• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌లో వైఎస్, తునిలో జగన్: టిడిపి కాపు నేతల ధ్వజం

By Pratap
|

హైదరాబాద్: తుని కాపు గర్జనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గూండాలే హింసను రేపారని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కాపు సామాజిక వర్గ నాయకులు విమర్శించారు. తునిలో హింస చేలరేగిన వెంటనే టిడిపి కాపు సామాజిక వర్గం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్‌పై ధ్వజమెత్తారు.

కాపులను బీసీల్లో చేర్చితే వైసీపీకి రాజకీయ మనుగడ ఉండదని, గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వపక్షంలో ప్రతిపక్షంగా వ్యవహరించి నేదురు మల్లి హయాంలో హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించారని, ఇప్పుడు జగన్‌ కూడా అలాగే వ్యవహ రిస్తున్నారని, దానికోసం తూర్పుగోదావరి జిల్లాలో రహస్య సమావేశం నిర్వహించి.. హింస రచన జరిపారని వారు విమర్శిచారు.

తుని ఘటనని కాపు సామాజిక వర్గ ప్రతినిధులుగా తామంతా ఖండిస్తున్నామని టీడీపీ ఏపీ అధ్య క్షుడు క ళా వెంకట్రావు వెల్లడించారు. కాపు సభలో పాల్గొన్న పలు రాజకీయ పక్షాలకు చెందిన నాయ కులపై ఆయన తీవ్ర స్వరం వినిపించారు. వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకుడు వీ హనుమంతరావు ఏం చెప్ప దలుచుకున్నారని, ఏ పేరుతో సమావేశానికి వెళ్లి చివరికి ఏం చేశారని అడిగారు.

15 రోజులుగా వైసిపి ప్రతి కారుపైనా, జెండా పైనా ముద్రగడ పద్మనాభం బొమ్మ పెట్టి, ప్రచారం చేసిందని, అరాచక శక్తులను బయట జిల్లాల నుంచి తునికి తరలించిందని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని తప్ప కాపుల ప్రయోజనాల కోసం వైసీపీ చేసిందేమీ లేదన్నారు. ఏనాటికీ నిజమైన కాపులు జగన్‌ వంటివారి ప్రవర్తనని హర్షించబోరని ఆయన అన్నారు.

TDP Kapu leaders blames YS Jagan for Thuni incidents

కాపు ముసుగులో వైసీపీ. అరాచకాలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప మండిపడ్డారు. గోదావరి జిల్లాల్లో కాపులు చాలా సౌమ్యులని, అలాంటి వారిని రెచ్చగొట్ట డానికి వైసీపీ ప్రయత్నిస్తున్నదని ఎంపీ అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు.

రాష్ట్ర చరిత్రలోనే కాపులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సందర్భం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లు అధికారంలో ఉన్న నాయకులు కాపుల కోసం ఏమి చేశారని ఆయన ముద్రగడని ఉద్దేశిం చి పరోక్షంగా నిలదీశారు.

తుని ఘటనపై విచారణ జరిపి అసలు బాధ్యులను శిక్షించి తీరాలని ఎమ్మె ల్యే తోట త్రిమూర్తులు డిమాండ్‌ చేశారు. తాము అధికారంలో లేనప్పుడు ప్రాంతాల వారీగా రాజకీయాలు చేసి వైషమ్యాలు సృష్టించడం కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ పార్టీకి అలవాటేనని ఎమ్మెల్యే రామానాయుడు మండిపడ్డారు.

ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌ కాపు రిజర్వేషన్‌ గురించి ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్‌ కుళ్లు రాజకీయాలను తిప్పికొట్టాలని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ కోరారు.

English summary
Telugu Desam Kapu leaders blamed YSR Congress president YS Jagan for Thuni incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X