వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్-జగన్‌ల పేరుతో టీడీపీ లబ్ధియత్నం: బీజేపీ, ఆ నిర్ణయం సంతోషమని రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తున్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండు కళ్లు అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని పవన్ చూస్తున్నారని ఆరోపించారు. జగన్, పవన్‌లు ప్రధాని నరేంద్ర మోడీ ఆడించినట్లు ఆడుతున్నారన్నారు.

ఇప్పుడు జగన్‌కు సారీ చెప్పండి: అంబటి, మీరు రాసిపెట్టుకోవచ్చు: కమెడియన్ పృథ్వీఇప్పుడు జగన్‌కు సారీ చెప్పండి: అంబటి, మీరు రాసిపెట్టుకోవచ్చు: కమెడియన్ పృథ్వీ

కడప స్టీల్ ప్లాంట్ విషయమై ఉక్కు శాఖ మంత్రిని కలిసినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లోగా నిర్ణయం తీసుకోలేమని వారు చెప్పారన్నారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో ఏపీ ఫ్యాక్టరీకి ముడిపెట్టవద్దని కోరినట్లు తెలిపారు. వెనుకబడిన కడప జిల్లాపై కేంద్రానికి కనికరం లేదన్నారు.

TDP is trying for political gain with YS Jagan and Pawan Kalyan, says Vishnu Kumar Raju

టీడీపీకి పని తక్కువ ప్రచారం ఎక్కువ: విష్ణు

తెలుగుదేశం పార్టీకి పని తక్కువ, ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం సాయం ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో మేం (ఏపీ బీజేపీ) విఫలమయ్యామని చెప్పారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీతో పవన్, జగన్ జతకట్టినట్లు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోందన్నారు. చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవన్నారు.

ఆ ఊసే లేదు: రోజా

మహా సంప్రోక్షణ సమయంలో దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నవారిని వెంటనే సస్పెండ్ చేయాలని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా తిరుమలలో డిమాండ్ చేశారు. శ్రీవారి నగలపై చాలామందికి అనుమానాలు ఉన్నాయన్నారు. జేఈవో తిరుమలకు వచ్చినప్పుడు వివరాలు ఆన్‌లైన్ పెడతామని చెప్పారని, ఎనిమిదేళ్లయినా ఆ ఊసే లేదన్నారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా గతంలో సంప్రోక్షణ ఎలా జరిగిందో అదే విధంగా జరగాలన్నారు. తమ డిమాండ్‌పై స్పందించిన ప్రభుత్వం మహా సంప్రోక్షణ సమయంలో రోజుకు 30వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోడానికి నిర్ణయం తీసుకోవడం సంతోషమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైర్ అయిన అర్చకులను తీసుకుంటామన్నారు.

English summary
Telugudesam is trying for political gain with YSR Congress Party chief YS Jagan Mohan Reddy and Jana Sena chief Pawan Kalyan, says Vishnu Kumar Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X