీ జాతీయ పార్టీ అని... వాజ్‌పేయి, అడ్వాణీలాంటి యుగపురుషులు నడిపిన పార్టీ అన్నారు. ఇప్పుడు దొంగబ్బాయితో లాలూచీపడ్డారంటూ పరోక్షంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు.

ఒక్క రూపాయి ఎక్కువ అడగలేదు

ఒక్క రూపాయి ఎక్కువ అడగలేదు

విభజన చట్టంలో చెప్పిన అంశాలు మినహ ఒక్క పైసా ఎక్కువ కూడ తాము అడగలేదని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఏమయినా ఉపయోగపడుతుందేమోనని ఆనాడు ఊరుకున్నామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మితే నమ్మక ద్రోహం చేసిందని సుజనా చౌదరి అన్నారు. ఎన్డీఏపై పోరాటాన్ని మొదటి నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు.. వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. చాలా ఓపిక పట్టి చివరికి నాలుగేళ్ల తరువాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశామని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర సర్కారుని నిలదీసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్ర సర్కారు కాలయాపన చేసిందని అన్నారు

అన్నింటికి సిద్దమయ్యే పోరాటం

అన్నింటికి సిద్దమయ్యే పోరాటం


పొట్టగొడితే తిరుగుబాటు తప్పదని బీజేపీకి సూటిగా సవాల్ విసిరారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తమిళనాడులో కుట్ర రాజకీయాలు చేశారని.. అదే పంథాలో ఏపీలో చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

కర్నాటక ఎన్నికల్లో ఓడించి కుట్రను తిప్పికొట్టాలని తెలుగు వారికి పిలుపునిచ్చారు. పొట్టకొట్టినప్పుడు తిరుగుబాటు తప్ప మరో దారిలేదన్నారు. కురుక్షేత్రంలో గెలిచింది ధర్మమే తప్ప అధర్మం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రధాని ఎవరో తెలుగువాళ్లే నిర్ణయించాలన్నారు. మనల్ని అణగదొక్కి అన్యాయం చేస్తున్నారన్నారు.

మోదీపై, కేంద్రంపై పోరాడుతుంటే వైసీపీ తనపై విమర్శలు చేస్తుందన్న ఆయన నయవంచన పేరుతో దీక్ష చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. నమ్మకద్రోహం వెంకన్న సాక్షిగా చేశారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణలు బాధాకరమన్నారు.

నరేంద్ర మోదీపై ఈగ వాలనివ్వడం లేదని వైసీపీని ఉద్దేశించి అన్నారు. నాపై ఒంటికాలిపై లేస్తున్నారని అన్నారు. అన్నిటికీ సిద్ధమయ్యే పోరాటం మొదలుపెట్టా అన్నారు. తెలుగు వారి పౌరుషం .. ఇందిరాగాంధీ చూశారు. ఎన్టీఆర్‌ను దించేస్తే పీఠంపై కూర్చోపెట్టామన్నారు. గత ఎన్నికల్లో 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. అవినీతిపరుడి అండ చూసుకొని బీజేపీ వాళ్లు రెచ్చిపోతున్నారని విమర్శించారు.

English summary
The ruling TDP government has intensified the protest against Prime Minister Narendra Modi led NDA government over its ignorance towards Andhra Pradesh and not fulfilling the promises it made in the election manifesto and State division Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X