వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేయిచ్చారు: గులాబీ జట్టులో బాబు మోహన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్, మల్కాజిగిరి కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు ఆకుల రాజేందర్‌లు బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

వారికి తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.

తెలంగాణ తలరాత మారాలంటే టిఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని కె చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. ఎవరెన్ని శాపాలు పెట్టినా నూటికి నూరుపాళ్ళు టిఆర్‌ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెరాస

తెరాస

తెలంగాణ భవన్‌లో బుధవారం మాజీ మంత్రి బాబు మోహన్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థల అధిపతి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ తదితరులు కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

తెరాస

తెరాస

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ తలరాత మారాలంటే పాత ప్రభుత్వాల వల్ల అయ్యే పనికాదని, కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, కొత్త పంథాతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.

తెరాస

తెరాస

వచ్చిన తెలంగాణ రాష్ట్రం సార్ధకం కావాలన్నా, మంచి జరగాలన్నా మంచి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తెరాస

తెరాస

మంచి ప్రభుత్వం రావాలంటే అవినీతి అంతం కావాలని ఆయన అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు ఆకాశంనుంచేమి ఊడిపడలేదని, ఆ పార్టీల వల్లనే తెలంగాణకు సకల కష్టాలు వచ్చాయని ఆయన ధ్వజమెత్తారు.

తెరాస

తెరాస

తెలంగాణకు ఇంతకాలం నష్టం చేసిన పార్టీలే ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో గోల్‌మాల్ చేయాలని చూస్తున్నాయని కెసిఆర్ దుయ్యబట్టారు.

తెరాస

తెరాస

లక్ష కోట్లు దోచుకున్నోడు అధికారంలోకి వస్తే మళ్లీ దోపిడీ చేయాలని చూస్తాడు తప్ప అభివృద్ధి చేస్తాడా? అని కె చంద్రశేఖర రావు ప్రశ్నించారు.

తెరాస

తెరాస

కాంగ్రెసు, టిడిపి పార్టీలు ఆశ చూపుతున్న డబ్బులకు, తాయిలాలకు ప్రజలు మోసపోవద్దని కె చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

తెరాస

తెరాస

టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని, నాలుగు లక్షల మంది పేద విద్యార్థులకు నిర్బంధ విద్యను అమలు చేస్తామని, కోటి ఎకరాలకు సాగునీటిని తీసుకొస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.

తెరాస

తెరాస

పార్టీలో ఉన్నవారందరికి, కష్టపడిన వారందరికి ఎన్నికలలో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాదని కెసిఆర్ ఈ సందర్భంగా అన్నారు.

తెరాస

తెరాస

ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ తెలంగాణ ఉద్యమంలో ముందున్నారని, ఆయనను అసెంబ్లీకిగానీ, పార్లమెంట్‌కుగానీ పంపించే బాధ్యత తనపై ఉందని అన్నారు.

తెరాస

తెరాస

నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని, ఆయనకు తొలి ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు.

తెరాస

తెరాస

మాజీ మంత్రి బాబు మోహన్, ఆయన తనయుడు ఉదయ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, అనురాగ్ విద్యాసంస్థల చైర్మన్ సి రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ సీతారాంనాయక్ తదితరులు తెరాసలో చేరారు.

తెరాస

తెరాస

తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజారాజ్యం గ్రేటర్ అధ్యక్షుడిగా చేసి, ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఫిరోజ్‌ఖాన్ తెరాసలో చేరనున్నారు.

తెరాస

తెరాస

గత ఎన్నికల్లో నాంపల్లి నుంచి చిరంజీవని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్ మజ్లిస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

తెరాస

తెరాస

తెలంగాణ భవన్‌లో బుధవారం మాజీ మంత్రి బాబు మోహన్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థల అధిపతి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ తదితరులు కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

తెరాస

తెరాస

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ తలరాత మారాలంటే పాత ప్రభుత్వాల వల్ల అయ్యే పనికాదని, కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, కొత్త పంథాతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.

తెరాస

తెరాస

వచ్చిన తెలంగాణ రాష్ట్రం సార్ధకం కావాలన్నా, మంచి జరగాలన్నా మంచి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు

తెరాస

తెరాస

మంచి ప్రభుత్వం రావాలంటే అవినీతి అంతం కావాలని ఆయన అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు ఆకాశంనుంచేమి ఊడిపడలేదని, ఆ పార్టీల వల్లనే తెలంగాణకు సకల కష్టాలు వచ్చాయని ఆయన ధ్వజమెత్తారు.

తెరాస

తెరాస

తెలంగాణకు ఇంతకాలం నష్టం చేసిన పార్టీలే ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో గోల్‌మాల్ చేయాలని చూస్తున్నాయని కెసిఆర్ దుయ్యబట్టారు.

తెరాస

తెరాస

లక్ష కోట్లు దోచుకున్నోడు అధికారంలోకి వస్తే మళ్లీ దోపిడీ చేయాలని చూస్తాడు తప్ప అభివృద్ధి చేస్తాడా? అని కె చంద్రశేఖర రావు ప్రశ్నించారు.

English summary
Former Minister and TDP leader P. Babu Mohan is all set to join Telangana Rashtra Samiti (TRS). A public meeting would be held Jogipet on April 1 where party president K. Chandrasekhar Rao will formally admitting Mr. Babu Mohan in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X