• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బడ్జెట్‌ నిరాశాజనకం- కేసుల యావతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు- వైసీపీపై యనమల పైర్‌

|

పార్లమెంటులో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని టీడీపీ విమర్శించింది. దేశంలో ప్రస్తుత సమస్యలు, సవాళ్లను పరిష్కరించేలా బడ్జెట్‌ లేదని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఆర్దికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. పేదరికం, ఆర్ధిక అసమానతల తొలగింపు గురించి ప్రస్తావించలేని, పేదలకు ఇచ్చే సబ్సిడీలలో ప్రభుత్వం సహకారం కనిపించడం లేదన్నారు. ఏపీకి సంబంధించి కూడా విభజన హామీల్ని పట్టించుకోలేదన్నారు. దీంతో వైసీపీ నేతలు సొంత ప్రయోజనాల కోసమే కేంద్రమంత్రులు, ప్రధానితో భేటీ అవుతున్నారని అర్ధమైందన్నారు.

 కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచిన టీడీపీ

కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచిన టీడీపీ

ఇవాళ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీలో విపక్ష టీడీపీ పెదవి విరిచింది. ఏపీతో పాటు దేశంలోని ఏ సమస్యకూ ఈ బడ్జెట్‌ పరిష్కారం చూపలేకపోయిందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

దేశంలో ప్రస్తుతం జరుగుతోన్న ఆందోళనల్లో రైతుల డిమాండ్లను ఈ బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ బడ్జెట్ లో ప్రైవేటు పెట్టుబడులను భారీగా రాబట్టడానికి పెద్దగా ప్రాధాన్యంగాని, దానికి సంబంధించి నిధుల కేటాయింపుల ప్రస్తావన లేదని ఆయన తెలిపారు. కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్రానిలలో వ్యాపారాలు, వాణిజ్యం పూర్తిగా దెబ్బతిన్నాయని, కోట్లాది వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు జీవనోపాధి కోల్పోయారని యనమల పేర్కొన్నారు. దాదాపు 9% నిరుద్యోగం పెరిగిందని, ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుద్యోగిత మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో కూడా యువతకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సి వుందన్నారు. అలాంటిది ఈ బడ్జెట్ లో ఏదో కొద్దిగా ఉత్పత్తి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారే తప్ప దానివల్ల అదనంగా ఉద్యోగాలు, ఉపాధి వచ్చే అవకాదు. దీనివల్ల దేశంలోనే కాకుండా ఏపిలో కూడా నిరుద్యోగిత భారీగా ప్రబలే అవకాశం ఉందన్నారు.

 కేంద్ర బడ్జెట్‌లో ఏపీకీ అన్యాయమే..

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకీ అన్యాయమే..

రైతులకు, పేదలకు, ఆంధ్రప్రదేశ్‌కూ ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదని యనమల రామకృష్ణుడు తెలిపారు.

ఏపీ ఆర్ధిక పరిస్థితి బలోపేతానికి కేంద్రం నుంచి సరైన ప్యాకేజి ఈ బడ్జెట్ లో కూడా అందక పోవడం బాధాకరమన్నారు. ఏపిలో ఉన్న సమస్యల పరిష్కారంపై కేంద్రం నుంచి ఏవిధమైన సహకారం అందేవిధంగా కనిపించడం లేదని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను చిన్నచూపు చూస్తోందనేది ఈ బడ్జెట్ లో కనిపిస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో న్యాయం జరగలేదన్నారు.
పేదరికం పెరుగుతోందని, ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయని, వాటిని తగ్గించడంపై, తొలగించడంపై దృష్టి పెట్టలేదని యనమల పేర్కొన్నారు. సామాజిక న్యాయం అనేది కొరవడుతోంది అనేది స్పష్టమైందన్నారు. అసమానతల తొలగింపుపై దృష్టి పెట్టకపోతే అసంతృప్తి పెరుగుతుందన్నారు.

 బడ్జెట్‌లో అన్యాయానికి జగన్‌, వైసీపీ ఎెంపీలదే బాధ్యత

బడ్జెట్‌లో అన్యాయానికి జగన్‌, వైసీపీ ఎెంపీలదే బాధ్యత

ఈసారి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని, ఇందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ ఎంపిలే పూర్తి బాధ్యత వహించాలని యనమల కోరారు.

ఏపీ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని యనమల తెలిపారు.. బెంగళూరు, చెన్నై, కొచ్చి, నాగపూర్ మెట్రోలకే నిధులు ఇచ్చారని, ఆయా రాష్ట్రాల పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది గురించే ప్రస్తావించారన్నారు. ఏపీలో విసిఐసి, బిసిఐసి అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు.
ఏపీ పునర్విభజన చట్టంలో అంశాలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన 7 జిల్లాల అభివృద్దికి నిధులు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యల పరిష్కారాలపై ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదని,
ఈ వైఫల్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని యనమల డిమాండ్‌ చేశారు.

 కేసుల యావతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు

కేసుల యావతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు

సీఎం జగన్‌ ఎంతసేపూ తన కేసుల మాఫీ యావే తప్ప కేంద్ర బడ్జెట్లో నిధులు తెద్దామన్న ఆలోచన లేదన్నారు. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, ఇప్పుడు కనీసం ఆ దిశగా ప్రయత్నం లేదని యనమల ఆరోపించారు.

‘‘ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని'' జగన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజల్లో ఆశలు కల్పించారు. పదవిలోకి వచ్చాక ప్రత్యేక హోదా రాబట్టడం గురించి గాని, పెట్టుబడులు రాబట్టడంపైగాని ఆయన దృష్టి లేదు. ఎంతసేపూ తన కేసుల మాఫీపై ఆలోచనలే తప్ప రాష్రాఅవభివృద్దిపై దృష్టి లేదు. దీనితో కేంద్రాన్ని డిమాండ్ చేసే హక్కును కూడా జగన్ రెడ్డి కోల్పోయారు. 28మంది ఎంపిలు ఉండి కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలం అయ్యారు. 151మంది ఎమ్మెల్యేలు ఉండికూడా రాష్రాటిన్ని విచ్ఛిన్నం చేయడమే లక్యంమ్గా పెట్టుకున్నారు తప్ప, అంతర్గత వనరులు పెంచి, కేంద్రం నిధులు రాబట్టి రాష్రాలకన్ని అభివృద్ది చేయాలన్న తలంపు లేకపోవడం బాధాకరం" అని యనమల విమర్శించారు.

English summary
opposition tdp in andhra pradesh expresses its displeasure over today's union budget. tdp senior leader and former finance minister yanamala ramakrishnudu says its nothing but ysrcp mp's failure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X