వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భరత్ అనే నేను, శ్రీమంతుడు మూవీలో మాదిరిగా.. సీఎం జగన్‌కు టీడీపీ అనిత సెటైర్స్

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మరోసారి రెచ్చిపోయారు. ఏపీ సర్కార్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. సమన్యాయ పాలన, అభివృద్ది అంశాల లక్ష్యంగా విమర్శలు చేశారు. అధికారం చేపట్టినప్పటీ నుంచి చేసిన సంక్షేమ పనులను మాత్రం మరచి.. ఇతర అంశాలపై ఫోకస్ చేశారని విరుచుకుపడ్డారు. దళితులపై దాడులు, టీడీపీ నేతల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు.

సినిమాల గురించి..

ఈ సారి సినిమాల గురించి అనిత ప్రస్తావన తీసుకొచ్చారు. మహేశ్ బాబు రెండు సినిమాల్లోని నీతిని ట్వీట్ చేశారు. భరత్ అనే నేను మూవీలో ఫైన్ వేశారని గుర్తుచేశారు. ఏపీలో లిక్కర్ ధర కానీ, ఇతర ఫైన్ల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. మరీ అదే సినిమాలో సొత వాళ్లని కూడా వదల్లేదు కదా అని అడిగారు. మీరు చెబుతోన్న మొదటి నీతి మాదిరిగానే.. రెండో అంశం ఉంటుంది కదా అన్నారు. దానిని ఎందుకు మరచిపోతున్నారని ఆమె ప్రశ్నించారు.

రోడ్లు వేశారనీ..

రోడ్లు వేశారనీ..

మరో సినిమాలో హీరో మహేశ్ బాబు రోడ్లు వేశాడని చెబుతున్నారు. శ్రీమంతుడులో ఊరి బాగు కోసం కృషి చేశారు కదా అన్నారు. మరీ రాష్ట్రంలో రోడ్లు, ఇతర అభివృద్దిపై దృష్టిసారించాలని కోరారు. ఇందులో ఎందుకు జాప్యం అవుతోందని అడిగారు. ఓ హీరో ఊరి కోసం చేస్తే.. మీరేందుకు చేయరని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉంటే.. అభివృద్ది పనులు ఎందుకు చేయడం లేదన్నారు.

Recommended Video

Watch Video : TDP Anitha Vs YSRCP Giddi Eswari @ AP Assembly Media Point - Oneindia Telugu
ప్రభుత్వం, సీఎం జగన్..

ప్రభుత్వం, సీఎం జగన్..


గత కొద్దీరోజులుగా టీడీపీ అనిత విరుచుకుపడ్డారు. టీడీపీ లక్ష్యంగా ప్రభుత్వం చేస్తోన్న దాడులను ఎండగడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను సంధిస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రజలకు మంచి చేయడం లేదని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

English summary
tdp anitha slams cm ys jagan on various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X