నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు నంద్యాల మరోషాక్: ఏవీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిడిపిలో సంక్షోభం కొనసాగుతోంది.భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి టిడిపికి షాకిచ్చే ప్రకటన చేశారు. తనకు వైసీపీ నుండి కూడ ఆఫర్ ఉందని ప్రకటించారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిడిపిలో సంక్షోభం కొనసాగుతోంది.భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి టిడిపికి షాకిచ్చే ప్రకటన చేశారు. తనకు వైసీపీ నుండి కూడ ఆఫర్ ఉందని ప్రకటించారు. ఉప ఎన్నికల వరకే తాను టిడిపి కోసం పనిచేస్తానని చెప్పారు.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం టిడిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాలు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కల్గించేలా ఉన్నాయి. అయితే నష్టనివారణ కోసం పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.

Tdp leader AV Subba Reddy sensational comments on Ap minister Bhuma Akhilapriya

నంద్యాలలో టిడిపి కౌన్సిలర్లతో సమావేశమైన ఏవీ సుబ్బారెడ్డిని కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాసులు ఆయనకు ఫోన్ చేశారు. అయితే ఈ ఫోన్లతో ఏవీసుబ్బారెడ్డి హైద్రాబాద్ లో కేంద్రమంత్రి సుజనా చౌదరితో చర్చించారు.

అయితే ఏవీ సుబ్బారెడ్డితో కేంద్రమంత్రి సుజానాచౌదరి చర్చించారు. నంద్యాలలో టిడిపి కౌన్సిలర్లంతా తనకే మద్దతుగా ఉన్నారని ఆయన చెప్పారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలవరకు టిడిపికే పనిచేస్తానని చెప్పారు.

ఉప ఎన్నికల తర్వాత ఏం జరుగుతోందోనని తనకు తెలియదన్నారు. వైసీపీ నుండి కూడ తనకు ఆఫర్ ఉందన్నారు. నంద్యాలలో భూమావర్గాన్ని తానే తయారు చేసినట్టుగా ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. అయితే తననకు మంత్రి అఖిలప్రియ ఎందుకు పక్కన పెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు.

భూమానాగిరెడ్డి తనకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం 25 శాతం కూడ అఖిలప్రియ ఇవ్వడం లేదన్నారు. అసలు తనను పక్కనపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

కర్నూల్ నేతలతో బాబు శనివారం ప్రత్యేక సమావేశం

కర్నూల్ జిల్లా నేతలతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శనివారం నాడు సమావేశం కానున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నాయకుల మద్య విబేధాలపై చంద్రబాబునాయుడు చర్చించనున్నారు. కర్నూల్ నేతలను అమరావతికి రావాలని బాబు ఆదేశించారు. తాజాగా మంత్రి అఖిలప్రియపై భూమా నాగిరెడ్డి కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకొంది. ఏవీ సుబ్బారెడ్డితో చర్చించిన కేంద్రమంత్రి సుజానా చౌదరి శుక్రవారం నాడు చర్చించారు. ఈ విషయాన్ని బాబుకు చేరవేశారు.

కర్నూల్ నేతల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు బాబు పార్టీ నాయకులతో చర్చించనున్నారు. ఉప ఎన్నికలు రానున్న తరుణంలో నాయకుల మద్య విబేధాలు పార్టీకి నష్టమనే అభిప్రాయంతో టిడిపి నాయకత్వం ఉంది.దీంతో చంద్రబాబునాయుడు కర్నూల్ నేతలు అమరావతికి రావాలని ఆదేశించారు.

English summary
Nandyala Tdp leader AV Subba Reddy sensational comments on Ap minister Bhuma Akhilapriya.Ysrcp leaders asking to join party he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X