అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్! జాగ్రత్త, నువ్వు జీరో, బీజేపీతో రహస్య ఒప్పందం: టీడీపీ, లోకేష్ అవినీతిపై విష్ణు షాక్

|
Google Oneindia TeluguNews

గుంటూరు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఓటుకు నోటు, నారా లోకేష్ అవినీతికి పాల్పడ్డారని, సింగపూర్ వంటి పాలన చేయాలని, హోదాపై నాలా కేంద్రాన్ని నిలదీయాలని జనసేనాని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించారు.

Recommended Video

చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు : గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఎందుకిచ్చావ్ పవన్ ?

చదవండి: ఇక 2019 అంత సులభం కాదు: నాలుగేళ్ల తర్వాత.. బాబుకు పవన్ భారీ షాక్, ఒక్కో పాయింట్‌తో ఇలా

టీడీపీ నేతలు జూపూడి ప్రభాకర రావు, ఆ పార్టీ అధికార ప్రతినిధి దినకరన్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తదితరులు నిప్పులు చెరిగారు. పవన్ అలా మాట్లాడుతారనుకోలేదని, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా మాట్లాడితే సహించమన్నారు.

చదవండి: ఎన్టీఆర్ తర్వాత.. తెలుగోడి దెబ్బ: మోడీకి పవన్ వార్నింగ్, ఆమరణదీక్ష అవసరమొస్తుందా?

బాబు ముందు పవన్ జీరో

బాబు ముందు పవన్ జీరో

చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయాల ముందు పవన్ కళ్యాణ్ జీరో అని జూపూడి అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి పరిపక్వత లేదని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా మంత్రి నారా లోకేష్ పైన మాట్లాడటం సరికాదని ఎద్దేవా చేశారు.

 పవన్ కళ్యాణ్ వెనుక ఆ ఇద్దరిలో ఎవరున్నారో

పవన్ కళ్యాణ్ వెనుక ఆ ఇద్దరిలో ఎవరున్నారో

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో ఏది ఉందో తెలుసుకుంటామని జూపూడి ప్రభాకర రావు అన్నారు. మోడీ, జగన్‌లను పవన్ ఒక్క మాట అనలేదని టీడీపీనే టార్గెట్ చేశారన్నారు. మరికొందరు మాత్రం పవన్ వెనుక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.

మతిలేకుండా, బీజేపీతో రహస్య ఒప్పందం

మతిలేకుండా, బీజేపీతో రహస్య ఒప్పందం

చంద్రబాబు, నారా లోకేష్‌లపై పవన్ కళ్యాణ్ మతిలేకుండా మాట్లాడారని మంత్రి జవహర్ అన్నారు. నాలుగేళ్లుగా కనిపించని అవినీతి ఇప్పుడు కనిపించిందా అన్నారు. బీజేపీతో పవన్ రహస్య ఒప్పందం ఏమిటో బయటపెట్టాలన్నారు.

విష్ణు కుమార్ రాజు చెప్పారా

విష్ణు కుమార్ రాజు చెప్పారా

జనసేన పార్టీ విధివిధానాలు చెప్పకుండా టీడీపీపై ఆక్రోశం వెళ్లగక్కారని జవహర్ అన్నారు. పవన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మంచిదేనని, రాష్ట్రం కోసం మద్దతిస్తాన్నారు. విశాఖలో భూకబ్జా విషయాలు బీజేపీ విష్ణు కుమార్ రాజు చెప్పారా అని నిలదీశారు. వనజాక్షి కేసులో ఎమ్మెల్యే తప్పులేదని స్వయంగా ఆమెనే చెప్పారన్నారు.

సభలో మాట్లాడే ముందు జాగ్రత్త

సభలో మాట్లాడే ముందు జాగ్రత్త

అవినీతిలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటూ పవన్ చేసిన ఆరోపణలపై ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్ స్పందించారు. 2015కు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించి నాడు ఎన్జేఈఆర్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని, బహిరంగ సభలో మాట్లాడేముందు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. తాజా నివేదిక ప్రకారం, దేశ వ్యాప్తంగా చూస్తే అవినీతిలో 20వ స్థానంలో ఏపీ ఉందన్నారు. లోకేశ్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, కేవలం ఆరోపణలు గుప్పించారన్నారు.

స్పందించనని సుజన

స్పందించనని సుజన

చంద్రబాబు, లోకేష్‌లపై పవన్ చేసిన వ్యాఖ్యలు తాను వినలేదని, దానిపై స్పందించనని సుజనా చౌదరి అన్నారు. ఆ వ్యాఖ్యలపై తర్వాత స్పందిస్తానని చెప్పారు. కాగా, లోకేష్ కరప్షన్ అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో పవన్ తమతో ఉంటారో ఉండరోనని, జగన్‌ను ఎదుర్కోవాలని, కరప్షన్ చేస్తామని బాహాటంగానే చెబితే అంతకుమించి బరితెగింపు ఏముంటుందని, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి అయితే తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టడం లేదు కదా అన్నారు.

పవన్‌కు విష్ణు మద్దతు, లోకేష్ పైన మాత్రం

పవన్‌కు విష్ణు మద్దతు, లోకేష్ పైన మాత్రం

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు స్పందించారు. జనం అనుకుంటున్నదే పవన్ చెప్పారన్నారు. ఇసుక, భూములు దోచేస్తున్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. మిత్రపక్షంగా చెబితే వినలేదన్నారు. పవన్ వ్యాఖ్యలకు టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. లోకేష్ అవినీతిపై సాక్షాలు లేకుండా మాట్లాడలేమన్నారు.

ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు

ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు

కాగా, టీడీపీ నాయకులు 2019 ఎన్నికలకు ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఇప్పటికే మేం పెట్టేశామని, అన్నీ సర్దేశామని, దానిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశామని బాహాటంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని ఏ మేర పరిహాసిస్తున్నారో తెలుస్తుందని, మీరు చేసే పనులు చూస్తుంటే ఎన్టీఆర్, టంగుటూరిల ఆత్మ క్షోభిస్తుందన్నారు.

English summary
Telugu Desam Party leader fired at Jana Sena chief Pawan Kalyan for his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X