వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవినేని ఉమపై రాళ్ల దాడి: కారు ధ్వంసం -ఎమ్మెల్యే వసంతపై చంద్రబాబు ఫైర్ -కొండపల్లి మైనింగ్‌పై

|
Google Oneindia TeluguNews

కృష్ణా జిల్లాలో మరోసారి రాజకీయ విభేదాలు హింసాత్మకంగా మారాయి. జిల్లాలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ వ్యవహారం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య గొడవకు కారణమైంది. కొండపల్లి అడవిలో అక్రమ మైనింగ్ సాగుతోందని ఆరోపిస్తోన్న టీడీపీ నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లగా, వారిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వివరాలివి..

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలుజగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమపై అనుమానిత వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడి దేవినేని కారు అద్దాలు ధ్వసమయ్యాయి. గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ పారెస్ట్‌లో అవకతవకలను పరిశీలించేందుకు వెళ్లగా మంగళవారం ఈ సంఘటన జరిగింది. జి.కొండూరు మండలంలో రెండు వైపుల నుంచి వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

 tdp leader devineni uma allegedly attacked by ysrcp, chandrababu slams mylavaram mla

అనుమానిత వైసీపీ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. కారును ధ్వంసం చేసి దేవినేని ఉమను నిర్బంధంలోకి తీసుకున్నారని, పోలీసుల రంగప్రేవేశంతో దేవినేని సురక్షితంగా బయటపడగలిగారని తెలుస్తోంది. కాగా, దేవినేనిపై దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కొండపల్లి ఫారెస్టులో స్థానిక మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని బాబు ఆరోపించారు.

భార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగభార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగ

వైసీపీ వాళ్ల అవినీతి,అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడుతున్నారని, ప్రజా సంపదను వైసీపీ నేతలు దోచుకుంటుంటే ప్రజల తరపున టీడీపీ నేతలు అడ్డుకోవడం తప్పా అని చంద్రబాబు నిలదీశారు. మైనింగ్‌ను అడ్డుకుంటే హత్యాయత్నాలు, బెదిరింపులకు పాల్పడుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఒక్క నాయకుడిపై కనీసం 100 మంది వైసీపీ గుండాలు దాడికి పాల్పడటం పిరికిపింద చర్య అని చంద్రబాబు అన్నారు.

English summary
Former minister and TDP leader Devineni Uma Maheswara Rao was allegdly attacked by ysrcp activists on tuesday at kondapalli area. when uma visited mining area, his car was surounded and stones pelded. condemdind the attack, tdp chief chandrababu blames mylavaram mla Vasantha Venkata Krishna Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X