వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికలు ముగిసినా ఉద్రిక్త వాతావరణం మాత్రం ఇంకా కొనసాగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని ఇందిరా నగర్ నాలుగో వార్డులో నివాసముండే తాడిబోయిన ఉమా యాదవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది .

ముగ్గురు దుండగులు కత్తులతో వచ్చి హత్యచేసి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ వచ్చింది ఎవరు ? ఎందుకు హత్య చేశారు ? ఏమైనా రాజకీయ కక్షలా ? లేదా వ్యక్తిగత కక్షలా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

 TDP leader brutally murdered in Mangalagiri

ఉమా యాదవ్ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు అనుచరుడిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు కాండ్రు కమలతో పాటు టీడీపీలో చేరిన ఉమా యాదవ్ ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేరినా ఉమా యాదవ్ మాత్రం టీడీపీలోనే ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ కోసం బాగానే పని చేశారు . దుండగుల దాడిలో మృతి చెందిన ఉమా యాదవ్ గతంలో జరిగిన ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఎన్నికల సమయంలో మంగళగిరిలో కీలక నేతగా వ్యవహరించిన ఉమా యాదవ్ హత్యకు గురికావటం పట్ల టీడీపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇక గత ఎన్నికల్లో మంగళగిరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన నారా లోకేష్ గెలవాలని ఉమా యాదవ్ ప్రచారం నిర్వహించారు. మంగళగిరి పట్టణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు . ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
TDP leader was brutally murdered near his residence at Mangalagiri town on Tuesday. According to the reports, the victim was identified as Uma Yadav. Unidentified persons have murdered him with sharp objects probably with Knives and TDP leader died on the spot. It is alleged that the deceased is accused in another murder case. It is also said that in the recent election, he has actively participated in the election campaigning process of Nara Lokesh in Mangalagiri. Police have registered the case and have begun the investigation process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X