వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పాకు ఝలక్: పార్టీ ఫిరాయించిన కౌన్సిలర్లకు టిడిపి నోటీసులు

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. కానీ, అధికార, విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకుగాను ఈ రెండు పార్టీలు తమ వ్యూహరచన చేస్తున్న

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. కానీ, అధికార, విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకుగాను ఈ రెండు పార్టీలు తమ వ్యూహరచన చేస్తున్నాయి.టిడిపి గుర్తుపై గెలిచి వైసీపీలో చేరిన కౌన్సిలర్లకు ఆ పార్టీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఇంకా పార్టీ మారిన కౌన్సిలర్లు ఇంకా సమాధానమివ్వలేదు.

నంద్యాల మున్సిపాలిటీని టిడిపి కైవసం చేసుకొంది.అయితే వైసీపీ నుండి విజయం సాధించిన కౌన్సిలర్లు కూడ భూమా నాగిరెడ్డి వెంట టిడిపిలో చేరారు.అయితే టిక్కెట్టు కేటాయింపు విషయంలో చంద్రబాబునాయుడు తాత్సారం చేస్తున్నారనే నెపంతో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి ఇటీవలే వైసీపీలో చేరారు.

దీంతో శిల్పా వెంటే మున్సిఫల్ ఛైర్మెన్ సులోచన సహ కౌన్సిలర్లు టిడిపిని వీడారు.వైసీపీలో చేరారు.దీంతో నంద్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టిడిపి నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.ఈ మేరకు కౌన్సిలర్లను తమ వైపుకు లాక్కొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.

వైసీపీలో చేరిన కౌన్సిలర్లకు నోటీసులు

వైసీపీలో చేరిన కౌన్సిలర్లకు నోటీసులు

టిడిపిని వీడి వైసీపీలో చేరిన మున్సిఫల్ కౌన్సిలర్లకు టిడిపి నాయకత్వం నోటీసులు జారీచేసింది.మున్సిఫల్ పీఠం నుండి సులోచనను తప్పించేందుకు టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. టిడిపి గుర్తుపై పోటీచేసి విజయం సాధించిన కౌన్సిలర్లకు నోటీసులు పంపింది. తిరిగి పార్టీలోకి రావాలంటూ టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కౌన్సిలర్లను ఆదేశించారు.అయితే నోటీసులు అందుకొన్న శిల్పావర్గం కౌన్సిలర్లు మాత్రం ఈ నోటీసులకు సమాధానమివ్వలేదు.శిల్పా వర్గానికి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు జూన్ 20న, సీఎం చంద్రబాబునాయుడు నంద్యాల పర్యటన సమయంలో కౌన్సిలర్లు శిల్పాకు ఝలకిచ్చారు.

అవిశ్వాసం నాలుగేళ్ళ తర్వాత

అవిశ్వాసం నాలుగేళ్ళ తర్వాత

నంద్యాల మున్సిపాలిటీలో 42 స్థానాలున్నాయి. అయితే 16 మంది కౌన్సిలర్లు వైసీపీ వైపు ఉన్నారు. అయితే అవిశ్వాస తీర్మాణం పెట్టి ఛైర్ పర్సన్ ను తొలగించవచ్చు. అయితే నాలుగేళ్ళ తర్వాతే అవిశ్వాస తీర్మాణం ద్వారా చైర్ పర్సన్ ను తొలగించవచ్చు. అయితే అప్పటివరకు ఆగకుండా ఉండేందుకుగాను టిడిపి నాయకత్వం జాగ్రత్తలను తీసుకొంటుంది.వైసీపీ వైపుకు వెళ్ళిన కౌన్సిలర్లను తమవైపుకు తిప్పుకొనేందుకు టిడిపి చర్యలను తీసుకొంటుంది.దీంతో వైసీపీకి ఇబ్బందులు అనివార్యంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.

చైర్ పర్సన్ సులోచన రాజీనామా

చైర్ పర్సన్ సులోచన రాజీనామా


వైసీపీ నుండి కౌన్సిలర్లు టిడిపి వైపుకు వెళ్తే ఆ పార్టీ బలం తగ్గిపోతే రాజీనామా చేయాలని చైర్ పర్సన్ సులోచన భావిస్తున్నట్టు సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే రానున్న వారం రోజుల్లో మున్సిపాలిటీలో కౌన్సిలర్లపై చర్యలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కన్పిస్తోంది.అధికారపార్టీ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది.ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి నంద్యాల మున్సిఫల్ చైర్మెన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే యోచనలో టిడిపి నాయకత్వం ఉంది. అయితే టిడిపి నాయకత్వం వేస్తోన్న అడుగులు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో చూడాలి.

ఎత్తులకు పై ఎత్తులు

ఎత్తులకు పై ఎత్తులు

నంద్యాల అసెంబ్లీ స్థానంలో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఈ స్ధానం నుండి రెండు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.అంతేకాదు ఒక్క దఫా మంత్రిగా కూడ పనిచేశారు. అయితే ఈ స్థానం నుండి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు.కానీ, ఈ స్థానం నుండి ఎంపీగా మూడు దఫాలు పనిచేశారు. కానీ, ఆయన మరణంతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది.టిడిపి తరపున భూమా బ్రహ్మనందరెడ్డి టిడిపి తరపున బరిలో దిగుతున్నారు. వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి బరిలో ఉన్నాడు.

English summary
Tdp Kurnool district president Somishetty Venkateshwarlu issued notices to defected ysrcp councilors. Tdp planning to regain power in Nandyal municipality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X