డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఫ్యామిలీలు - రకుల్ ప్రీత్‌కు ఉన్నదేంటి?: టీడీపీ నేత దివ్యవాణి సంచలనం
అటు బాలీవుడ్.. పక్కన శాండల్ వుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోన్న వేళ.. నార్కోటిక్స్ బ్యూరో, సీబీఐ, ఈడీలు ఆయా ఇండస్ట్రీల్లోని ప్రముఖ నటీనటుల్ని వరుసగా విచారిస్తూ, అరెస్టులు సైతం చేసిన తరుణంలో.. తెలుగు సినీ పరిశ్రమ(టాలీవుడ్) గురించి ప్రముఖ నటి, టీడీపీ అధికారిక ప్రతినిధి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ టాప్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ను ఉద్దేశించి కూడా దివ్యవాణి అనూహ్య కామెంట్లు చేశారు.
శ్రీకృష్ణ జన్మభూమి వివాదం: మసీదు తొగింపుపై 30 నుంచి మధుర కోర్టులో విచారణ - అసదుద్దీన్ అభ్యంతరం

డ్రగ్స్ మత్తులో బడా ఫ్యామిలీలు..
తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా బలంగా ఉందని, ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలుగా, గొప్ప వ్యక్తులు అనుకున్నవాళ్ల కుటుంబాల్లో సైతం మాదకద్రవ్యాల అలవాటు ఉందని, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారని, వివిధ అవసరాల కోసం ఎంతకైనా దిగజారే మనుషులు సినీరంగంలో బోలెడు మంది ఉన్నారని టీడీపీ నేత దివ్యవాణి చెప్పారు.
పోలీస్ బాస్ రాసలీలలు: బయటపెట్టిన భార్యపై దాడి - వీడియో వైరల్ - సీఎం సీరియస్ - విదేశాల్లో విలాసాలు

రౌండ్ టేబుల్ సమావేశం..
తెలంగాణలో మహిళా సమస్యలు, పలు రంగాల్లో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం పోషిస్తోన్న పాత్ర లాంటి అంశాలతోపాటు ‘తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత-ఏర్పాటు' ప్రధానాంశంగా తెలంగాణ టీడీపీ తెలుగు మహిళా విభాగం ఆద్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి టీడీపీ మహిళా నేతలు దివ్యవాణి, జ్యోత్స్న, బీజేపీ నేత గీతామూర్తి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్. రమణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే దివ్యవాణి మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

రకుల్ కు ఉన్నదేంటి?
‘‘అవకాశాల కోసం దిగజారే జనాలు సినీ రంగంలో ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటి? సినీ రంగంలో కూడా డబ్బు ఉన్నవారిదే రాజ్యం. ఇక్కడ మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. తక్షణమే మహిళా కమిషన్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'' అని దివ్యవాణి అన్నారు.

నా కూతురి కాలేజీలోనూ..
ఇటీవల వస్తున్న సినిమాలు పిల్లలతో కలిసి చూసేలా లేవని, సినిమా రంగంతోపాటు ఇంకొన్ని చోట్లా మహిళలకు చాలా ఇబ్బందులున్నాయని, తాను పెద్ద హీరోలతో నటించకపోవటానికి, ఎక్కువ సినిమాలు చేయకపోవటానికి ఇలాంటి కారణాలే ఉన్నాయని టీడీపీ నేత దివ్యవాణి చెప్పారు. తన కూతురు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నదని, అక్కడ కూడా విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని, కొంతమందైతే బానిసలుగా మారారని వాళ్లను తలుచుకుంటేనే భయమేస్తోందని దివ్యవాణి పేర్కొన్నారు. మాజీ నటి తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి.