వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నువ్వు నిద్రపోలేవు.. ..దిక్కున్న చోట చెప్పుకో : చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద సిట్ విచారణకు ఆదేశించారు .చంద్రబాబు ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటిలిజెన్స్ డీఐజీ నేతృత్వంలో జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.ఇక ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ రగడకు కారణం అవుతుంది. టీడీపీపై బురద చల్లాలని వైసీపీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని , కానీ టీడీపీ ఇలాంటి వాటికి భయపడేది లేదని మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్ సీఎం జగన్ పాలనలో ఆ అక్రమాలపై కూడా సిట్ వెయ్యండి : బోండా ఉమా డిమాండ్

 ఎన్ని రాజకీయాలు చేసినా భయపడమన్న చంద్రబాబు

ఎన్ని రాజకీయాలు చేసినా భయపడమన్న చంద్రబాబు


సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలపై ఎలాంటి విచారణ చేసినా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. సీఎం జగన్ ఏమన్నా చేసుకోవచ్చునని, టీడీపీ అవినీతి చెయ్యలేదని , తమపై ఎన్ని రాజకీయాలు చేసినా భయపడమని ,దిక్కున్నచోట చెప్పుకోమన్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్ ఏర్పాటు చేసిన సిట్‌పై స్పందించిన ఆయన తాను ఎప్పుడూ ఏ తప్పు చెయ్యలేదని పేర్కొన్నారు.

జగన్ లా తానే తప్పు చెయ్యలేదన్న మాజీ సీఎం

జగన్ లా తానే తప్పు చెయ్యలేదన్న మాజీ సీఎం

జగన్ మాదిరిగా తాను ఏ తప్పు చేయలేదని, బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని పేర్కొన్నారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ అవినీతి చేసిందని ఆరోపణలు గుప్పిస్తున్నారని, గత ఏడు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు . జగన్ తప్పులు చేసి ఇరుక్కుపోయారని పేర్కొన్న చంద్రబాబు రాత్రులు నిద్ర లేని పరిస్థితి జగన్ కు తప్పక వస్తుందని అభిప్రాయపడ్డారు.

Recommended Video

Disha Act In Maharashtra : Anil Deshmukh Praises Disha Act And AP CM Jagan | Oneindia Telugu
 జగన్ వల్ల ఏదీ కాదన్న టీడీపీ అధినేత

జగన్ వల్ల ఏదీ కాదన్న టీడీపీ అధినేత

ఇక టీడీపీని ఏదో చెయ్యాలని జగన్ చూస్తున్నారని జగన్ వల్ల ఏమీ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఏర్పాటు చేసిన సిట్ బృందంలో సభ్యులంతా పోలీస్ అధికారులే. ఇక వారిని టీడీపీ ఐదేళ్లపాలనపై దర్యాప్తు చేయాలని ఆదేశించటంపై అటు టీడీపీ నేతలు , టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు అవినీతి అలవాటని, తన మీద దృష్టి పెట్టకుండా ఉండేందుకు టీడీపీ నేతలపై బురద చల్లుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు.

English summary
Former CM Chandrababu has criticized AP CM Jagan. TDP leaders are not afraid of any inquiry chandrababu said. TDP President and former Chief Minister Chandrababu said that the CM jagan can be tamed, TDP is not corrupt.Responding to SIT's set up, no matter how many politics done by jagan but tdp leaders had never done anything wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X