వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నేతలను అడుగుదాం, జగన్‌ను ఎలా వదిలిపెడదాం: నేతలతో బాబు

పాదయాత్రలో వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రులు, టీడీపీ నేతలు ఆయనపై ధ్వజమెత్తుతున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: పాదయాత్రలో వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రులు, టీడీపీ నేతలు ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప విమర్శించారు.

చదవండి: పార్టీ మారి తప్పుచేశాం: నేతల ముందే టీడీపీపై ఆనం ఘాటు వ్యాఖ్యలు, అసహనం?

చదవండి: సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ పాదయాత్ర, జగన్‌కు షాక్ తగిలేనా?

జగన్ ఆశలు అడియాస కాక తప్పదు

జగన్ ఆశలు అడియాస కాక తప్పదు

ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్న ఆయన ఆశ అడియాశ కాక తప్పదన్నారు. అవినీతిపరుడు అడుగుజాడల్లో నడిస్తే అతడి బురద ఇతరులకు అంటుకుంటుందని కేఈ చినరాజప్ప అన్నారు.
రానున్న ఎన్నికల్లో జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మంత్రి నారాయణ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించుకోవాల్సిన అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర పేరుతో జగన్‌ పారిపోయారన్నారు.

వైయస్ చనిపోయిన ఆందోళనలో ఉంటే

వైయస్ చనిపోయిన ఆందోళనలో ఉంటే

పావురాళ్లగుట్టలో వైయస్ రాజశేఖర రెడ్డి అదృశ్యమయ్యారన్న సమాచారంతో రాష్ట్రమంతా ఆందోళనగా ఉన్న సమయంలోనే విద్యుత్ కేంద్రంతో సహా పోలవరం ప్రాజెక్టు టెండర్లను ఆన్‌లైన్‌లో ఎందుకు అప్‌లోడ్‌ చేశారని జగన్‌ను మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. జలవిద్యుత్‌ కేంద్రాన్ని తీసేసి టెండర్లు పిలిచినందునే వైసీపీని స్థాపించడం నిజామా కాదా అని జగన్‌ను దేవినేని నిలదీశారు. పట్టిసీమ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీరు అందిస్తే నీరు లేక పంటలు ఎండిపోయాయని సొంత పత్రిక సాక్షిలో రాయిస్తావా అని మండిపడ్డారు.

జగన్ అవసరమా, వైసీపీ నేతలను నిలదీద్దాం

జగన్ అవసరమా, వైసీపీ నేతలను నిలదీద్దాం

హవాలా ద్వారా అక్రమాలకు పాల్పడిన ప్రముఖులతో ఈడీ విడుదల చేసిన జాబితాలో జగన్ పేరు, పారడైజ్ పేపర్లలో ఆయన పేరు తదితరాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. మనం జగన్‌కు ప్రశ్నలు వేయడం, ఆయనను ఉద్దేశించి మాట్లాడటం అవసరం లేదని, రెండు కోణాల్లో మనం మాట్లాడితే చాలని, ఒకటి ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ప్రజలను అడుగుదామని, అలాగే వైసీపీలో ఉన్న వారిని ఉద్దేశించి మరో కోణం అని చెప్పారు. ఇలాంటి అవినీతిపరుడి పార్టీలో ఉండి పని చేయడం అవసరమా అని వైసీపీ నేతలను నిలదీద్దామన్నారు. ఆత్మగౌరవం చంపుకొని వారు పని చేస్తున్నారన్నారు.

జగన్‌ను ఎలా వదిలిపెడతాం

జగన్‌ను ఎలా వదిలిపెడతాం

జగన్ గురించి పదేపదే మాట్లాడవద్దని, అలా చేస్తే ఆయనకు ప్రచారం కల్పించినట్లవుతుందని చంద్రబాబు నేతలకు చెప్పారు. కానీ ఈడీ జాబితా వెలువడిన నేపథ్యంలో దాని గురించి, అందులో జగన్‌ పేరు చోటు చేసుకోవడంపై వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని జగన్‌ పాదయాత్ర చేస్తున్నాడని, ఆయన దేశంలో అగ్రశ్రేణి ఆర్థిక నేరగాడని ఈడీ నిర్ధారించిందని, దానిని మేం ఎలా పెడదామని, జగన్‌ చేతిలో పెడితే ఈ రాష్ట్రం ఏమవుతుందో ప్రజలకు వివరిస్తామని టిడిపి నేతలు చెబుతున్నారు.

English summary
Telugu Desam Party did not want to leave YSR Congress Party chief YS Jagan Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X