గుడులు కూల్చారు- రధాలు తగలబెట్టారు : రేపులు చేసింది ఎల్లో నేతలే : లీకులు అక్కడే - సీఎం జగన్ ఫైర్..!!
ముఖ్యమంత్రి జగన్ టీడీపీ..ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న మీడియా పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలతో టార్గెట్ చేసారు. రాష్ట్రంలో జరిగిన అత్యాచారాలు.. ప్రశ్నా పత్రాల లీకుల వెనుక ఉన్నది ఎల్లో పార్టీ నేతలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయవాడ - గుంటూరు - విశాఖలో జరిగిన ఘనటల్లో టీడీపీ సంబంధిత వ్యక్తులే ఉన్నారంటూ సీఎం చెప్పుకొచ్చారు. మహిళా సంక్షేమం- సాధికారితలో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు.

రేపుల్లో ఉన్నది టీడీపీ నేతలే
మహిళల
మనస్సుల్లో
జగన్
నిలిచి
పోతారనే
అక్కసుతోనే
ప్రచారం
చేస్తున్నారు.
దిశ
యాప్
ను
తీసుకొచ్చాం.
ఇన్ని
జాగ్రత్తలు
తీసుకున్న
జరుగుతున్న
ఘటనల్లో
కఠినంగా
వ్యవహరిస్తున్నామని
సీఎం
చెప్పారు.
దోషులు
ఎవరైనా
సరే
వదిలేది
లేదని
సీఎం
జగన్
తేల్చి
చెప్పారు.
టీడీపీ..మద్దతు
మీడియా
ను
దుష్ఠచతుష్ఠయం..
గుంట
నక్కలు..
దొంగల
ముఠా
అంటూ
సీఎం
విరుచుకుపడ్డారు.
తిరుపతి
కేంద్రంగా
విద్యా
దీవెన
నిధులను
సీఎం
విడుదల
చేసారు.
మంచి
చేస్తే
జీర్ణించుకోలేరు..గోబెల్స్
ప్రచారం
తో
ప్రజలను
తప్పు
దోవ
పట్టించే
ప్రయత్నం
చేస్తున్నారని
ఫైర్
అయ్యారు.

వాళ్లు ధ్వంసం చేసారు..మనం నిర్మించాం
మంచి జరిగింది మీకు.. నిజాలు మీకు తెలుసు అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ప్రశ్నాపత్రాలను ఫొటోలను తీసి వాట్సప్ లో బయటకు పంపి..లీకు చేసే ప్రయత్నం చేసింది కూడా టీడీపీ మద్దతుదారులేనని చెప్పకొచ్చారు. రెండు ప్రాంతాల్లో నారాయణ.. మరో రెండు ప్రాంతాల్లో చైతన్య స్కూళ్లలో జరిగాయని సీఎం వివరించారు. నారాయణ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేసారు. గుడులు ధ్వసం చెస్తే..మనం కట్టాం. వాళ్లు విగ్రహాలను విరిచేస్తే..మనం పెట్టించాం. వాళ్లు రధలు తగలబెడితే..మనం నిర్మించాం. రైతును దెబ్బ తీస్తే...మనం నిలబెట్టాం. పిల్లలను-పల్లెలకు నష్టం చేస్తే...మనం వాటిని తిరిగి నిర్మించామంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గడప వద్దకే సుపరిపాలన తీసుకొచ్చి..దేశానికి మార్గనిర్దేశకం చేస్తున్నామని చెప్పారు.

దొంగల ముఠా - గుంట నక్కలంటూ
నాడు
నేడుతో
ఆస్పత్రులు..పాఠశాలలను
నిలబెడుతున్నారు.
ఎన్ని
ఆటంకాలు
తెచ్చినా
ఇంగ్లీషు
మీడియం
అమలు
చేస్తున్నామని
వెల్లడించారు.
ఎన్నికలప్పుడు
మాట
ఇస్తారు..
అధికారంలోకి
వస్తే
అమలు
చేయరని
టీడీపీ
పైన
ధ్వజమెత్తారు.
పేదలు-
ఎస్సీ-బీసీ-ఎస్టీ-మైనార్టీలను
ఎలా
వాడుకున్నారో
చూసామంటూ
వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం
పేదలకు
ఇళ్లు
ఇస్తుంటే..లబ్ది
దారులను
రెచ్చగొట్టే
ప్రయత్నం
చేస్తున్నారని
సీఎం
ఆరోపించారు.
సీఎం
గా
జగన్
కు
వస్తున్న
మంచి
పేరు
తట్టుకోలేక..జీర్ణించుకోలేక
గోబెల్స్
ప్రచారం
చేస్తున్నారని
మండిపడ్డారు.

అప్పుడు - ఇప్పుడు పాలన ఎలా ఉందంటూ
ఇప్పటి వరకు లక్షా 38 వేల కోట్ల రూపాయాలను పేదల ఖాతాల్లో జమ చేసామని సీఎం వివరించారు. ఇంగ్లీషు మీడియం చదువులకు ఎన్ని అడ్డంకులు కల్పించాన ముందుకే అడుగులు వేసామని సీఎం చెప్పారు. జూన్ లో రూ 6400 కోట్లు అమ్మఒడి ద్వారా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో మహిళలు- పేదలు - విద్యార్ధులకు ఎలాంటి మేలు జరిగిందీ.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందీ అనేది విశ్లేషణ చేయాలని కోరిన సీఎం..ప్రశ్నలు సంధిస్తూ..సభకు హాజరైన వారి నుంచి సమాధానాలు రాబట్టారు.