వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జ‌గ‌న్‌కు లోకేశ్ హెచ్చ‌రిక‌: ఇదేనా.. రాజ‌న్న రాజ్యం: స‌హ‌నాన్ని ప‌రీక్షంచ‌కండి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇదేనా రాజ‌న్న రాజ్యం సీఎం జ‌గ‌న్‌కు లోకేశ్ హెచ్చ‌రిక‌ || Oneindia Telugu

టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు..ఎమ్మెల్సీ లోకేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప‌రోక్షంగా హెచ్చ‌రిక చేసారు. గెలుపు తో బాధ్య‌త పెరగాలి అంటూ హిత‌బోధ చేసారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల పైన దాడుల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇదేనా మీరు చెప్పిన రాజ‌న్న రాజ్యం అని ప్ర‌శ్నించారు. త‌మ స‌హనాన్ని ప‌రీక్షించ‌వ‌ద్దు అంటూ హెచ్చ‌రించారు. తొలిసారిగా లోకేశ్ ఈ స్థాయిలో స్పందించ‌టం పైనే ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది.

ప్ర‌భుత్వానికి లోకేశ్ హెచ్చ‌రిక‌..
మాజీ మంత్రి..టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ ఏపీ ప్ర‌భుత్వానికి హెచ్చరిక చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు..సానుభూతి ప‌రుల మీద వైసీపీ రౌడీలు దాడులు..దౌర్జ‌న్యాలు చేస్త‌న్నార‌ని ఆరోపించారు. ఇలాంటి వాటితో టీడీపీ కేడ‌ర్ స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌వ‌ద‌మ‌ద్ని లోకేశ్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ట్వీట్ చేసిన లోకేశ్ గుంటూరు జిల్లా మాచ‌వ‌రం మండ‌లంలోని పిన్నెల్లి గ్రామంలో టీడీపీకి ఓటేశారంటూ అక్క‌డి రైతుల‌ను అయిదేళ్ల పాటు గ్రామం నుండి బ‌హిష్క‌రించార‌ని వివ‌రించారు. అదే విధంగా నెల్లూరు వెంకటేశ్వ‌ర‌పురం.. గాంధీ గిరిజ నాల‌నీలో పేద‌ల గుడిసెలు కూల్చ‌టానికి ప్ర‌య‌త్నించార‌ని ఆరోపించారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై వంద‌కు పైగా దాడులు చేసార‌ని చెప్పుకొచ్చారు. ఇదేనా మీరు చెప్పిన రాజ్యం అని అని లోకేశ్ ప్ర‌శ్నించారు. పోలీసులు స్పందించి ఇక‌నైనా అలాంటి అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని కోరారు.

TDP General Secretary Lokesh Challenged AP Cm Jagan. Lokesh says dont test TDP cadre patience

మొద‌టిసారే లోకేశ్ ఘాటుగా..
ఏపీలో గ‌త అయిదేళ్ల కాలంలో ఎక్క‌డా లేని విధంగా అవినీతి జ‌రిగింద‌ని కొత్త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో టీడీపీ మాత్రం వైసీపీని ల‌క్ష్యంగా చేసుకోవ‌టానికి టీడీపీ శ్రేణుల పైన అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ నేత‌లు దాడుల‌కు చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు మొద‌లు పెట్టారు. దీని పైనా ప్ర‌తీ స‌మావేశంలోనూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఇక‌, దీని పైన మంత్రులు సైతం స్పందించారు. ఏ పార్టీ వారి మీద ఎవ‌రి కార్య‌క‌ర్త‌ల మీద దాడులు జ‌ర‌గ‌టానికి వీళ్లేద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసార‌ని మంత్రులు చెబుతున్నారు. ఇప్పుడు లోకేశ్ తొలి సారిగా వీటి పైన స్పందిస్తూనే..ఘాటుగా వ్యాఖ్య‌లు చేసారు. మ‌రి..ఇప్పుడు లోకేశ్ చేసిన వ్యాఖ్య‌ల మీద వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తానేది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
TDP General Secretary Lokesh Challenged AP Cm Jagan. Lokesh says dont test TDP cadre patience. He asked Police to control attacks on TDP Cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X