వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిన టీడీపీ నేత: అరెస్ట్ చేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

తన సంతకాన్ని, తన లెటర్ హెడ్ ను ఫోర్జరీ చేశారని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత హోం మంత్రికి , డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు . కడప జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తన లెటర్ హెడ్ ను , సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపీని, హోం మంత్రి సుచరితను కోరారు.

మండలి కార్యదర్శిపై చైర్మన్ సీరియస్ ..సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు హుకుం..ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ !!మండలి కార్యదర్శిపై చైర్మన్ సీరియస్ ..సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు హుకుం..ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ !!

ఇక అసలు విషయానికి వస్తే కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి తనకు అసైన్డ్ భూమి కేటాయించాలంటూ మంత్రి వనిత సంతకాన్ని ఫోర్జరీ చేశారు. అంతేకాదు లెటర్ హెడ్ ను కూడా సృష్టించిన ఆయన ఏకంగా కలెక్టర్‌కు ఆ లేఖ పంపించారు. అయితే లెటర్‌ హెడ్ పై మంత్రి వనిత సంతకాన్ని తప్పుగా పెట్టడంతో రెడ్డప్ప అధికారులకు దొరికిపోయారు. అతను టీడీపీ నేత కావటంతో స్థానికంగా అది చర్చనీయాంశం అయ్యింది.

TDP leader forged the signature of the YCP minister .. police arrested the accused

ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి వనిత ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుని హోంమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీడీపీ నేత ప్రభుత్వ అసైన్డ్ భూముల కోసం మంత్రి లెటర్ హెడ్, సంతకాన్ని ఫోర్జరీ చేసి కలెక్టర్‌కు సిఫార్సు లేఖ పంపటంపై అటు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది.

English summary
Andhra Pradesh Minister Tanneti Vanitha has complained to the home minister and DGP Goutam Sawang under against the forgery of her signatures.Reddappa, a native of Kadapa district, had forged the minister's signature to allocate him assigned land. He also created a letterhead and sent it to the collector. Since he was the leader of the TDP, it has been the subject of debate locally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X