వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డి గెలిచారు : ప‌వ‌న్ అందుకు కార‌ణ‌మ‌య్యారు : హీరో సుమ‌న్ సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ముఖ హీరో..టీడీపీ నేత సుమ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. టీడీపీలో ఎంతో కాలంగా కొన‌సాగుతున్న సుమ‌న్ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డి గెలిచార‌ని వ్యాఖ్యానించారు. అదే విధంగా తాజాగా ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ తీస‌కుంటున్న నిర్ణ‌యాల‌ను అభినందించారు. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పైనా సుమ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. టీడీపీలో కొన‌సాగుతూ..గ‌త ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఆశించిన సుమ‌న్ ...ఇప్పుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గురించి చేసిన వ్యాఖ్య‌లు ఇటు పొలిటిక‌ల్గా..అటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

జ‌గ‌న్ ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు..

జ‌గ‌న్ ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు..

హీరో సుమ‌న్ చాలా కాలంగా టీడీపీలో కొన‌సాగుతున్నారు. అనేక సార్లు పార్టీ అధినేత చంద్ర‌బాబుతోనూ స‌మావేశం అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ నుండి పోటీ చేస్తార‌నే ప్ర‌చార‌మూ సాగింది. అయితే ఆయ‌న‌కు టిక్కెట్ మాత్రం ద‌క్క‌లేదు. ఎన్నిక‌ల వేళ కొన్ని ప్రాంతాల్లో ఆయ‌న త‌న‌కు సన్నిహితంగా ఉన్న‌వారి కోసం ప్ర‌చారం సైతం నిర్వ‌హించారు. అయితే, ఇప్పుడు ఆయ‌న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ పైన కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నో క‌ష్టాలు ప‌డి ఘ‌న విజ‌యం సాధించార‌ని అభినందించారు. త‌న కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సమన్యాయం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఏపీకీ సినిమా ప‌రిశ్ర‌మ‌ను కూడా తీసుకొచ్చి అన్ని ర‌కాలుగా ఆదుకోవాల‌ని ఆయ‌న సీఎంకు విజ్క్ష‌ప్తి చేసారు.

 అందుకు ప‌వ‌న్ కార‌ణం...

అందుకు ప‌వ‌న్ కార‌ణం...

హీరో సుమ‌న్ నూత‌న మ‌ఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను అభినందిస్తూనే..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పైన కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఏపీలో టీడీపీ ఓడిపోవ‌టానికి ప‌వ‌న్ క‌ల్యాణే కార‌ణ‌మ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. తన‌కు ఊహ తెలిసిన త‌రువాత ఒకే పార్టీకి ఇన్ని సీట్టు రావ‌టం ఇదే తొలి సారి అంటూ ఆయ‌న జ‌గ‌న్‌ను అభినందించారు. ప‌వ‌న్ రాజ‌కీయంగా టీడీపీని అనేక సార్లు విమ‌ర్శించినా..అదే సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెంది టీడీపీలో ఉంటున్న సుమ‌న్ ఏనాడు స్పందించ‌లేదు. ఇక‌, ఇప్పుడు టీడీపీ ఓటమికి మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార‌ణ‌మ‌ని చెప్ప‌టంతో కొత్త చ‌ర్చ మొద‌లైంది. టీడీపీ అధినేత త‌మ పార్టీ నేత‌ల‌లో అస‌లు పార్టీ ఓడిపోవ‌టానికి కార‌ణం క‌నిపించ‌టం లేద‌ని వ్యాఖ్యానించారు. ఫలితాల ముందు మాత్రం ప‌వ‌న్ కొన్ని చోట్ల త‌మ అవ‌కాశాల‌ను దెబ్బ తీసార‌ని వ్యాఖ్యానించారు.

సుమన్ టీడీపీని వీడుతారా..

సుమన్ టీడీపీని వీడుతారా..

తాజాగా ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక మంది సినీ రంగ ప్ర‌ముఖులు వైసీపీలో చేరారు. సుమ‌న్ మాత్రం టీడీపీ విజ‌యం కోసం ప‌ని చేసారు. ఇప్పుడు స‌డ‌న్‌గా సుమన్ వ్యాఖ్య‌లు చూస్తుంటే ఆయ‌న టీడీపీని వీడే ప‌రిస్థితులు క‌నిపిస్తోంది. ఆయ‌న వ్యాఖ్య‌లు లోతుగా ప‌రిశీలిస్తే ఆయ‌న వైసీపీలో చేరుతారా అనే చ‌ర్చ మొద‌లైంది. అందులో భాగంగానే జ‌గ‌న్ పైన అభినంద‌న‌లు కురిపిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, ఇప్పుడు సుమ‌న్ వ్యాఖ్య‌ల మీద టీడీపీ నేత‌లు ..ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
TDP leader and Hero Suman sensational comments on AP CM Jagan and Janasena Chief Pawan Kalyan. He says jagan faced many struggles to become CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X