వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్.. ఓ బ్రాండ్ అంబాసిడర్: కేరాఫ్‌గా చంద్రబాబు: నారా లోకేష్ సంచలన కామెంట్స్

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణను కేంద్ర బిందువుగా చేసుకుని ఆయన వైఎస్ జగన్‌పై ఆరోపణాస్త్రాలను సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన మరుసటి రోజే నారా లోకేష్ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని, భారీగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.

సచిన్ ఘర్ వాపసీ వెనుక కథేంటీ? చక్రం తిప్పిందెవరు? వైఎస్ జగన్‌తో పోలిక: ఆ ట్రెండ్‌కు బ్రేక్సచిన్ ఘర్ వాపసీ వెనుక కథేంటీ? చక్రం తిప్పిందెవరు? వైఎస్ జగన్‌తో పోలిక: ఆ ట్రెండ్‌కు బ్రేక్

చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు అభివృద్ధి వికేంద్రీకరణకు కేర్ అఫ్ అడ్రస్‌గా నిలిచారని నారా లోకేష్ చెప్పుకొన్నారు. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పారిశ్రామికరంగాన్ని పరుగులు పెట్టించామని చెప్పారు. దీని ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలను అన్ని జిల్లాలకు పంచామని చెప్పారు. తమ ఘనతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూసగుచ్చినట్టు వివరించిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

TDP General Secretary Nara Lokesh Criticising to AP CM YS Jagan on Industrialisation

తమ అయిదేళ్ల పరిపాలనలో రాష్ట్రానికి 39,450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలను కల్పించామని నారా లోకేష్ అన్నారు. తాను ప్రాతినిథ్యాన్ని వహించిన ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇచ్చిన అనుమతుల వల్లే కొత్తగా 2,78,586 ఉద్యోగాలు మున్ముందు రానున్నాయని, ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెప్పుకొందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

Recommended Video

Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu

14 నెలల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలి వెళ్లినవే అధికంగా ఉన్నాయని అన్నారు. ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇప్పటిదాకా ఏర్పాటు కాలేదని నారా లోకేష్ చెప్పారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధ్వంసక విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ విధ్వేషకర విధానాలను బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని, ఇక పెట్టుబడులు ఎలా వస్తాయని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

English summary
Telugu Desam Party General Secretary and former Minister Nara Lokesh once again criticising to Chief Minister YS Jagan Mohan Reddy on industrialisation. He alleged that YS Jagan destroyed the brand image of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X