కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో మాజీమంత్రి అరెస్టు తప్పదా? టీడీపీలో వర్గపోరు: సీనియర్ నేత హత్యకు కుట్ర: ఎస్పీకి చేరిన

|
Google Oneindia TeluguNews

కడప: తెలుగుదేశం పార్టీలో మొదలైన వర్గపోరు.. మాజీమంత్రి అరెస్టుకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఇద్దరు మాజీమంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు. విచారణను ఎదుర్కొంటున్నారు. అదే జాబితాలో మరో మాజీ కూడా చేరే అవకాశాలు లేకపోలేదు. దీనికి కారణం మాత్రం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గపోరే కారణం. సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. క్రమంగా అరెస్టులకు దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ చైనా: రెండూ కావాల్సిన దేశాలే: ట్రంప్ స్నేహగీతం: ఏమైనా..ఎందాకైనాఐ లవ్ ఇండియా.. ఐ లవ్ చైనా: రెండూ కావాల్సిన దేశాలే: ట్రంప్ స్నేహగీతం: ఏమైనా..ఎందాకైనా

ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు, హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్టు అయ్యారు. తాజాగా మరో మాజీమంత్రి భూమా అఖిలప్రియ హత్యారోపణలను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య నెలకొన్న వివాదాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. తనను హత్య చేయడానికి అఖిలప్రియ కుట్రపన్నారంటూ బహిరంగంగా విమర్శలను గుప్పిస్తూ వచ్చిన ఆయన ఈ సారి..ఫిర్యాదుల దాకా వెళ్లారు. భూమా అఖిలప్రియ నుంచి తనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆమెను అరెస్టు చేయాలని కోరుతూ ఏవీ సుబ్బారెడ్డి విజ్ఙప్తి చేశారు.

TDP leader AV Subba Reddy lodged a complaint against same party leader Bhuma Akhila Priya

దీనిపై ఆయన కడప జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అన్బురాజన్‌ను కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు. తనను హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో అయిదుమందిని పోలీసులు అరెస్టు చేశారని, భూమా అఖిలప్రియ ఇంకా బయటే తిరుగుతున్నారని అన్నారు. ఈ కేసులో అఖిలప్రియను ఏ4 పోలీసులు గుర్తించారని చెప్పారు. ఆమెను మినహాయించి అయిదుమందిని అరెస్టు చేశారని చెప్పారు. ఏ1 సహా ఏ6 వరకు అందరినీ అరెస్టు చేసినా.. ఏ4గా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోందని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

Recommended Video

Bigg Boss 4 Telugu : Bigg Boss 4 రచ్చ రచ్చే.. కంటెస్టెంట్లు గా జిగేల్‌మనిపించే అందాలు..!

అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అఖిల ప్రియ తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారనే విషయం ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శించారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం రాజకీయంగా తనను ఎదుర్కొనలేకపోతోందని, అందుకే హత్య చేయడానికి కుట్ర పన్నారని విమర్శించారు. తనను హత్య చేయించడానికి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ కిరాయి హంతకులను నియమించారని, వారికి సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులోనే తేలిందని అన్నారు.

English summary
Allagadda in Kurnool district of Andhra Pradesh TDP senior leader AV Subba Reddy has demanded Superintendent of Police of Kadapa Anburajan to immediately arrest the former minister Bhuma Akhilapriya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X