• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీలో ఆగస్ట్ సంక్షోభం .. తెలుగు తమ్ముళ్లలో టెన్షన్

|

ఏపీలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీని ఇప్పుడు కొత్త సమస్య వేధిస్తుంది. టీడీపీని టెన్షన్ పెట్టే ఘడియలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆగస్ట్ వస్తుందంటే చెమటలు పడుతున్నాయి. ఆగస్ట్ సంక్షోభం మొదటి నుండీ టీడీపీని వేధిస్తుంది. ఇప్పటికే ఏపీలో వలసలతో కుదేలైన టీడీపీ మరో సంక్షోభానికి సిద్ధం అవుతుందా ? ఈ ఆగస్ట్ టీడీపీని ఏం చెయ్యబోతుంది అన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

చంద్రబాబు ఓ హై టెన్షన్ వైర్ .. ముట్టుకుంటే బూడిదే అంటున్న టీడీపీ ఎమ్మెల్సీ

టీడీపీకి మొదటి నుండి కలసి రాణి ఆగస్ట్ నెల .. ఆగస్ట్ నెలలో టీడీపీకి ఎన్నో ఆటుపోట్లు

టీడీపీకి మొదటి నుండి కలసి రాణి ఆగస్ట్ నెల .. ఆగస్ట్ నెలలో టీడీపీకి ఎన్నో ఆటుపోట్లు

పార్టీ ప్రారంభమైనప్పటి నుండి ఆగస్టు సంక్షోభాన్ని టిడిపి ఎదుర్కొంటోంది. గతంలో కూడా ఈ నెలలోనే, టిడిపి ఇమేజ్‌ను ప్రభావితం చేసిన అనేక రాజకీయ సంఘటనలు జరిగాయి. ఇప్పటి వరకు పార్టీ పెట్టిన నాటి నుండి టీడీపీ ఎల్లప్పుడూ ఆగస్టు నెలతో విరోధి సంబంధాన్ని కలిగి ఉంది . ఆగష్టు 1984 లో, నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. పార్టీ స్థాపకుడు ఎన్‌టి రామారావు ఆగస్టులో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఇది టిడిపి సర్కిల్‌లలో సాధారణంగా చెడు శకునాలను సూచించే నెలగా పరిగణిస్తారు . టిడిపి పార్టీ ఎప్పుడూ ఆగస్ట్ నెలలోనే ఎన్నో చేదు అనుభవాలను చవిచూసింది. ఈ ఆగస్టు నెల సెంటిమెంట్ కారణంగా, టిడిపి నాయకులలో టెన్షన్ నెలకొంది .

టీడీపీ లో గతంలోనూ చాలానే ఆగస్ట్ సంక్షోభాలు .. ఈ ఆగస్ట్ లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో తెలుగు తమ్ముళ్ళు

టీడీపీ లో గతంలోనూ చాలానే ఆగస్ట్ సంక్షోభాలు .. ఈ ఆగస్ట్ లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో తెలుగు తమ్ముళ్ళు

1984లో అన్న నందమూరి మీద నాదెండ్ల వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు క్యాంప్ రాజకీయాలు నడిపి పార్టీని, అన్న గారినీ కాపాడారు. ఇక 1995లో ఆగస్ట్ సంక్షోభంలో చంద్ర బాబే స్వయంగా అన్న గారికి వెన్నుపోటు పొడిచాడు. అప్పుడు జరిగిన వైస్రాయ్ స్కెచ్ కి ఇక ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు. ఇక దాంతో బాబు లాభపడి సీఎం కుర్చీ ఎక్కేశారు . ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు అధికారం కోల్పోటానికి 2000 సంవత్సరంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పులు కారణం . ఇక ఇది 2004లో అధికారం కోల్పోటానికి ప్రధాన కారణం అయ్యింది. అక్కడితో ఆగస్ట్ సంక్షోభం ఆగలేదు. ఇక ఆగస్ట్ ఘడియలు మంచిది కాదని భావించి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పాలనాపరమైన కీలక నిర్ణయాలు కానీ, సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ తీసుకునేవారు కాదు. ఇక ఇప్పుడు తాజా ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలైన తర్వాత 2019లో మరోమారు చంద్రబాబు ఆగస్ట్ సంక్షోభంలో ఇబ్బంది పడబోతున్నారా అన్న టెన్షన్ టీడీపీ శ్రేణుల్ని ఇబ్బందికి గురి చేస్తుంది.

టీడీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ , వైసీపీ .. ఆగస్ట్ నెల ఘడియలు సమీపిస్తుంటే ఏం జరుగుతుందో అన్న ఆందోళన

టీడీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ , వైసీపీ .. ఆగస్ట్ నెల ఘడియలు సమీపిస్తుంటే ఏం జరుగుతుందో అన్న ఆందోళన

ఏపీలో టీడీపీ లేకుండా చేస్తామని బీజేపీ పంతం పట్టింది . కేంద్రంలో మరోమారు అధికారంలోకి వచ్చిన బీజేపీతో పెట్టుకున్న బాబు గారికి కష్టకాలం మొదలైనట్లేననే భావన ఒక పక్క వ్యక్తం అవుతుంది. ఈ ఆషాడ మాసం తర్వాత టీడీపీని ఖాళీ చేస్తామని ఏపీ బీజేపీ నాయకులు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఇక ఏపీలో కీలక టీడీపీ నేతలను పార్టీ మార్చటానికి ఏకంగా రాం మాధవ్ రంగంలోకి దిగారు. ఇక ఈ నేపధ్యంలో ఏం జరగబోతుంది . చంద్రబాబుకు ఎవరి వల్ల ఈ ఆగస్ట్ లో కష్టాలు రాబోతున్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క బీజేపీ, మరోపక్క వైసీపీ చంద్రబాబును టార్గెట్ చేస్తున్న వేళ టీడీపీ చరిత్రలోనే లేనంత ఘోర ఓటమి చవి చూసిన సమయంలో వస్తున్న ఆగస్ట్ నెల చంద్రగ్రహణం పట్టిస్తుందా ? టీడీపీని ఏం చేస్తుంది ? అన్న అంశం మాత్రం ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళను భయపెడుతోంది .

English summary
TDP has been facing the crisis of August month since the inception of the party. It is in this month only, many political events took place that has affected the image of TDP. The TDP always has an adversarial relationship with August month. In August 1984, Nadendla Bhaskar Rao had rebelled against NTR and tried to form the government. It is August month, which is generally regarded as a 'month of bad omen' in TDP circles, as party founder NT Rama Rao had lost chief ministership twice in August. TDP had faced such other incidents and it is continuing in August month. Due to this August month sentiment, TDP leaders are reportedly in tension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X