విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు BPని పెంచుతున్న గుంటూరు, విజయవాడ?

|
Google Oneindia TeluguNews

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో మూడు లోక్ సభ నియోజకవర్గాలను గెలుచుకోగలిగింది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ఓడించాలని వైసీపీ ప్రణాళికలు వేసుకుంటోంది. ఈ మూడు నియోజకవర్గాల కోసం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే గుంటూరు, విజయవాడ సీట్లలో కచ్చితంగా పాగా వెయ్యాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

బలం చేజారకుండా ప్రయత్నిస్తోన్న టీడీపీ

బలం చేజారకుండా ప్రయత్నిస్తోన్న టీడీపీ


తెలుగుదేశం పార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లో తన బలం ఎక్కడా చేజారకుండా జాగ్రత్తపడుతోంది. అయితే గుంటూరు, విజయవాడ రెండు సీట్లు అధినేత చంద్రబాబునాయుడికి కంట్లో నలుసులా మారాయి. విజయవాడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కేశినేని వ్యవహారం ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. మూడున్నర సంవత్సరాల నుంచి పార్టీ నేతలమీద, పార్టీ మీద, అధినేత మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్న కేశినేని వ్యవహారం పార్టీలో జఠిలంగా మారింది. దీన్ని ఎలా పరిష్కరిస్తారో చంద్రబాబునాయుడికే తెలియాలి.

చురుగ్గా వ్యవహరిస్తోన్న కేశినేని నాని

చురుగ్గా వ్యవహరిస్తోన్న కేశినేని నాని

మరోవైపు ఎన్నికల దగ్గర పడుతుండటంతో కొద్దిరోజులుగా ఎంపీ కేశినేని నాని రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్ధా వెంకన్నతోపాటు ఎంపీ కేశినేని సోదరుడు కేశినేని చిన్ని కలిసి చేస్తున్న రాజకీయంపై నాని మండిపడుతున్నారు. అటువంటి నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, అలాఅయితే పార్టీ గెలవదంటూ వ్యాఖ్యానించారు. మైలవరంలో ఉమకు చెక్ పెట్టడానికి వైసీపీ ఎమ్మెల్యే వసంతను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ తన ప్రత్యర్థి వర్గం మీద పైచేయి సాధించేలా చూసుకుంటున్నారు.

టీడీపీ నాయకులే అడ్డు తగులుతున్నారు

టీడీపీ నాయకులే అడ్డు తగులుతున్నారు

గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న గల్లా జయదేవ్ స్థానిక ప్రజలకే కాదు.. స్థానిక టీడీపీ నాయకులకు కూడా అందుబాటులో ఉండరనే పేరు ఉంది. వచ్చే ఎన్నికల్లో జయదేవ్ పోటీచేస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత లేదు. మరోవైపు విజయవాడ నుంచి కేశినేని నానికి టికెట్ ఉంటుందా? లేదా? అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎవరికిచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని ఎంపీ సోదరుడు చిన్ని తాజాగా ప్రకటించారు. మరోసారి ఈ రెండు నియోజకవర్గాలను గెలుచుకొని ప్రజంతా అమరావతికి మద్దతుగా ఉన్నారని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీలోని నాయకులే అడ్డు తగులుతున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
The Telugu Desam Party was able to win three Lok Sabha constituencies in the last elections, withstanding the rise of the YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X