వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు వైఎస్సార్..ఇప్పుడు జగన్: ఏసీ, ఫ్యాన్ల కింద కూర్చుని దీక్షలంటే ఎలా: జేసీ దివాకర్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

అనంతపురం: రాయలసీమలోని నాలుగు జిల్లాల దాహార్తిని తీర్చడానికి ప్రతిపాదించిన పోతిరెడ్డి పాడు ఎత్తు పెంపు విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న ఇతర పార్టీల నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బీటెక్ రవి.. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి వంటి పలువురు నాయకులు ప్రభుత్వానికి అండగా నిలిచారు.

అదే జాబితాలో తాజాగా మరో సీనియర్ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా చేరారు. పోతిరెడ్డి పాడు విషయంలో వైఎస్ జగన్ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రశంసించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు.

TDP Ex MP JC Diwakar Reddy is supported AP CM YS Jagan on Pothireddy Padu project

ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మించారని, ఇప్పుడు ఆయన కుమారుడు దాని ఎత్తును పెంచి, సముద్రంలో వృధాగా కలిసే నీటిని రాయలసీమ అవసరాల కోసం మళ్లించాలని అనుకోవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. రాయలసీమకు ఎవరు మేలు చేసినా.. మంచి ప్రయత్నాలకు దిగినా.. మెచ్చుకోవాల్సిందేనని అన్నారు.

అదే సమయంలో సొంత తెలుగుదేశం పార్టీ నాయకులకు చురకలు అంటించారు. విద్యుత్ బిల్లులు అధికంగా రావడంపై నిరసన తెలియజేయాలని టీడీపీ నాయకులు భావించడంలో అర్థం లేదని అన్నారు. ఈ బిల్లులను సర్దుబాటు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. దీన్ని అడ్డుగా పెట్టుకుని నిరసన దీక్షలు చేపట్టడం సరికాదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇళ్లల్లో కూర్చుని నిరసన దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని, వారు ఏసీలు, ఫ్యాన్లు వేసుకోవడం లేదా అని ప్రశ్నించారు.

తమ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలను ప్రజలు నమ్మే పరస్థితిలో లేరని అన్నారు. 150 రోజులకు పైగా అమరావతి ప్రాంత రైతులు దీక్ష చేస్తే ఎవరైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. ఇక ఇళ్లల్లో కూర్చుని దీక్షలు చేస్తే జగన్ కంట్లో పడతామా? అని అన్నారు.
టీడీపీ నేతలు దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్దం కావడం లేదని.. ఇంట్లో ఉండి దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారని చెప్పారు. ఇలాంటి చర్యల వల్లే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

English summary
Telugu Desam Party senior leader and Former MP JC Diwakar Reddy is unanimously supported to Chief Minister YS Jagan Mohan Reddy in Pothireddy Padu irrigation project issue. JC Diwakar Reddy told that YS Jagan taking good decision regard this project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X