వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడిపి చివ‌రి అస్ట్రం మిస్ ఫైర్.. బాబును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసిన మోది..

|
Google Oneindia TeluguNews

అవిశ్వాస తీర్మానంతో మోదీ ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం చెప్పాల‌ని భావించిన చంద్ర‌బాబు వ్యూహాన్ని మోదీ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌గ‌లిగారు. అంతే కాకుంగా హోదా అంశంలో ద్వంద్వ ప్ర‌మాణాలు పాటించి తెలుగు ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురిచేసింది చంద్ర‌బాబేన‌ని పార్ల‌మెంట్ సాక్షిగా పేర్కొన్నారు మోదీ. దీంతో చంద్ర‌బాబు నాయుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయారు. చంద్ర‌బాబు త‌న‌ను తాను ర‌క్షించుకుంటూ, ప్ర‌జ‌ల ద్రుష్టిలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం శ్ర‌మిస్తున్న నేత‌గా ముద్ర‌వేసుకుంటూనే., బీజేపికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లే ల‌క్ష్యంగా భ‌విశ్య‌త్ కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

మోదీ చాతుర్యం ముందు కుదేల‌యిన బాబు ఎత్తుగ‌డ‌..

మోదీ చాతుర్యం ముందు కుదేల‌యిన బాబు ఎత్తుగ‌డ‌..

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వాడివేడి చర్చలతో సాగిన అవిశ్వాస తీర్మానం అంతిమంగా తేల్చింది ఏమిటి?. అవిశ్వాస తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీనే అయినా, అది అంతిమంగా టీడీపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఉపయోగపడింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీకి మాత్రం షాక్ తగిలింది. అంతిమ రాజకీయ ‘అస్త్రం' అయిన అవిశ్వాస తీర్మానం వీగిపోవ‌డంతో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక‌ ప్ర‌జా క్షేత్రంలో పోరాటం చేస్తామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బిజెపి ఓడించమని పిలుపునిచ్చేందుకు పావులు క‌దుపుతున్నారు చంద్ర‌బాబు.

Recommended Video

చంద్రబాబు పై పవన్ ట్వీట్లు
కాంగ్రెస్ భూకంపాన్ని చిటికెన వేలుతో అడ్డుకున్న బీజెపి..

కాంగ్రెస్ భూకంపాన్ని చిటికెన వేలుతో అడ్డుకున్న బీజెపి..

లోక్ సభలో జరిగిన చర్చ వ్యవహారం తెలుగుదేశం పార్టీని షాక్ కు గురిచేసింది. ప్రధాని నరేంద్రమోడీ సభ సాక్షిగా జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలా ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారనే విషయాన్ని బహిర్గతం చేశారు. అంతే కాదు, వైసీపీ ట్రాప్ లో పడితే మీరే నష్టపోతారని కూడా తాను చెప్పానని తేల్చిచెప్పారు. తెలంగాణ సీఎం కెసీఆర్ అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే, చంద్రబాబు నిత్యం రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బాబును ఆత్మ‌ర‌క్ష‌న‌లోకి నెట్టింది మోదీ ఐతే చావు దెబ్బ‌తీసింది మాత్రం రాజ్ నాథ్ సంగే..

బాబును ఆత్మ‌ర‌క్ష‌న‌లోకి నెట్టింది మోదీ ఐతే చావు దెబ్బ‌తీసింది మాత్రం రాజ్ నాథ్ సంగే..

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సభ సాక్షిగా ఎన్డీయే నుంచి బయటకు వెళ్లినా చంద్రబాబు తమకు మిత్రుడే అని సభ సాక్షిగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా తమ బంధం తెగిపోయేదికాదని వ్యాఖ్యానించటం టీడీపీ శ్రేణులను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం పెట్టిన చంద్రబాబు రాజ్ నాధ్ సింగ్ చేసిన ‘మిత్రుడి' వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేయలేకపోయారు. రాజా నాథ్ వ్యాఖ్య‌ల ప‌ట్ల చంద్రబాబు న‌ర్మ‌గ‌ర్బంగా వ్య‌వ‌హ‌రించారు త‌ప్ప ప్ర‌తి స్పందించ‌లేదు. రాజ్ నాథ్ తేనె పూసిన క‌త్తితో చంద్ర‌బాబును ఎటాక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తే దాని అంత‌రార్థం మాత్రం ఆల‌స్యంగా తెలుసుకోగ‌లిగారు తెలుగు త‌మ్ముళ్లు. బీజెపి కి చంద్ర‌బాబు మిత్రుడే అన్న వాఖ్య‌ల రూపంలో ప్ర‌తిప‌క్ష పార్టీకి ప‌దునైన ఆయుధాన్ని అందించారు రాజ్ నాథ్.

 త‌న‌కు తాను నిల‌బెట్టుకోవ‌డ‌మే ప్ర‌స్తుత చంద్ర‌బాబు క‌ర్త‌వ్యం..

త‌న‌కు తాను నిల‌బెట్టుకోవ‌డ‌మే ప్ర‌స్తుత చంద్ర‌బాబు క‌ర్త‌వ్యం..

విశాఖ‌ బిజెపి ఎంపీ హరిబాబు కూడా లోక్ సభలో చంద్రబాబు సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగుదేశం తరపున ఏమైనా గట్టిగా హామీ ఇచ్చారా? అంటే అదీ లేదు. ఏదో మొక్కుబడిగా ఏపీకి అన్యాయం జరిగింది అని వదిలేశారు. తప్ప. లోక్ సభ ఎంపీలతో పాటు ప‌లు పార్టీల నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలతో కలసినా పెద్దగా ప్రయోజనం లేకుండానే పోయింది. అంతిమంగా అవిశ్వస తీర్మానంతో రాజకీయంగా ప్రయోజనం పొందుతామని భావించిన చంద్రబాబుకు కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది.

English summary
prime minister modi kept ap cm chandrababu naidu into self defection. modi answer on no trust motion in the parliament given strength to bjp. at the same time tdp became nervous thru modi's answer. now chandrababu planning to future action against bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X