వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ట్రాప్‌లో టీడీపీ..ఫిక్స్ చేసేసారు : అస్త్రం చిక్కిందా..ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్ర‌బాబాబు స‌మ‌ర్ధ‌త‌కు ప‌రీక్షా స‌మ‌యం. 40 ఏళ్ల అనుభ‌వానికి క‌ష్ట‌కాలం. జ‌గ‌న్ కూల‌గొట్టింది ప్ర‌జా వేదిక కాదు. చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విచ్చ‌ల‌విడిగా అవినితికి పాల్ప‌డ్డార‌ని..త‌న ప్ర‌భుత్వంలో అనితీని ఉపేక్షించ‌బోమ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. రాజ‌ధాని అమ‌రావ‌తి మీద అనేక ఆరోప‌ణ‌లు చేసిన జ‌గ‌న్‌..తాను అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టీడీపీని ఇరుకున పెడుతూనే తాను వ్యూహాత్మ‌కంగా అడ‌గులు వేస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాల మీద టీడీపీ అధినేత చంద్ర‌బాబు కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసారు. జ‌గ‌న్‌ను ఎలా దెబ్బ తీయాలి..ఇప్పుడు పార్టీ దీనిని అస్త్రంగా మ‌ల‌చుకోవాల అనే అంశం మీద ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు.

 జ‌గ‌న్ ఫిక్స్ చేసేసారా..

జ‌గ‌న్ ఫిక్స్ చేసేసారా..

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసారు. ఇప్పుడు ప్ర‌జా వేదిక కూల్చ‌టం ద్వారా అది అక్ర‌మ నిర్మాణ‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతున్న స‌మ‌యంలో..దీనికి సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట పెడుతున్నారు. పూలు పండించే ఒక‌ సాధార‌ణ రైతు వ‌ద్ద రోడ్డు కోస‌మంటూ నాటి అధికారులు బ‌ల‌వంతంగా భూమిని సేక‌రించారు. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా నిర్మాణాలు చేప‌ట్టారు. ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌టంతో అక్క‌డి నిర్మాణాల పైన దృష్టి సారించారు. ముందుగా చంద్ర‌బాబు నివాసం జోలికి వెళ్ల‌కుండా..ఆయ‌న ఇంటి ప‌క్క‌నే ఉన్న భ‌వనాన్ని రాత్రికి రాత్రే కూల్చేసారు. అయితే, ప్ర‌భుత్వం చెబుతున్న విధంగా అది అక్ర‌మ నిర్మాణం కాద‌ని మాత్రం టీడీపీ నేత‌లు చెప్ప‌లేక‌పోతున్నారు. మిగిలిన నిర్మాణాలు త‌మ హ‌యాంలో చేప‌ట్ట‌న‌వి కాద‌ని త‌ప్పించుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో మిగిలిన అక్ర‌మ క‌ట్ట‌డాల పైన ఏం చేస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, ఈ స‌మావేశంలో ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

అస్త్రం చిక్కిందా..ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా

అస్త్రం చిక్కిందా..ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారా

టీడీపీ నేత‌లు ప్ర‌జా వేదిక కూల్చివేను స‌మ‌ర్ధించ‌లేక‌..వ్య‌తిరేకించ‌లేక త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఇది కక్ష్య సాధింపు అంటూ ప్ర‌భుత్వం మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నారు టీడీపీ నేత‌లు. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు రైతు భూమిని తీసుకొని అక్ర‌మంగా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో నిర్మాణం చేయ‌టాన్ని మాత్రం వారు స‌మ‌ర్ధించుకోలేక పోతున్నారు. చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఉంటున్న నివాసం సైతం అక్ర‌మమేనంటూ నోటీసు ఇవ్వ‌టానికి ప్ర‌భుత్వం సిద్ద‌మైంది. దీంతో..అది అక్ర‌మమేన‌ని తేలితే ఖాళీ చేయ‌టానికి సిద్ద‌మ‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇదే కూల్చివేత ద్వారా పేద‌ల ఇళ్ల పైకి జ‌గ‌న్ ఇదే విధంగా వెళ్ల‌వ‌ద్దు అని చెబుతూ ప‌రోక్షంగా వారిలో ఆందోళ‌న రేకెత్తించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీని ద్వారా జ‌గ‌న్ వెనుక‌డుగు వేస్తార‌ని..ఆ స‌మ‌యంలో తిరిగి జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్లాల‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

సానుభూతి ద‌క్కించుకోగ‌ల‌మా..

సానుభూతి ద‌క్కించుకోగ‌ల‌మా..

ఇక వైపు ప్ర‌జావేదిక కూల్చివేత‌..మ‌రో వైపు సీఎం ఉంటున్న నివాసం పైన నిర్ణ‌యం దిశ‌గా అడుగులు..ఇంకో వైపు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు భ‌ద్ర‌త త‌గ్గింపు వంటి అంశాల పైన ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా చ‌ర్చ జ‌రిగేలా చూడాల‌ని టీడీపీ అధినేత పార్టీ నేత‌ల‌కు సూచిస్తున్నారు. టీడీపీ పైన ప్ర‌భుత్వం క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌నే సందేశాన్ని బ‌లంగా తీసుకెళ్లాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచ‌న‌లు వెళ్లాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో దీని పైన వ్య‌తిరేక పెరిగే ఛాన్స్ కూడా ఉంద‌ని కొంద‌రు సీనియ‌ర్లు అందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వంలో జ‌రిగిన నిర్మాణాలు కాద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసినా..అయిదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదంటే మాత్రం వారి వ‌ద్ద స‌మాధానం రావ‌టం లేదు. దీంతో..ఇప్పుడు చంద్ర‌బాబు ఎటువంటి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
TDP fixed in AP CM Jagan political trap. Jagan ordered for demolish of Prjavedika. Now TDP Chief Chandra babu meet with party leaders on this demolish issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X