• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఘట్టమనేని ఘర్ వాపసీ?: విజయసాయి రెడ్డితో ఆదిశేషగిరి రావు భేటీ: భిన్నాభిప్రాయాలకు

|

అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత, పద్మాలయా స్టూడియోస్ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మళ్లీ సొంత గూటికి రానున్నారా? ఆ ఉద్దశం ఆయనలో ఉందా? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డిని కలిశారా? ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో నడుస్తోన్న చర్చ ఇది. సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడైన ఆదిశేషగిరి రావు హఠాత్తుగా సాయిరెడ్డిని కలుసుకోవడం వెనుక ఉన్న కారణం అదేనని అంటున్నారు.

తిరుమలలో ఆధ్యాత్మిక సౌరభం ఆరంభం: శ్రీవారికి జ్యేష్టాభిషేకం: గోవిందుడి నామస్మరణతో

తొలుత కాంగ్రెస్‌లో, అనంతరం వైఎస్ఆర్సీపీలో సుదీర్ఘకాలం కొనసాగారు ఆదిశేషగిరి రావు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోటరీలోని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కొనసాగారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. గత ఏడాది జనవరిలో.. ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించారు. చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. అక్కడ ఇమడలేకపోతున్నారనేది టాక్. తాజాగా- మళ్లీ ఆదిశేషగిరి రావు సొంత గూటికి రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు.

TDP leader and Producer G Adiseshagiri Rao meets YSRCP MP Vijayasai Reddy

వైసీపీలో నంబర్ టు స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డిని కలుసుకోవడానికి గల కారణం అదేనని చెబుతున్నారు. ఆదిశేషగిరి రావు ఘర్ వాపసీ లాంఛనమేననే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వ్యక్తిగత కారణాలతో ఆదిశేషగిరి రావు విజయసాయి రెడ్డిని కలుసుకున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కృతజ్ఙతలు తెలుపుకోవడానికి వచ్చారనీ అంటున్నారు.

  AP CM Jagan Launches YSR Vahana Mithra| Rs.10,000 to Auto, Taxi Drivers Beneficiaries

  నిజానికి కృష్ణకు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడిగా పేరుంది. పెద్దల్లుడు గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నా ఆ పార్టీకి తాను అనుకూలం కాదని చెబుతూ వచ్చారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తోన్న సమయంలోనే ఆయనకు అనుకూలంగా ప్రకటనలు చేశారు కృష్ణ. ఈ జోష్ చూస్తోంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని తేల్చి చెప్పారు. వైసీపీని దెబ్బకొట్టడంలో భాగంగా.. చంద్రబాబు ఆదిశేషగిరి రావును టీడీపీలో చేర్చుకున్నారు. అయినప్పటికీ.. అటు కృష్ణ గానీ, ఆయన కుమారుడు మహేష్‌బాబు గానీ టీడీపీకి అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

  English summary
  Telugu Desam Party leader and Padmalaya Studios Chief Ghattamaneni Adiseshagiri Rao meets YSR Congress Party Parliamentary Party President V Vijayasai Reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more