• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీ మరణం 23.05.2019.. టీడీపీ చావుకు కారణాలివే ... రాం గోపాల్ వర్మ

|

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం దిశగా టీడీపీ పయనిస్తోంది. కనీసం 30 స్థానాల్లో కూడా ఆధిక్యం చూపించలేకపోయింది .మంగళగిరిలో నారా లోకేష్ ఓటమిపాలయ్యారు. ఏపీలో మంత్రులుగా ఇంతకాలం అధికారం చెలాయించిన వారు అడ్రెస్ లేకుండా పోయారు. వైసీపీ సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది. సైకిల్ కి పంక్చర్ చేసి ఫ్యాన్ గాలి జోరుగా వీస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపై లక్ష్మీస్ ఎన్టీర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్విటర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు.

టీడీపీ ఓటమితో వర్మ షాకింగ్ ట్వీట్

టీడీపీ ఓటమితో వర్మ షాకింగ్ ట్వీట్

టీడీపీకి వ్యతరేకంగా ట్వీట్స్ పెడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్‌కు అభినందలు చెబుతూనే చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఆర్జీవీ. తాజాగా ఆయన చేసిన ట్వీట్ లో టీడీపీ 1982 మార్చ్ 29 న జన్మించిన టీడీపీ 23 మే 2019 న మరణించిందని పేర్కొన్నారు. ఇక టీడీపీ చావుకు కారణాలు అబద్ధాలు, వెన్ను పోట్లు, అవినీతి, అసమగ్రంగా పనులు చెయ్యటం, వై ఎస్ జగన్ మరియు నారా లోకేష్ అంటూ ఆయన చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది.

పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?

ఎన్నికలకు ముందు టీడీపీపై చంద్రబాబుపై విరుచుకుపడిన వర్మ

ఎన్నికలకు ముందు టీడీపీపై చంద్రబాబుపై విరుచుకుపడిన వర్మ

ఏ మాత్రం అవకాశం దొరికినా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి ఏపీలో చంద్రబాబు పాలన అరాచకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వర్మ తనపడునైన ప్రశ్నలను సైతం చంద్రబాబుకు సంధించారు. నారా లోకేష్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించినా , చంద్రబాబును వెన్నుపోటుదారుడిగా చూపించిన వర్మ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాస్పదుడిగానే ఉన్నాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వర్మ

ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయంలో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న వర్మను పోలీసులు అడ్డగించి తిప్పి హైదరాబాద్ పంపించివేయటంపైన కూడా వర్మ చాలా ఘాటుగానే స్పందించారు. ఏపీలో వివాదాస్పదుడైన వర్మ వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని భావించి ఆయనను తిరిగి హైదరాబాద్ పంపించివేసినట్టు పోలీసులు చెప్పటంతో వర్మ ఫైర్ అయ్యారు .తానేమైనా నేరస్తుడినా అని నిలదీశారు. ఇక ఇప్పుడు చంద్రబాబు పార్టీ టీడీపీ ఓటమి పాలు కావటంతో వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The sensational director Ram Gopal Varma congratulated YSR Congress Party president YS Jagan Mohan Reddy over his historical victory in AP 2019 elections result on Thursday. Through a twitter post, RGV tweets Hearty congratulations to ysjagan and Heart felt condolences to Chandrababu Naidu. RGV has made satirical comment on the defeat of TDP that Born on 29th March 1982, Died 23rd May 2019. Causes of death : Lies , Back Stabbings , Corruption , Incompetence , Y S Jagan and Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more