• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రఘురామ సెగ: టీడీపీకి లాల్‌జాన్ భాషా సోదరుడి గుడ్‌బై: ఈ జన్మలో చంద్రబాబు మారడు: లేఖ

|

గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు నాయకుడు, లోక్‌సభ సభ్యుడు కే రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టింది. అంతర్గతగా సెగ పుట్టించింది. ఏ పార్టీకి చెందిన నాయకుడో, ఏ ఎన్నికల గుర్తు మీద గెలిచారనే విషయాన్ని కూడా విస్మరించి..రఘురామ విషయంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పార్టీ క్యాడర్ మొత్తం అత్యుత్సాహాన్ని చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ.. బిగ్ వికెట్ పడింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ఎస్ఎం జియావుద్దీన్ రాజీనామా చేశారు.

మూడు పేజీల బహిరంగ లేఖ

మూడు పేజీల బహిరంగ లేఖ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత లాల్‌జాన్ భాషా సోదరుడు జియావుద్దీన్. ఆవిర్భావం నుంచి లాల్‌జాన్ భాషా కుటుంబం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తోంది. మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేస్తోన్నారు. తాను పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ- చంద్రబాబుకు మూడుపేజీల బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో పనిచేయడం ఇక ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని కుండబద్దలు కొట్టారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే చంద్రబాబు రాజకీయం టీడీపీకి మరణ శాసనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 హిందూ దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంతో మత విధ్వేషాలు

హిందూ దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంతో మత విధ్వేషాలు

అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, అధికారం కోల్పోయినప్పుడు మరొక రకంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, ఇది తనతో పాటు వ్యక్తిత్వం గల ప్రతి ఒక్కరికీ ఇబ్బందికరంగా మారందని చెప్పారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని వివాదం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు స్వీయ దర్శకత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును పావులా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అనుకూల మీడియాతో రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తే..

రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తే..

రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట వేయడానికి రఘురామ కృష్ణంరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేస్తే దీన్ని నిరసిస్తూ చంద్రబాబు రాస్తోన్న ఉత్తరాలు, పడుతోన్న తపన చూస్తోంటే అధికారం కోసం ఎంతకైనా తెగించాలనే చంద్రబాబు నీచ మనస్తత్వానికి అద్దం పడుతోందని జియావుద్దీన్ పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు, ధూలిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర వంటి సొంత పార్టీ నాయకులను అరెస్టు చేసినప్పటి కంటే అధికంగా స్పందిస్తున్నారని అన్నారు. సొంత పార్టీ నాయకులను కూడా పోలీసులు కొట్టలేదని ఏనాడూ ఆరోపించలేదని, వైసీపీ ఎంపీ అరెస్టు పట్ల ఎందుకు ఇంత తపన ఎందుకు పడుతున్నారనేది చంద్రబాబుకే తెలియాలని అన్నారు.

 ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్..

ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్..

రఘురామ కోసం చంద్రబాబు ఢిల్లీలోను లాబీయింగ్‌ చేస్తున్నారని జీయావుద్దీన్ అన్నారు. సీఐడీ అధికారులు తమ నివేదికలో చెప్పిన విషయాలను కూడా పట్టించుకోకుండా రఘురామకకు మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు. నిజాయితీ గల రాజకీయాలను పూర్తిగా వదిలేసి వెన్నుపోటును రాజకీయాలను నమ్ముకున్నారని విమర్శించారు. రఘురామ ఏ పార్టీ తరఫున, ఏ గుర్తు మీద ఎంపీగా గెలిచాడన్నది చంద్రబాబుకు గానీ, ఆయన అనుయాయులతో నిండిన బీజేపీకి గానీ గుర్తే లేదనుకోవాల్సి వస్తోందని జియావుద్దీన్ చెప్పారు.

ఆత్మహత్యా సదృశమే..

ఆత్మహత్యా సదృశమే..

ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఇక ఆత్మహత్యా సదృశమే అవుతుందని జియావుద్దీన్ పేర్కొన్నాు. చంద్రబాబు ఈ జన్మలో మారరనేది స్పష్టమైపోయిందని తేల్చి చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లే పునాదిగా సాగే తెలుగుదేశం పార్టీలో ఇంకా కొనసాగడానికి తన మనస్సాక్షి అంగీకరించట్లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యం, మానవతా విలువలు గల ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పాలని తాను కోరుకుంటున్నానంటూ జియావుద్దీన్ ముగించారు.

  Gynaecologist Dr Abhinaya Alluri Interview PART 3 | oneindia telugu
  English summary
  Former chairman of state minorities commission SM Ziauddin has quit from Telugu Desam Party (TDP) alleging that party Chief Chandrababu had been deliberately trying to vitiate the communal harmony in the state on Monday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X